మెరుపు వేగంతో చంద్రుని పక్కనుంచి దూసుకెళ్లిన ఆ వస్తువేంటి..? వైరల్ వీడియో ఇదే..?

By Hazarath
|

జనవరి 31న ఆకాశం ఓ అద్భుతానికి వేదికైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజున ఆ అరుదైన అద్భుతంతో పాటు ఓ అంతుచిక్కని వస్తువు ఆకాశంలో చక్కర్లు కొడుతూ కనిపించింది.అయితే అది ఏంటనే దానిపై రకరకాల అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొందరు అది ఏలియన్స్ కి చెందినదిగా భావిస్తున్నారు. కాగా ఈ వస్తువు చంద్రుని పక్కనుంచి మెరుపువేగంతో దూసుకెళ్లిందని వీడియో తెలుస్తోంది.

 

ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫాస్ట్‌గా టైపింగ్ చేయాలా, ఇలా చేయండి !ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫాస్ట్‌గా టైపింగ్ చేయాలా, ఇలా చేయండి !

జనవరి 31న..

జనవరి 31న..

జనవరి 31న ఆకాశం ఓ అరుదైన, అద్భుతమైన దృశ్యానికి వేదికైన విషయం అందరికీ తెలిసిందే. చల్లని చంద్రుడు... సూపర్‌ మూన్‌, బ్లూ మూన్‌, బ్లడ్‌ మూన్‌లను ఒకేసారి తన వెంట పెట్టుకుని వచ్చాడు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు జనాలు ఎగబడ్డారు.

సూపర్‌ మూన్‌ పిక్చర్లను ..

సూపర్‌ మూన్‌ పిక్చర్లను ..

ఆ రోజున ప్రపంచం మొత్తం ఈ చంద్రగ్రహణాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు. సోషల్‌ మీడియా సైతం ఈ సూపర్‌ మూన్‌ పిక్చర్లను షేరింగ్ తో దూసుకుపోయింది.ప్రతి ఒక్కరూ దాన్ని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పెట్టేశారు.కొన్ని ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి.

 చంద్రుని పక్కనుంచి మెరుపు వేగంతో..
 

చంద్రుని పక్కనుంచి మెరుపు వేగంతో..

అయితే ఈ గ్రహణ సమయంలో చంద్రుని పక్కనుంచి మెరుపు వేగంతో వెళ్లిన ఓ వస్తువుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాసా విడుదల చేసిన వీడియోలో ఈ వస్తువు కనిపించింది. సూపర్‌ మూన్‌ సందర్భంగా ఇలా వెళ్లిన వస్తువును ఏలియన్లుగా భావిస్తున్నారు.

ఆ వస్తువు కనిపించడం ద్వారా..

ఆ వస్తువు కనిపించడం ద్వారా..

ఆ వస్తువు కనిపించడం ద్వారా ఏలియన్స్ ఉన్నారనేందుకు నిదర్శనమని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. మనుషులు తయారు చేసిన వాహనమైతే ఇంత వేగంగా వెళ్లడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా ఈ వస్తువు చంద్రుని చుట్టూ ప్రదక్షిణలు చేసింది. చంద్రుణి చుట్టూ తిరిగిన ఈ గుర్తు తెలియని వస్తువు కచ్చితంగా ఏలియన్స్‌కు చెందినదేనని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.

చంద్రునికి ఎడమ వైపుకు కిందకి పడిపోతూ..

చంద్రునికి ఎడమ వైపుకు కిందకి పడిపోతూ..

మెరుపు వేగంగా చంద్రునికి ఎడమ వైపుకు కిందకి పడిపోతూ ఉందని, అలా కిందకి ట్రావెల్‌ చేసినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. కాగా యూట్యూబ్‌ ఛానల్‌ యూఎఫ్‌ఓమానియాలో ఈ వీడియోను అప్‌లోడ్‌ చేశారు. ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

నాసా పోస్ట్ చేసిన వీడియో..

అయిత ేఈ వీడియోని మీరు కూడా చూసి అది ఏంటనేది ఓ సారి గెస్ చేయండి. 

Best Mobiles in India

English summary
UFO caught on shocking lunar eclipse video? Shock super moon alien claims go viral More news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X