NASA ఆ రహస్యాన్ని దాస్తోందా..?

అంతరిక్షానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలను పరిశోధనల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. NASA పుణ్యమా అంటూ స్పేస్‌కు సంబంధించిన ఎన్నో దృశ్యాలను హైక్లారిటీతో వీక్షించగలుగుతున్నాం. స్పేస్ సైన్స్‌‌ను ఇష్టపడే ప్రతిఒక్కరు ఏలియన్స్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు.

Read More : మార్కెట్లో సూపర్ సక్సెస్ అయిన 20 ఫోన్‌లు

 NASA ఆ రహస్యాన్ని దాస్తోందా..?

ఎగిరే విమానాలను గురించి, ఇతర లోకాల నుంచి భువికి దిగివచ్చిన అంతరిక్ష నౌకల గురించి కోకొల్లలుగా కధనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన మరో సంఘటనతో గ్రహాంతర వాసుల అలజడి మరోసారి మొదలైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

Read More : ఇంట్లో దొరికే వస్తువులతో మన గాడ్జెట్‌లను క్లీన్ చేసుకోవటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో

అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి నాసా చేపడుతోన్న ఓ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఓ తెల్లటి చుక్క భూమివైపు దూసుకొస్తున్నట్లు రికార్డ్ అయ్యింది.

UFOను పోలి ఉన్న ఈ తెల్లటి ఆబ్జెక్ట్

UFOను పోలి ఉన్న ఈ తెల్లటి ఆబ్జెక్ట్ భూమికి మరింత చేరువవుతున్న సమయంలో సడెన్‌గా నాసా లైవ్ స్ట్రీమింగ్ కట్ అయ్యిందట.

అనుమానిత వస్తువుకు సంబంధించి

నాసా కెమెరాలో రికార్డ్ అయిన ఆ అనుమానిత వస్తువుకు సంబంధించి ఏ విధమైన వివరాలను నాసా వెల్లడించటం లేదు.

ఇంటర్నెట్‌లో వైరల్

నాసాకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతానికి ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతోంది.

రహస్యంగా కొంత సమాచారం

అయితే, ఈ వీడియోలను కొన్ని ఫ్రేమ్‌లను నాసా కట్ చేసి రహస్యంగా ఉంచినట్లు సమాచారం. 

కారాణాలేంటి..?

NASA ఈ వీడియోను కట్ చేయటం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికి ఈ విశ్వానికి సంబంధించి కొన్ని అంతుచిక్కని విషయాలు రోజురోజుకు ఉదయస్తూనే ఉన్నాయి.

వీడియో.

ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతోన్న నాసాకు సంబంధించిన వీడియో ఇదే. తెల్లటి చుక్కు భూమి వైపుగా వస్తోన్న దృశ్యాన్ని ఈ వీడియో ఫుటేజ్‌లో చూడొచ్చు.

ఏలియన్స్ గురించి స్నోడెన్ చెప్పిన షాకింగ్ నిజాలు

గ్రహాంతరవాసుల ఉనికి పై పరిశోధనలు ముమ్మరమువుతోన్న నేఫథ్యంలో అమెరికా ఎన్ఎస్ఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ ఆసక్తికర వ్యాఖ్యలను చేసారు. ఏలియన్ లైఫ్ చాలా తెలివైనదని, వాటి కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిస్థాయిలో ఎన్‌క్రిప్ట్ కాబడి ఉంటుందని తాను అనుకుంటున్నట్లు చెప్పారు .

ఏలియన్స్ గురించి స్నోడెన్ చెప్పిన షాకింగ్ నిజాలు

ఏలియన్స్ ద్వారా వెలువడే సమాచారాన్ని క్రోడికరించటం దాదాపు అసాధ్యమని స్నోడెన్ తన ప్రసంగంలో వెల్లడించారు. ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డీగ్రాసీ టైసన్ మాస్కోలో నిర్వహించిన స్టార్‌ టాక్ పోడ్కాస్ట్ కార్యక్రమంలో స్నోడెన్ ఈ ప్రసంగం చేసారు.

గతకొంత కాలంగా...

గతకొంత కాలంగా ఏలియన్ లైఫ్ పై విస్తృతంగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ అనంతం విశ్వంలో మన భూమి తరహాలోనే ఏదో ఒక గ్రహంలో గ్రహంతర జీవులు నివస్తున్నాయని పలువురు బలంగా విశ్వసిస్తున్నారు.

వీరి భాషను డీకోడ్ చేయటం దాదాపుగా ఆసాధ్యం

Alien's పిలవబడుతోన్న గ్రహాంతర వాసులు మనుషుల కంటే ఎన్నో రెట్లు తెలివైన వారట, వీరి భాషను డీకోడ్ చేయటం దాదాపుగా ఆసాధ్యమట.

గ్రహాంతర వాసుల ఆనవాళ్లును 2025 నాటికి

ఎగిరే పళ్లాలు లేదా గుర్తించేందుకు వీలుగా లేని ఆబ్జెక్ట్‌ల సహాయంతో ఏలియన్‌లు భూమి పై సంచరిస్తున్నారదే పలువురి శాస్త్రవేత్తల నమ్మకం. గ్రహాంతర వాసుల ఆనవాళ్లును 2025 నాటికి కనుగొనే అవకాశం ఉందని, అలానే వాటికి సంబంధించిన కచ్చితమైన ఆధారాలను 2045 నాటికి వెలికితీసే అవకాశముందని నాసాకు చెందిన శాస్త్రవేత్త ఎల్లెన్ స్టోఫ్యాన్ తెలిపారు.

నాసా వద్ద భవిష్యత్ కార్యాచరణ

గ్రహాంతర జీవుల అన్వేషణకు సంబంధించి ఎక్కడా చూడాలో, ఏలా చూడాలో నాసాకు తెలసునని ఆయన తెలిపారు. మన సౌర కుటుంబం, ఆ వెలుపల జీవం ఉనికిని చాలా త్వరగానే కనుగొంటామని నాసాకు చెందిన మరో ప్రతినిధి జాన్ గ్రన్స్‌ఫెల్డ్ అన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
NASA cuts feed as UFO enters Earth’s atmosphere. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot