రాత్రికి రాత్రే పొలాల్లో గొయ్యలు, వింత ఆకారాలు

Written By:

అంతుచిక్కని రహస్యాలు ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి. అకస్మాత్తుగా పంటపొలాల్లో పెద్దపెద్ద గొయ్యిలు ఏర్పడడం, వింతైన గోళాకారపు వస్తువులు ఆకాశంలో నుంచి అమాతంగా వచ్చిపడుతుండడం వంటి అంశాలు పలు ప్రాంతాల్లో చోటుచోచేసుకుంటున్నాయి.

రాత్రికి రాత్రే పొలాల్లో గొయ్యలు, వింత ఆకారాలు

పంటపొలాల్లో గొయ్యిలు ఎందుకు ఏర్పడుతున్నాయి? అంతరిక్షం నుంచి అమాంతంగా వచ్చిపడుతున్న ఆ వస్తువులేంటి? అవి తమ ప్రాంతంలోనే ఎందుకు పడుతున్నాయో చెప్పమంటా ఆయా ప్రాంతవాసులు స్థానిక అధికారులను, శాస్త్రవేత్తలను నిలదీస్తున్నారు. ఈ అంతుచిక్కని మిస్టరీల వెనక మర్మమేమిటి..?

Read More : కొత్త ఫోన్‌ల పై ఆఫర్లే..ఆఫర్లు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పొలాల్లో గొయ్యలు, వింత ఆకారాలు

ఆకాశం నుంచి అకస్మాత్తుగా వింత వస్తువులు కింద పడిన సంఘటన ఇటీవల స్పెయిన్ వాసులను కలవరపాటకు గురిచేసింది. కలస్పారా ప్రాంతంలో గోళలాకారంలోని వస్తువు ఒకటి పొలాల్లో పడింది. అది పడిన చోట పెద్ద గొయ్యి కూడా ఏర్పడింది.

పొలాల్లో గొయ్యలు, వింత ఆకారాలు

దీంతో ఆ పొలం యజమాని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పరిశోధకులు ,అధికారులు వచ్చి ఆ వస్తువును స్వాధీనం చేసుకుని పరిశోధనల నిమిత్తం తీసుకువెళ్టం జరిగింది. మర్సియా ప్రాంతంలోని నివాస స్థలంలో మరొక వస్తువు క్రింద పడింది . దీంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది.

పొలాల్లో గొయ్యలు, వింత ఆకారాలు

ఈ వస్తువులు ఎక్కడి నుంచి పడుతున్నాయ్? ఏ లోహంతో వీటిని తయారు చేస్తున్నారు? దానిపై ఉన్న దారపు పోగులవంటి పదార్థమేంటి? తదితర విషయాలపై నిపుణులు పరిశోధనలు జరుపుతున్నారు.

పొలాల్లో గొయ్యలు, వింత ఆకారాలు

ఈ వస్తువుల పై  శాస్త్రవేత్తలు పరిశోధనలు కొన సాగిస్తుండగానే మరోసారి అలాంటి ఘటనే పునరావృతమైంది. 80 డయామీటర్ల వ్యాసా ర్దంతో దాదాపు 20 కేజీల బరువున్న గోళాకారపు వస్తువొకటి మర్సియా ప్రాంతంలో పడింది.

పొలాల్లో గొయ్యలు, వింత ఆకారాలు

కేవలం 9,700 మంది జనాభా ఉండే గూడెంలాంటి ప్రాంతంలో పడిన ఈ వస్తువు కూడా ఆకాశం నుంచే పడినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి.

పొలాల్లో గొయ్యలు, వింత ఆకారాలు

ఈ వస్తువు గురించి తలోరకంగా చెప్పుకుంటున్నారు. స్వర్గం నుంచి పడిన వస్తువంటూ కొందరు, గ్రహాంతరవాసులు విసిరిన వస్తువంటూ మరికొందరు చెబుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఇంకా స్పష్టమైన వివరాలేవీ వెల్లడించలేకపోతున్నారు.

పొలాల్లో గొయ్యలు, వింత ఆకారాలు

గ్రహంతర వాసులు విసురుతున్న వస్తువులుగా వీటిని కొంత మంది భావిస్తుండగా మరికొందరు స్వర్గం నుంచి కిందపడిన వస్తువులుగా పేర్కొంటున్నారు. ఇంకొందరు గతంలో శాస్ర్తవేత్తలు అంతరిక్షంలోకి పంపని వస్తువులే ఇలా కిందపడుతున్నాయని పేర్కొంటున్నారు.

పొలాల్లో గొయ్యలు, వింత ఆకారాలు

ఈ వస్తువులను గ్రహశకలాలని చెప్పలేమని, మానవులు పంపిన ఉపగ్రహాల తాలూకు వస్తువులు కూడా అయి ఉండవచ్చనే అభిప్రాయాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Unidentified Flying objects Falling in to the Earth. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot