1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

ఈ భూమి పై ఉన్న1500 అగ్నిపర్వతాలు ఒక్కసారి బద్దలైతే, ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా..? విధ్వంసర యుగాంతాన్ని ఈ ప్రపంచం చవిచూడాల్సి వస్తుందట. భూమ్మీదున్న మొత్తం అగ్ని పర్వతాల్లో 75 శాతం ప్రపంచంలోనే అతి పెద్దదైన పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్నాయట. ఈ ప్రాంతాన్నే 'రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌' అని కూడా పిలుస్తారు.

Read More : కొత్త పోన్‌కు నెల దాటితే సగం ధరే!

 1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

ప్రపంచంలోని అగ్ని పర్వతాలన్ని ఒకేసారి బద్ధలవటం వల్ల సంభవించే పరిణామాలను ప్రముఖ అగ్నిపర్వతాల విశ్లేషకుడు డాక్టర్ మాథ్యూ వాట్సన్ వివరించే ప్రయత్నం చేసారు. అగ్ని పర్వతాల విస్పోటనాలు రెండు రకాలుగా ఉంటాయని వాట్సాన్ చెబుతున్నారు. వాటిలో మొదటి రకం విస్పోటనం ద్వారా లావా ఇంకా గ్యాస్ లు వేగవంతంగా వ్యాప్తి చెందుతాయట. రెండో రకం విస్పోటనం ద్వారా బూడిద ఇంకా గ్యాస్‌లు గాలిలో కలిసిపోయి భయానక పరిస్థితులు ఏర్పడతాయట...

Read More : 2016, టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

ఈ భూమి పై ఉన్న అన్ని అగ్నిపర్వతాలు ఒక్కసారిగా బద్దలవటం ద్వారా ప్రపంచ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయే అవకాశముందట. 

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

అగ్ని పర్వతాలు బద్దలవటం కారణంగా ఏర్పడే ప్యరోక్లాస్టిక్ ద్రవం 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో గంటకు 450 మైళ్ల వేగంతో ప్రయాణించగలదట.

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

అగ్నిపర్వతాలు బద్దలవటం కారణంగా విరజిమ్మే బూడిద వేల మైళ్లు ప్రయానించగలద. పర్యావసానంగా ఇంజిన్లు మోరియించటం, ఇళ్లు బూడిదలో కప్పుకుపోవటం, తీవ్ర అనారోగ్య సమస్యలు వ్యాపించే అవకాశముందట. 

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

మొత్తం బూడిద కమ్మేయటంతో ప్రపంచమంతా చీకట్లు అలుముకుని కాల్షియం లోపం, టిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశముందట. 

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

అగ్ని పర్వతాలు ఊళ్ల పై విరుచుకు పడటం వల్ల తీవ్రమైన పంటనష్టం ఏర్పడే అవకాశముందట.

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

ఈ భయానక విస్పోటనం నుంచి బయటపడాలంటే భారీ నౌకల సహాయంతో ముద్రం మధ్యలో జీవించటం ఒక్కటే మార్గమట. 

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

రష్యాలోని ట్యాత్యా శిఖరాలు 160 ఏళ్ల తరువాత భూ ఉపరితలం కంటే ఎత్తుగా పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీటిని అగ్నిపర్వతాలుగా ధ్రువీకరించారు. 1973 జూలైలో అవి పగిలి ఆకాశమెత్తున నిప్పురవ్వలు లేచాయి.

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

దీని నుండి బయటకు వచ్చిన లావా 1975 వరకు ప్రవహిస్తూనే ఉంది. ఈ అగ్నిపర్వతం విడుదల చేసిన బూడిదలో అధికశాతం అమినో ఆమ్లాలు ఉండడం, ఇంద్రియ సంబంధమైన పదార్ధాలు ఉండడం శాస్త్రవేత్తలు గుర్తించారు.

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

ప్రపంచవ్యాప్తంగా చురుకైన అగ్నిపర్వతాలు దాదాపు 535 వరకు వున్నాయి. వీటిలో 80వరకు మహాసముద్రాలలో వున్నాయి.

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

అగ్నిపర్వతాలు మూడు రకాలుగా వుంటాయి. మొదటి రకానికి చెందినవి తరచు విస్పోటనం చెందుతూ వుంటాయి. రెండవ రకానికి చెందినవి కొన్ని సంవత్సరాల పాటు విస్పోటనం చెందవు. వీటిని డార్మెంట్‌ వల్కెనోస్‌ అంటారు. అంటే సుప్తావస్థలో వుంటాయి. చరిత్రలో ఎన్నడూ విస్పోటనం చెందని అగ్నిపర్వతాలు మూడవ రకానికి చెందినవి. వీటిని విలుప్త అగ్నిపర్వతాలు అంటారు.

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

దక్షిణ అమెరికాలోని ఆండీస్‌ పర్వతాలలో ఆకోన్‌ కాగువా అనే అగ్నిపర్వతం విలుప్త అగ్నిపర్వతమే. దీని ఎత్తు 22,834 అడుగులు.టాంజియానాలో కొలియాంజోకో అగ్నిపర్వతాన్ని సుప్తావస్థలో వున్న అగ్నిపర్వతంగా భావించారు 1944లో అది అకస్మాత్తుగా పేలడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అగ్నిపర్వతాలను ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే వుండాలి.

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

చర్రిత్ర చెబుతోన్న లెక్కల ప్రకారం. 9000 ఏళ్ల త‌ర్వాత ద‌క్షిణ చీలెలోగ‌ల చైత‌న్ అగ్నిప‌ర్వ‌తం 2008లో విస్ఫోటం చెంది వేల మైళ్ల‌ మేర లావా, బూడిద‌లో వ‌ర‌ద‌లెత్తింది.

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

ఇట‌లీలోని మౌంట్ వెసువియ‌న్ AD79లో ఘోరంగా బ‌ద్ధ‌లై పాంపె,హెర్కులెనిమ్ న‌గ‌రాల్ని భూగ‌ర్భంలో క‌లిపేసింది. వేల సంవ‌త్స‌రాల త‌ర్వాత ప్ర‌స్తుతం ఈ ప‌ర్వ‌తం స‌మీపంలో జ‌నం నివ‌సిస్తున్నారు. అయితే ప్ర‌మాదం పొంచే ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు.

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

ఆఫ్రికాలోని నియరాగాంగో అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ద‌ల‌యిన‌ప్పుడు వెలువ‌డిన లావా వ‌ర‌ద‌నే త‌ల‌పించింది.2002లో ఈ ప‌ర్వ‌తం నుంచి లావా గంట‌కు 60 మీట‌ర్ల వేగంతో ఆక‌స్మికంగా గోమా ప‌ట్ట‌ణాన్ని కాల్చేసింది. ఈ ప‌ట్ట‌ణంలో ప్ర‌స్తుతం 5 ల‌క్ష‌ల మంది నివ‌సిస్తున్నారు.

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

కొలంబియాలోని నెవ‌డా డెల్‌మాజ్ అగ్నిప‌ర్వ‌తం 1985 న‌వంబ‌ర్ 13న చిన్‌చినాలోని 1,927 మందినిబ‌లిగొంది. ఆ త‌ర్వాత అర్మెరోలోనూ 2,300 మందిని కాల‌గ‌ర్భంలో క‌లిపేసింది. ఇది కొలంబియా చ‌రిత్ర‌లోనే అత్యంత ఘోర‌ప్ర‌మాదం. ఈ త‌ర‌హా ప్ర‌మాదాల్ని ముందుగా ప‌సిగ‌డితే పెద్ద సంఖ్య‌లో ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా నిలువ‌రించవ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

జ‌పాన్‌లో ఏటా ఏదో ఒక‌చోట స్వ‌ల్ప భారీ అగ్నిప‌ర్వ‌త విస్ఫోటాలు సంభ‌విస్తూనే ఉంటాయి. 1707లోఫుజి ప‌ర్వ‌తం ఈ విధంగానే ప్ర‌తాపాన్ని చూపింది. మ‌ళ్లీ 300 ఏళ్ల‌కు 2000..-01 మ‌ధ్య మ‌రోసారిఈ ప‌ర్వ‌తం ప్ర‌మాద ఘంటిక‌ల్ని మోగించింది. ఈ ప‌ర్వ‌తం వ‌ల్ల టోక్యో ప్ర‌మాద‌పుటంచున ఉంది.కార‌ణం ఈ ప‌ర్వ‌తానికి టోక్యో న‌గ‌రానికి మ‌ధ్య ఉన్న దూరం 70 మైళ్లు మాత్ర‌మే. టోక్యో సిటీ 70 మైళ్ల‌ప‌రిధిలోనే సుమారు 3 కోట్ల మంది నివ‌సిస్తున్నారు.

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

వాషింగ్ట‌న్ ప‌రిధిలోని 14,410 అడుగుల ఎత్తున గ‌ల మౌంట్ లైనర్ ప‌ర్వ‌తం నీడ‌లోనే 30 ల‌క్ష‌ల మంది నివ‌సిస్తున్నారు. స్వ‌ల్ప ప్ర‌కంప‌న‌లు సంభ‌వించినా ఈ ప‌ర్వ‌తం విప‌రీతంగా వాయువులు, బూడిద‌వెద‌జ‌ల్లుతూ భ‌య‌పెడుతోంది.

1500 అగ్ని పర్వతాలు ఒకేసారి బద్దలైతే..?

ప్ర‌పంచంలో దాదాపు 51 కోట్ల మంది ఈ అగ్నిప‌ర్వ‌తాల నీడ‌లోనే కాలం గ‌డుపుతున్నారంటేనే ఆశ్చ‌ర్యం క‌ల్గించే విష‌యం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What would happen if Earth's 1,500 volcanoes erupted at once? Experts outline terrifying doomsday scenario. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot