చందమామపై నీటి జాడలు, గుట్టు విప్పిన నాసా, క్రెడిట్ ఇండియాదే

అత్యంత చల్లగా, చీకటిగా ఉండే చంద్రుడి ధృవ ప్రాంతాల్లో ఘనీభవించిన నీటి నిల్వలు,మంచు నిక్షేపాలు ఉన్నట్లు నాసా వెల్లడించింది.

|

అత్యంత చల్లగా, చీకటిగా ఉండే చంద్రుడి ధృవ ప్రాంతాల్లో ఘనీభవించిన నీటి నిల్వలు,మంచు నిక్షేపాలు ఉన్నట్లు నాసా వెల్లడించింది. చంద్రునిపై ఘన స్థితిలో పలు ప్రాంతాల్లో నీటి నిక్షేపాలు ఉన్నట్లు నాసా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా పదేళ్ల క్రితం భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-1 అంతరిక్ష నౌక పంపిన సమాచారాన్ని విశ్లేషించిన నాసా శాస్త్రవేత్తలు ఈ నీటి నిల్వలున్న విషయాన్ని ధ్రువీకరించారు. చంద్రయాన్‌-1 అందించిన సమాచారాన్ని ప్రకారం చంద్రునిపై గల శీతల భాగాల్లో మంచు నిక్షేపాలు కూడా ఉన్నాయని నాసా వెల్లడించింది.చంద్రుడి ఉపరితలం కింద లోతైన భాగాల్లో నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ నీటిని వినియోగించుకోవడం చాలా కష్టతరమైందని అప్పట్లోనే వెల్లడించారు.

రెడ్‌మి ఫోన్ల‌లో ఈ ఫీచర్లు ఎప్పుడైనా టచ్ చేశారా ?రెడ్‌మి ఫోన్ల‌లో ఈ ఫీచర్లు ఎప్పుడైనా టచ్ చేశారా ?

లోతైన భాగాల్లో నీటి జాడలు

లోతైన భాగాల్లో నీటి జాడలు

చంద్రుడి ఉపరితలం కింద లోతైన భాగాల్లో నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ నీటిని వినియోగించుకోవడం చాలా కష్టతరమైందని అప్పట్లోనే వెల్లడించారు.

 కొద్ది మిల్లిమీటర్ల లోతులోనే..

కొద్ది మిల్లిమీటర్ల లోతులోనే..

కానీ ప్రస్తుతం కనుగొన్న ఘనీభవించిన నీటి జాడలు చంద్రుడి ఉపరితలానికి కొద్ది మిల్లిమీటర్ల లోతులోనే ఉన్నాయని తెలిపారు.

చంద్రుడిపైకి వెళ్లె యాత్రికులకు..

చంద్రుడిపైకి వెళ్లె యాత్రికులకు..

దీంతో భవిష్యత్తులో చేపట్టే ప్రయోగాలతోపాటు ఆవాసానికి అవసరమయ్యే నీటిని ఇక్కడి నుంచే పొందవచ్చని, చంద్రుడిపైకి వెళ్లె యాత్రికులకు అక్కడ నివసించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నాసా పేర్కొంది.

మంచు మొత్తం ఒకేచోట ..
 

మంచు మొత్తం ఒకేచోట ..

చంద్రుడి దక్షిణ ధృవం వద్ద లూనార్‌ క్రేటర్స్‌ (ఉల్కాపాతం వల్ల ఏర్పడిన గుంత లాంటి ప్రదేశం)లో మంచు మొత్తం ఒకేచోట నిక్షిప్తమై ఉందని నాసా తెలిపింది. ఉత్తర ధృవ ప్రాంతంలో మాత్రం అక్కడక్కడా తక్కువ మొత్తంలో వ్యాపించి ఉందని వివరించారు.

చంద్రయాన్‌-1పై ఎం3

చంద్రయాన్‌-1పై ఎం3

2008లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-1పై ఎం3 అనే పరికరాన్ని నాసా అమర్చిన విషయం తెలిసిందే. ఈ పరికరం పంపిన సమాచారంతోనే చంద్రుడిపై ఉపరితలంపై నీటి ఆనవాళ్లను నాసా గుర్తించింది.

చంద్రుని ధ్రువాల వద్ద

చంద్రుని ధ్రువాల వద్ద

చంద్రుని ధ్రువాల వద్ద ఎక్కువ మంచు ఉందని.. అక్కడ ఉష్ణోగ్రత -156 డిగ్రీలకు మించదని శాస్త్రవేత్తలు తెలిపారు.

గతంలోనే చంద్రునిపై..

గతంలోనే చంద్రునిపై..

కాగా గతంలోనే చంద్రునిపై పలు పరిశోధనలు చేసిన నాసా చంద్రునిపై నీరు, మంచు ఉండే అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Best Mobiles in India

English summary
Chandrayaan 1 Helps NASA Confirm Water Ice On Moon: 10 Things To Know more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X