ప్రపంచాన్ని వణికించే నార్త్ కొరియాను ఇదే భయపెడుతోంది..

Written By:

నార్త్ కొరియా..ఎక్కడో మూలన ఉన్న ఓ చిన్న దేశం. అయితేనేమి ప్రపంచాన్ని భయపెడుతోంది. అగ్రదేశాలు సైతం ఆ దేశం పేరు విన్నా ఆ దేశాధినేత మాటలు విన్నా వణికే స్థితి. మరి అలాంటి నార్త్ కొరియాను భయపెడుతున్న అంశం ఏదైనా ఉందా అంటే అది టెక్ ప్రపంచమే. అవును.. నార్త్ కొరియాను ఇప్పుడు టెక్ ప్రపంచం వెంటాడుతోంది. అన్ని దేశాలు టెక్ రంగంలో దూసుకుపోతుంటే నార్త్ కొరియా మాత్రం ఎక్కడో చివరన ఉంది.

రెడ్‍మి నోట్ 4కి షాకిచ్చే ఇండియా ఫోన్ ఇదే, అదీ తక్కువ ధరలో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ విషయంలో చాలా వెనుక

ప్రపంచంలో ఎన్నో టెక్ పరిశ్రమలు ఉన్నాయి. అమెరికా, చైనా, ఇండియా, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా లాంటి దేశాలు ఈ టెక్ రంగంలో ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతుంటే నార్త్ కొరియా మాత్రం ఈ విషయంలో చాలా వెనుకబడిపోయింది.

అమెరికా ఇప్పటికే

అమెరికా ఇప్పటికే ఈ విషయంలో దూసుకుపోతోంది. ఆపిల్ కంపెనీ నుంచి సోనీ దాకా దానిదే ప్రపంచ మార్కెట్లో ఆధిపత్యం.

చైనా

అత్యంత చీప్ వస్తువుల తయారీలో ఆధిపత్యం ఈ దేశానిదే. ప్రపంచ మార్కెట్లో సింహభాగం దీనిదే. 

జపాన్

జపాన్ కూడా టెక్ రంగానికి తన తోషిబా కంపెనీ ద్వారా ధీటైన జవాబు ఇస్తోంది. ఆ కంపెనీ మార్కెట్లో మెజారిటీ వాటాను ఇప్పటికే సొంతం చేసుకుంది కూడా.

సౌత్ కొరియా

ఇక సౌత్ కొరియా విషయానికొస్తే శాంసంగ్ ప్రపంచ మార్కెట్ ని దున్నేస్తోంది. అన్ని రంగాల్లో దానిదే ఆధిపత్యం. దీనితో పాటు ఎల్ జీ , హుండాయ్, పోస్కో లాంటి కంపెనీలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. దాదాపు 100 కంపెనీలు సౌత్ కొరియాలో ఉన్నాయంటే నమ్మగలరా..

నార్త్ కొరియాలో

అయితే నార్త్ కొరియాలో ఒక్క టెక్ కంపెనీ కూడా లేకపోవడం చాలా విచిత్రమైన అంశం. దీనికి ప్రధాన కారణం నార్త్ కొరియా ఎక్కువగా మిస్సైల్ టెక్నాలజీ మీద తన దృష్టిని కేంద్రీకరించడమేనని తెలుస్తోంది.

మిస్సైల్ టెక్నాలజీ తోనే

ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలంటే మిస్సైల్ టెక్నాలజీ తోనే సాధ్యమని నమ్మే నార్త్ కొరియా అధ్యక్షుడు నిరంతంరం రాకెట్ల ప్రయోగంలోనే తలమునకలవుతున్నారు.

నూక్లియర్ విషయంలో

నార్త్ కొరియాకు నూక్లియర్ విషయంలో చైనా సాయం చేస్తూనే ఉన్నదని, ఆ సాయాన్ని చైనా ఆపితేనే సమస్య పరిష్కారమవుతుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన సంగతి గుర్తుఉండే ఉంటుంది.

ఈ అంశాల మీద దృష్టిపెడితే

నార్త్ కొరియా మిస్సైల్ టెక్నాలజీతో పాటు ఈ అంశాల మీద దృష్టిపెడితే అగ్రరాజ్యాల సరసన నిలుస్తుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Why North Korea Should Worry the Tech World Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting