ఇంటర్నెట్‌లో ఇలాంటి పనులు చేస్తే జైలుకే..?

ఆన్‌లైన్‌లో మీరు చేయకూడని 10 తప్పులు.

|

ఇంటర్నెట్ ఓ అద్బుతమైన కమ్యూనికేషన్ సాధనం. అంతర్జాలంలో ఎటువంటి సమాచారాన్ని అయినా పొందవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా కావాల్సినంత విజ్ఞానంతో పాటు కాలక్షేపాన్ని కూడా పొందవచ్చు. అయితే, ఇంటర్నెట్ కంటూ కొన్ని పరిధులు ఉన్నాయి. వీటిని ఉల్లంఘించకూడుదు. ఇంటర్నెట్ స్వేచ్చకు సంబంధించిన నిబంధనలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఆన్‌లైన్‌లో మీరు చేయకూడని 10 తప్పులను ఇక్కడ సూచించటం జరుగుతోంది...

Read More : ఇక మొబైల్ షాపుల్లోనూ Redmi Note 4..?

మీకు ఓపెన్ వై-ఫై ఉందా..

మీకు ఓపెన్ వై-ఫై ఉందా..

మీకు ఓపెన్ వై-ఫై ఉందా అయితే, వెంటనే దానికి పాస్ వర్డ్ ప్రొటెక్షన్‌ను సెట్ చేసుకోండి. ఎందుకంటే, మీ ఓపెన్ వై-ఫైను ఇతరలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చు. నేరం వేరొకరు చేసినప్పటికి బలయ్యేది మాత్రం మీరే.

సెర్చ్ హిస్టరీ డిలీట్ చేసినా తప్పే..?

సెర్చ్ హిస్టరీ డిలీట్ చేసినా తప్పే..?

అమెరికాకు చెందిన డేవిట్ అనే వ్యక్తిని యాహూ అకౌంట్ హ్యాకింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో డేవిడ్ ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీ చాలా కీలకంగా వ్యవహరించింది. అయితే, అతను అప్పటికే తన సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటంతో శిక్ష మరింత పెరిగింది. భారత్‌లోనూ ఇటువంటి చట్టమే తీసుకురావాలని చూసినప్పటికి అది సాధ్యపడలేదు. 

అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదు
 

అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదు

ఆన్‌లైన్‌లో ఉన్నప్పడు మీరేం పోస్టు చేస్తున్నారనేది ముందు గమనించుకోండి. అది పోస్టు చేయడానికి తగినదేనా కాదా అన్నదీ నిర్ధారించుకోండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదు. సరదాకో, తమషాకో మీరు చేసే వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నేరేపొచ్చు.

స్కైప్ సేవలు వాడుకున్నందుకు..

స్కైప్ సేవలు వాడుకున్నందుకు..

ఇతోపియాలో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సర్వీసుల పై నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా స్కైప్‌ వంటి సర్వీసులను ఉపయోగించుంటున్నట్లయితే నేరుగా జైలులోనే ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది.

అభ్యంతరకర డ్యాన్స్ చేసినా..?

అభ్యంతరకర డ్యాన్స్ చేసినా..?

అభ్యంతరకరంగా డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసినందుకు ఇరాన్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులకు ఆ దేశ ప్రభుత్వం 91 కొరడా దెబ్బలతో పాటు ఏడాది జైలు శిక్షను విధించింది. కాబట్టి, అభ్యంతరకర వీడియోలకు దూరంగా ఉండటం మంచిది.

టొరెంట్ ఫైల్స్ ప్రమాదకరం..

టొరెంట్ ఫైల్స్ ప్రమాదకరం..

టొరెంట్స్ ద్వారా ఫైల్స్ షేర్ చేయటమనేది చాలా దేశాల్లో చట్ట వ్యతిరేక చర్యగా పరిగణిస్తారు. ఫైల్ షేరింగ్ అంటే కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లే. సినిమా, మ్యూజిక్ ఇంకా ఫైల్స్‌ను యజమాని పర్మిషన్ లేకుండా షేర్ చేయటమనేది చట్ట వ్యతిరేక చర్యగా పరిగణిస్తారు.

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ నిషేధం..

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ నిషేధం..

చాలా దేశాలు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను నిషేధించాయి. ఆన్‌లైన్‌లో గ్యాంబ్లింగ్ ఆటను నిర్వహించినా, ఆడినా ఈ చట్టం పరిధిలోకి వస్తారు.

థాయిల్యాండ్ అథారిటీస్‌కు వ్యతిరేకంగా ఆర్టికల్ రాసినందుకు..

థాయిల్యాండ్ అథారిటీస్‌కు వ్యతిరేకంగా ఆర్టికల్ రాసినందుకు..

థాయిల్యాండ్ అథారిటీస్‌కు వ్యతిరేకంగా ఆర్టికల్ రాయటం కారణంగా, ఓ అమెరికన్‌ను అక్కడి ల్యాండ్ పోలీసులు అదుపులోకి తీసుకుని జైలులో ఉంచారు. థాయిల్యాండ్‌లో ఆ దేశ రాజును సుప్రిం లీడర్‌గా పరిగణిస్తారు. ఇతని పై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఊచలు లెక్కబెట్టాల్సిందే.

ఫేస్‌బుక్‌లో జాగ్రత్త..

ఫేస్‌బుక్‌లో జాగ్రత్త..

ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర లిరిక్స్‌ను పోస్ట్ చేసినందుకు గాను అమెరికాలో ఓ స్కూల్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి, సోషల్ మీడియాలో అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదు. సరదాకో, తమషాకో మీరు చేసే వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నేరేపొచ్చు.

Best Mobiles in India

English summary
10 Online Activities That Can Get You Arrested. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X