Home
Scitech

అణు బాంబులతో వినాశనం తప్పదా..?

కలవరపెడుతోన్న మూడవ ప్రపంచ యుద్ధం..

మూడవ ప్రపంచయుద్ధమంటూ జరిగితే అది ఖచ్చితంగా అణు బాంబులతోనే ముడిపడి ఉంటుంది. న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీ ఎంతంటి ప్రమాదకరమో మనందరికి తెలుసు. న్యూక్లియర్ బాంబుల ధాటికి ప్రపంచమే తుడిచిపెట్టుకుపోగలదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే హిరోషిమా ఘోర కలే. జపాన్‌లోని చారిత్రక పట్టణాల్లో హిరోషిమా ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో భాగంగా అమెరికా జపాన్‌ పై ఈ అణుబాంబుల దాడి జరిపింది.

 రెండు నగరాల పై రెండు రోజుల వ్యవధిలో

రెండు నగరాల పై రెండు రోజుల వ్యవధిలో

1945, ఆగస్ట్ 6వ తేదీన మొదటి అణుబాంబును హిరోషిమా నగరం పై, రెండవ అణుబాంబును ఆగస్ట్ 9వ తేదీన నాగసాకి నగరం పై ప్రయోగించింది.

మంటల్లో కాలిపోయారు

మంటల్లో కాలిపోయారు

దీంతో ఆ రెండు జపనీస్‌ నగరాల్లో 2 లక్షలకుపైగా సామాన్య పౌరులు మరణించారు. నగరమంతటా వేల డిగ్రీల ఉష్ణోగ్రతల్లో మంటలు వ్యాప్తి చెందాయి. ఈ మంటల దాటికి జనం నిలువెల్లాకాలిపోగా, భవనాలు నేలమట్టమైపోయాయి. దట్టమైన చీకటి ఆవరించి, నల్లని పొగ వర్షం కురిసింది.

రేడియేషన్ కారణంగా క్యాన్సర్ సోకి

రేడియేషన్ కారణంగా క్యాన్సర్ సోకి

రేడియో యాక్టివ్‌ థార్మిక కిరణాలు వ్యాపించి ప్రజలు క్యాన్సర్లు బారిన పడ్డారు. వారికి జన్మించిన పిల్లలు కూడా అవయవ లోపాలతో భాదపడ్డారు.

అమెరికా అణు వినాశనం ధాటికి..

అమెరికా అణు వినాశనం ధాటికి..

అమెరికా అణు వినాశనం ధాటికి ఆ రెండు నగరాలు మరుభూములుగా మారిపోయాయి. తిరిగి కోలుకోటానికి ఏకంగా 10 సంవత్సరాలు పట్టింది.

అమెరికాను ఉద్దేశించి నార్త్ కొరియా..

అమెరికాను ఉద్దేశించి నార్త్ కొరియా..

అమెరికాను ఉద్దేశించి  గతకొంత కాలంగా ఉత్తర కొరియా చేస్తోన్న సంచలన ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

ఉత్తర కొరియా వద్ద హైడ్రోజన్ బాంబులు

ఉత్తర కొరియా వద్ద హైడ్రోజన్ బాంబులు

తాము శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా సంచలన ప్రకటన చేసింది. దీంతో ఒక్కసారిగా అగ్రరాజ్యాలు ఉలక్కిపడ్డాయి.

 హైడ్రోజన్ బాంబు అత్యంత శక్తివంతమైనది..

హైడ్రోజన్ బాంబు అత్యంత శక్తివంతమైనది..

హైడ్రోజన్ బాంబుకు దేశాలను తుడిచిపెట్టేయగల సామర్థ్యం ఉంది. ఇప్పటికిప్పుడు న్యూక్లియర్ వార్‌కు తెరలేగిస్తే పరిస్దితులు ఎలా ఉంటాయో విశ్లేషకుల మాటల్లోనే విందాం...

 

ఆ సమయంలో వార్నింగ్ వ్యవస్థ కూడా పనిచేయదు..

ఆ సమయంలో వార్నింగ్ వ్యవస్థ కూడా పనిచేయదు..

న్యూక్లియర్ వెపన్స్ దాటికి ప్రజలకు అప్రమత్తం చేసే నాలుగు నిమిషాల వార్నింగ్ వ్యవస్థ పనిచేయక పోవచ్చు.

మెసేజింగ్ వ్యవస్థను ప్రపంచదేశాలు పరీక్షిస్తున్నాయి..

మెసేజింగ్ వ్యవస్థను ప్రపంచదేశాలు పరీక్షిస్తున్నాయి..

న్యూక్లియర్ దాడుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు టెక్స్ట్ మెసేజ్ వార్నింగ్ సిస్టంను పలు దేశాలు పరీక్షించాయి. దాడికి కొన్ని నిమిషాల ముందు వార్సింగ్ సందేశాలు మీ ఫోన్‌కు అందొచ్చు.

వాటిని నిలువరించలేం...

వాటిని నిలువరించలేం...

ఖండాతర బాలిస్టిక్ క్షిపణిలను నిలవరించేందుకు ఇప్పటికప్పుడు అయితే ఏ విధమైన టెక్నాలజీ అందుబాటులోకి లేదు. కాబట్టి, ఫోన్ మెసేజ్ చూసుకుని అలర్ట్ అయ్యే లోపే జరగాల్సిన దారుణం జరిగిపోవచ్చు.

నగరాలనే నాశనం చేసేస్తాయి...

నగరాలనే నాశనం చేసేస్తాయి...

హైడ్రోజన్ బాంబులు మొత్తం నగరాన్నే నాశనం చేయగలవు. వీటి శక్తిసామర్థ్యాలు అపారం. న్యూక్లియర్ వార్‌కు తెరలేస్తే యావత్ ప్రపంచం పెను ప్రమాదంలో పడ్డట్టే.

Best Mobiles in India

English summary
Weapons of World War III: How new technology will affect. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X