ఫేస్‌బుక్‌లో నాటి నుంచి నేటి వరకు వచ్చిన మార్పులు

  2003లో ప్రారంభమైన 'Facemash' హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు "హాట్ ఆర్ నాట్" అనే ఆటలో భాగంగా ఓటు వేయడానికి వేదికగా తయారు చేయబడింది. నేడు అదే "ఫేస్ మాష్" ఫేస్బుక్ గా మారి ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారుల ప్రధాన సామాజిక మాధ్యమంగా ఉంది. 2012 వరకు, ఫేస్బుక్ దాని ప్లాట్ఫారం పై 1 బిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించింది, ఇది నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. ఈ మద్య కాలంలో అనేక గడ్డు పరిస్థితులను ఫేస్బుక్ ఎదుర్కుంటున్నా కూడా, దీనిలో ఉన్న ఫీచర్ల కారణంగా ఫేస్బుక్ ను వీడలేని స్థితిలో వినియోగదారులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు, దాని ఉపయోగం మరింత అనుకూలoగా ఉండేలా ప్రతి అంశంలోనూ Facebook నవీకరించడాన్ని మనం చూశాము. కానీ ఆ నవీకరణలలో అత్యంత ప్రజాదరణ పొందినవి మాత్రo కొన్నే. ఈ ఫేస్బుక్ నవీకరణలలో టాప్ 10 ఏమిటో ఇప్పుడు చూద్దాం.

   

  మునుపెన్నడూ లేని టెక్నాలజీతో దూసుకొస్తున్న సరికొత్త స్మార్ట్‌‌ఫోన్

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  ఫోటో ఫీచర్ :

  2005 లో ఫేస్బుక్ ఒకరి ప్రొఫైల్ కు ఫోటోలను జోడించే సదుపాయాన్ని మొదటిసారిగా ప్రారంభించింది. గణనీయమైన సంఖ్యలో ఫోటోలను అప్లోడ్ చేసేలా, స్టోరేజ్ కెపాసిటీ పై ఎటువంటి పరిమితి లేకుండా ఈ సదుపాయo కల్పించబడింది. తద్వారా తమకు నచ్చిన ఫోటోలను ప్రపంచంలోని అందరు స్నేహితులకు ఎటువంటి స్టోరేజ్ పరిమితులు లేకుండా పంచుకోగలిగిన సదుపాయం కలిగింది.

  పిక్చర్స్ లో ట్యాగింగ్ ఫ్రెండ్స్ :

  అదే సంవత్సరంలో, ఫేస్బుక్ మరొక ఫీచర్ ను ఫేస్బుక్ లో ప్రవేశపెట్టింది, ఫోటోలను స్నేహితులందరికీ టాగ్ చేసుకునేలా. తద్వారా అనేక మంది స్వయంగా అప్లోడ్ చేయకపోయినా, తమ సన్నిహితులు టాగ్ చేయడం ద్వారా టైం లైన్ లో చూసుకునే వీలు కల్పించబడింది. కానీ ఇప్పటికీ కొన్ని సమస్యలున్నా, దీని వాడకం మాత్రం తగ్గలేదు.

  ఫేస్బుక్ నోట్స్ :

  ఆ తర్వాత ఒక సంవత్సరానికి ఫేస్బుక్ 'ఫేస్బుక్ నోట్స్' ను ప్రవేశ పెట్టింది. ఇది బ్లాగర్లు వ్యాసాలను వ్రాసి, వారి ఆలోచనలను మరియు జ్ఞానాన్ని వ్యక్తం చేయడానికి అనువుగా రూపొందించబడింది.

  వార్తల ఫీడ్లు :

  2006 సంవత్సరానికి ఫేస్బుక్ వినియోగదారులు, న్యూస్ ఫీడ్స్ ద్వారా తమ స్నేహితుల కార్యకలాపాలను చూసేందుకు వీలుగా ప్రత్యేకమైన ట్యాబ్ ఒకటి పొందుపరచారు. తద్వారా, అత్యధిక జనాదరణ పొంది సోషల్ మీడియా వేదికపై వినియోగదారులు తమ సమయాన్ని ఎక్కువ సేపు గడిపేలా చేయగలిగింది.

  మొబైల్ కోసం ఫేస్బుక్ :

  ఫేస్బుక్ మొదట్లో డెస్క్టాప్ లకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ 2007లో, మార్క్ జూకర్బర్గ్ m.Facebook.com ను ప్రవేశపెట్టారు. దీనివలన వినియోగదారులు తమ అభిమాన సామాజిక మాధ్యమాన్ని ప్రయాణంలో ఉన్నప్పుడు వారి మొబైల్ ఫోన్లలో చూసుకునేలా అవకాశాన్ని పొందగలిగారు. ఈ మొబైల్ లింక్ ఆధారితంగా అనేక అనువర్తనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

  డెవలపర్ల కోసం Facebook వేదిక :

  మార్క్ జూకర్బర్గ్ డెవలపర్లకు అనుకూలంగా ఉండటంలో ఎన్నడూ విఫలం కాలేదు. మే 2007 లో, ఫేస్బుక్ ప్లాట్ఫామ్ ముఖ్యంగా డెవలపర్ల కోసం ప్రారంభించబడింది, ఇది ఫేస్బుక్ ద్వారా కొన్ని ప్రత్యేక అనువర్తనాలను అభివృద్ధి చేయడానికి వీలు కల్పిస్తుంది.

  లైక్ బటన్ :

  ఈ తంబ్సప్ సింబల్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనమో అందరికీ తెలుసు . ఈ లైక్ బటన్ 2009 లో ప్రవేశ పెట్టబడింది. ఈ ఫీచర్ సహకారంతో మీరు మీ స్నేహితుల పోస్టులకు ఒక్క క్లిక్ ద్వారా లైక్స్ ఇచ్చి భావాలను వ్యక్తపరచేలా అవకాశo కలిగింది. ఇప్పుడు ఈ లైక్స్ లో మరిన్ని చిహ్నాలను ప్రవేశపెట్టింది కూడా. తద్వారా ఈ ఎమోజీలలో భాదను, విస్మయాన్ని, కోపాన్ని, సంతోషాన్ని వ్యక్త పరచే అవకాశo కూడా వినియోగదారులకు కల్పించబడింది. ఈ సదుపాయంతో ఫేస్బుక్ వినియోగదారులకు మరింత చేరువయిందనే చెప్పాలి.

  మీ స్థితి మరియు వ్యాఖ్యలకు స్నేహితులను టాగ్ చేయవచ్చు :

  ఫోటోల మీద స్నేహితుల టాగింగ్ ఫీచర్ తరువాత, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు తన వినియోగదారుల నుండి పెరుగుతున్న డిమాండ్లను మరియు అవసరాలని గుర్తించి, కేవలం వారి స్టేటస్లో, స్నేహితులను ట్యాగ్ చేయడo మాత్రమే కాకుండా చిన్న సంభాషణల్లో కూడా వారిని టాగ్ చేసేలా (హాష్ టాగ్) అవకాశాన్ని కల్పించారు. ఈ హాష్ టాగ్ ఇప్పుడు ఒక సంచలనం అనే చెప్పాలి. ఎవరి గురించైనా మీరు post చెయ్యాలి అనుకుoటే, ఆ ఖాతాను లేదా ఆ వ్యక్తులను హాష్ టాగ్ లలో ఉంచి మీ post ఉంచడం ద్వారా అనేక మంది మీ స్థితిని చూసే వీలు కల్పించబడింది. ట్విట్టర్ లో ఫేస్బుక్ లో హాష్ టాగ్ ప్రభంజనం మనకు తెలియనిది కాదు.

  వ్యక్తిగత వ్యాఖ్యలకు కూడా లైక్స్ :

  'లైక్' ఫీచర్ ఫోటోలు మరియు హోదా కోసం మాత్రమే మొదట్లో ప్రవేశపెట్టబడింది. కానీ 2010 లో పోస్టుల కింద కామెంట్లకు కూడా లైక్స్ ఇచ్చే సదుపాయం కల్పించబడింది. ఇది వినియోగదారులకు ఎంతగానో నచ్చిన ఫీచర్ గా ఉంది. ఇప్పుడు వ్యాఖ్యలలో, లైక్స్ లో అనేక ఎమోజీలను కూడా గమనించవచ్చు.

  మెసెంజర్ ప్రారంభించబడింది :

  MSN ఒకప్పట్లో అత్యంత విజయమైన మెసెంజర్ గా పేరు కలిగింది. తర్వాతి కాలంలో గూగుల్ టాక్, యాహూ మెసెంజర్ల ప్రభంజనం కొనసాగింది. ఇటువంటి సందర్భంలో ఫేస్బుక్ దాని కోసం ప్రత్యేకంగా మెసెంజర్ యాప్ ని 2011 లో Android మరియు IOS కోసం, తర్వాత బ్లాక్బెర్రీ వినియోగదారుల కోసం ప్రారంభించింది, తద్వారా కమ్యూనికేషన్ ముందుకన్నా సులభంగా మారింది.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  10 upgrades we all have seen in Facebook since its inception More news at Gizbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more