గాల్లో రోబో ఈగలు : రోడ్డు మీద ఉద్యోగుల బతుకులు

By Hazarath
|

ఇప్పటిదాకా మీరు ఎగిరే రోబోలను చాలా వాటినే చూసుంటారు. కాని ఇప్పుడు అత్యంత చిన్న రోబోలు వస్తున్నాయ్. రాజమౌళి ఈగ లాగా రోబో ఈగలు మార్కెట్లో త్వరలో హల్ చల్ చేయనున్నాయి. మరి ఇంత చిన్నగా ఉన్న ఈ రోబోలకు రోబో ఈగగా నామకరణం చేశారు. మరి ఈ చిన్న రోబోలో ఏం చేస్తాయి. అసలు దేనికి ఉపయోగపడతాయి అనే విషయంపై శాస్ర్తవేత్తలు అనేక రకాలుగా సమాధానం చెబుతున్నారు.

Read more: వాట్సప్‌లో దుమ్ము రేపుతున్న ఫన్నీ వీడియో

భవిష్యత్ లో మరింత మెరుగైన ఈ డ్రోన్ల రూపకల్పనకు ఈ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. అయితే శాస్ర్తవేత్తలు ఇప్పటిదాకా ఒక చోటు నుంచి మరోక చోటుకి పోయే రోబోలను మాత్రమే తయారుచేశారు. గాలిలో అలాగే ఉండిపోయే రోబోలను తయారుచేయలేదు. అయితే ఇప్పుడు రానున్న ఈ ఈగ రోబోలు కొంతకాలం పాటు గాలిలో నిశ్చలంగా ఉండేందుకు చాలా బాగా ఉపయోగపడాతయని చెబుతున్నారు. అయితే రోబోల రాకతో కోట్ల ఉద్యోగాలకు గండి పడింది. అదెలాగో మీరే చూడండి.

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

జర్మనీలో పూర్తి కాలం ప్రాతిపదికన గానీ పార్ట్ టైమ్ ప్రాతిపదికన గానీ మొత్తం 30.9 మిలియన్ల మంది (3.09 కోట్లు) వివిధ రంగాలలో ఉపాధి పొందుతుండగా వారిలో 18 మిలియన్ల మంది రోబోట్ల వల్ల ఉపాధి కోల్పోతారని ఐ.ఎన్.జి-డిబా
అధ్యయనం తెలిపింది. 

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

రోబోట్లు అనగానే అచ్చంగా మెకానికల్ గా పని చేసే మర మనుషులు మాత్రమే కాదు. కంప్యూటర్ టెక్నాలజీ, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి రోబోట్లను మరింత సమర్ధవంతంగా తయారు చేయడానికి దోహదం చేస్తోంది.

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

మర మనుషులను సాఫ్ట్ వేర్ ను జమిలిగా ఉపయోగించి మనుషులకు పోటీగా, మనుషుల కంటే మిన్నగా కూడా రోబోట్లను తయారు చేయగల పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది.

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి కొత్త కొత్త పుంతలను తొక్కుతున్న నేపధ్యంలో రోబోట్లు శారీరక శ్రమల స్ధానంలో మాత్రమే ప్రవేశపెట్టే పరిస్ధితి కాదు. మెదడు ఉపయోగించి చేసే పనులకు కూడా రోబోట్లను అభివృద్ధి చేస్తున్నారు. జర్మనీ ఈ రంగంలో అన్ని దేశాలకంటే ముందున్నట్లు సమాచారం.

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

ఉదాహరణకి ఆఫీసులో కూర్చొని చేసే పనులను కూడా రోబోట్లు చేయగల పరిస్ధితి వస్తోంది.

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

ప్రపంచ ప్రసిద్ధి చెందిన అత్యాధునిక కార్ల కంపెనీలు వోక్స్ వ్యాగన్, బి.ఎం.డబ్ల్యూ లు తమ కార్మికులు, పాలనా సిబ్బంది స్ధానంలో రోబోట్లు ప్రవేశపెట్టే శక్తివంతమైన అల్గారిధమ్స్ ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. అత్యంత ఆధునికమైన యంత్రాలలో మానవ మెదడును తలదన్నే సాఫ్ట్ వేర్ ను ప్రవేశపెట్టి మనుషుల కంటే వేగంగా, సమర్ధవంతంగా పని చేయించగల పరిజ్ఞానాన్ని ఈ కంపెనీలు అభివృద్ధి చేశాయి.

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

అయితే ఈ అధ్యయనం ఒక్క జర్మనీకి మాత్రమే పరిమితం కాలేదు. ఫిన్లాండ్, నెదర్లాండ్స్... ఇంకా ఇతర యూరోపియన్ దేశాలలోనూ అధ్యయనం జరిగింది.

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

అయితే వాటన్నింటిలోనూ అత్యంత ఘోరమైన స్ధాయిలో ఉపాధి కోల్పోయే పరిస్ధితి జర్మనీలోనే ఉన్నదని అధ్యయనం తెలిపింది. శక్తివంతమైన పారిశ్రామిక రంగం జర్మనీ కలిగి ఉండడమే దానికి ప్రధాన కారణం.

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

జర్మనీలో చివరికి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులను కూడా రోబోట్లే నిర్వహించనున్నాయి. సెక్రటరీ, సెక్రటరీ తరహా పోస్టులలో దాదాపు అన్నింటినీ రోబోట్లు ఆక్రమిస్తాయని అధ్యయనం తేల్చింది.

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

శారీరక శ్రమల రంగంలో 2/3 వంతు మెకానిక్కులు, మెషీన్ డ్రైవర్లు, మెకానికల్ టెక్నీషియన్లు మొదలైన శారీరక శ్రమల రంగంలో 2/3 వంతు ఉపాధిని రోబోట్లు లాగేసుకుంటాయి.

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

అయితే డాక్టర్లు, లెక్చరర్లు లాంటి వారి ఉపాధికి వచ్చిన భయం ఏమీ లేదని తెలుస్తోంది. డాక్టర్ల పనిని రోబోట్లు ఎలాగూ చేయలేవు. విద్యా రంగంలో 4 మిలియన్ల మంది ఉపాధి పొందుతుండగా వారిలో అర మిలియన్ మాత్రమే ఉపాధి కోల్పోవచ్చు.

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

వ్యాపార రంగంలో ఉన్నత స్ధానాల్లో ఉన్నవారికి కూడా రోబోట్ల వల్ల పెద్దగా భయం లేదుట. ఈ స్ధానాల్లో ఉన్న 1.4 మిలియన్ ఉద్యోగుల్లో 160,000 మంది ఉపాధి కోల్పోతారని అధ్యయనం అంచనా వేసింది.

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

గాల్లో చక్కర్లు కొట్టనున్న రోబో ఈగలు

అసలు రోబోట్ల వల్ల ప్రభావితం కానీ రంగమే లేదని అధ్యయనంలోని అంశాలను బట్టి తెలుస్తోంది.

గాల్లో రోబో ఈగలు : రోడ్డు మీద ఉద్యోగుల బతుకులు

గాల్లో రోబో ఈగలు : రోడ్డు మీద ఉద్యోగుల బతుకులు

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Video RoboBees Can Land And Perch On Surfaces With Static Electricity

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X