సోషల్ మీడియాలో ఏవి పోస్ట్ చేయకూడదు!

Posted By: M KRISHNA ADITHYA

నేడు సోషల్ మీడియా పుణ్యమా అని తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు ఇలా ఎవరు పడితే వారు మన ప్రొఫైల్స్ చూస్తున్నారు. ఇది సహజమే అయితే సాధారణంగా ఫేస్ బుక్, ట్విట్టర్, స్నాప్ చాట్ వాట్సప్ గ్రూప్ ఇలా చాలా వరకూ సోషల్ మీడియాకు చెందిన ప్లాట్ ఫామ్స్ లో మీరు చేసే పోస్టింగ్స్ ఒక్కోసారి మీకు ఇబ్బందులు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. అది మీ ప్రైవసీకి భంగం కూడా కల్గించవచ్చు. మరి అలాంటి పరిస్థితి మీకు తలెత్తకుండా, సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడుకునేలా, ఎలాంటి పోస్ట్స్ మీ వాల్ పై షేర్ చేసుకోవద్దో కొన్ని టిప్స్ చూద్దాం.

ఈ మధ్య కాలంలో ధర భారీగా తగ్గిన స్మార్ట్‌ఫోన్ల పూర్తి వివరాలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అనుమతి లేకుండా..

మీ సన్నిహితులు, కుటుంబసభ్యులు ఇలా మీకు దగ్గరి వారికి సంబంధించిన ఏ విషయమైనా వారి అనుమతి లేకుండా షేర్ చేయకూడదు. ఉదాహరణకు మీ కొలీగ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు, మీ సోదరి ఉద్యోగం పొందినప్పుడు, లేదా మీ సన్నిహితుల ప్రైవసీ మేటర్స్ ను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో చర్చించడం, పోస్ట్ చేయడం చేయకూడదు.

 

 

పూర్తి ఆధారాలు లేకుండా..

పూర్తి ఆధారాలు లేకుండా ఏ వార్తను కూడా సోషల్ మీడియా వేదికపై షేర్ చేయకూడదు. ఉదాహరణకు ఎవరైనా సెలబ్రిటీ మరణ వార్తలను, లేదా ప్రజల్లో భయం పుట్టించే వార్తలను ఆధారాలు లేకుండా షేర్ చేయకూడదు.

 

 

కోరికలను..

అంతేకాదు కోరికలను సోషల్ మీడియా వాల్ పై పోస్ట్ చేయకూడదు.ఉదాహరణకు మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న అమ్మాయి వివరాలు, మీరు ప్రయాణించాలనుకుంటున్న స్థలాలు, మీరు చేసే పనులను సోషల్ మీడియాలో పంచుకోకూడదు.

 

 

ఎదుటి వారి వర్ణాన్ని

అలాగే ఎదుటి వారి వర్ణాన్ని, ఆకారాన్ని వెక్కిరిస్తూ జోక్స్ లాంటివి షేర్ చేయకూడదు. ఇలా చేయడం ద్వారా ఇతరుల మనోభావాలను గాయపరిచినట్లు అవుతుంది. ఇలాంటివి షేర్ చేస్తే మీ ఉద్యోగాలు సైతం ఊడిపోయే ప్రమాదం ఉంది.

పర్సనల్ ప్రాబ్లమ్స్‌

మీ పర్సనల్ ప్రాబ్లమ్స్‌ను కూడా షేర్ చేసుకోకూడదు. మీ ఆర్థిక ఇబ్బందులు, మీ ఇంట్లో వ్యక్తులకు ఉన్న వ్యాధులు లాంటివి సోషల్ మీడియాలో షేర్ చేయడం, ఒక రకంగా వారిని ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది.
ఏదైనా భావాన్ని పంచుకునేటప్పుడు, పూర్తిగా రాయండి, అంతేకానీ అర్థం కాకుండా అర్థరహితంగా భావం ఉండకూడదు. అలాంటివి మీ పట్ల వ్యతిరేక భావాన్ని కలుగ చేస్తాయి.

మీ కెరీర్ ను ఇబ్బందుల్లో పడేసే పోస్ట్ లు..

అలాగే మీ కెరీర్ ను ఇబ్బందుల్లో పడేసే పోస్ట్ లు కూడా చేయకూడదు. ఉదాహరణకు నాకు ఈ జాబ్ ఇష్టం లేదు. నేను విసిగిపోయాను, ఆఫీసులో బాసుల మీద జోకులు లాంటివి మీ కెరీర్, ఉద్యోగాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి.

 

వీడియో లింక్ లు సరైనవా..

మీరు షేర్ చేయాలనుకునే వీడియో లింక్ లు సరైనవా ? కాదా ? అనేది చెక్ చేసుకొని షేర్ చేయండి, నిర్ధారణ లేకుండా షేర్ చేస్తే ఇతర మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆ లింక్స్ లో మరే ఇతర కంటెంట్ ఉంటే ప్రమాదకరం.

 

 

గ్రూపుల ద్వారా మీరు..

సోషల్ మీడియా గ్రూపుల ద్వారా మీరు వ్యక్తిగతంగా దూషణ, లేదా వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయకూడదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది.

మీ జీవితంలో ఎదురయ్యే అనుభవాలను

మీ జీవితంలో ఎదురయ్యే అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి. ఎలాంటి విషయాలు పంచుకోవచ్చు,. పంచు కోకూడదు అనే విచక్షణతో పాటు ఇతరుకులకు మనం చెప్పే మాటలు ఉపయోగపడేలా ఉండాలి. అన్నింటికన్నా ముందు మీరు చెప్పే , లేదా షేర్ చేసే విషయాలు నిజాలై ఉండాలి.

కామెంట్స్ పోస్ట్ చేసేటప్పుడు

కామెంట్స్ పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాసినవారి మనస్సు నొప్పించకుండా జాగ్రత్త పడాలి. అంతే కాదు కామెంట్స్ వారి వ్యక్తిత్వాన్ని కించపరచకూడదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
11 Things You Should Not Post Online More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot