ఫేస్‌బుక్‌లో తక్షణం వీటిని డిలీట్ చేయండి

Written By:

సోషల్ మీడియా అనేది ఇప్పుడు మన అందరికీ నిత్య జీవితంలో ఓ భాగమైపోయింది. పొద్దన లేచిన దగ్గర నుంచి సాయంత్రం కునుకు తీసేదాకా అందరూ ఈ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఫేస్‌బుక్‌ లో యూజర్లు యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఫేస్‌బుక్‌ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలపై అనేక రకాలైన అనుమానాలు వచ్చాయి. కేంబ్రిడ్జ్‌ అనలిటికా సంస్థ ఉదంతంతో సేఫ్టీ అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇలాంటి డాటా హ్యాకింగ్స్‌ నుంచి మీ ఖాతాను రక్షించుకోడానికి, ఒకవేళ ఖాతా హ్యాకింగ్‌కి గురి అయిన ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి ముఖ్యమైన ఈ 10 అంశాలను ఫేసుబుక్‌లో ఉంచకపోవడం మేలు. ఒకవేళ ఉంటే వాటిని వెంటనే తొలగించడం ఉత్తమం. అలాంటి వాటిని కొన్ని మీకందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

ప్రైవసీ ఇంకా సెక్యూరిటీకే మా మొదటి ప్రాధాన్యత : వాట్సాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పుట్టిన తేది

ఇది మీకు కేవలం ఒక తేదినే కావచ్చు కానీ హ్యాకర్లు వీటి ద్వారా మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు చోరి కావచ్చు. దీనిపై జాగ్రత్తగా ఉండటం మనకే మంచిది.

ఫోన్‌ నంబర్‌

మీ ఫోన్ నంబర్ అందరికీ కనిపించేలా ఉంచడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కునే ప్రమాదం ఉంది. దీన్ని కూడా తొలగించడం ఉత్తమం. దీంతో పాటు మీ సన్నిహితులను ఫ్రెండ్స్‌ లిస్టులో ఉంచకపోవడం, హైడ్‌లో పెట్టడం వల్ల మీరు కొన్ని సమస్యల నుంచి గట్టేక్కే అవకాశం ఉంది.

ఫొటోలు..

మీ కుటుంబ సభ్యుల ఫొటోలు, ముఖ్యంగా పిల్లల ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఖాతాలో ఉంచుకోవద్దు. ఇప్పుడు మార్ఫింగ్ అనేది సర్వసాధారణమైన నేపథ్యంలో మీ ఫోటోలు మార్ఫింగ్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

లోకేషన్‌ ..

మీ పిల్లలు చదువుతున్న పాఠశాల వివరాలను కూడా ఎక్కడ పెట్టవద్దు. వీటి ద్వారా అనేక దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ మీద కక్షను మీ పిల్లల మీద తీర్చుకునే అంశాన్ని కొట్టి పారేయలేం. అలాగే లోకేషన్‌ (మీరు ఉన్న ప్రదేశం)ని ఎట్టి పరిస్థితుల్లో ఆన్ చేయవద్దు.ఇంకా చెప్పాలంటే మీరున్న లోకేషన్‌ను ట్యాగ్‌ చేయకపోవడం చాలా ఉత్తమం.

జర్నీ వివరాలు

ఫలనా చోటుకి వెళ్తున్నాం అని పోస్టులు చేయకండి. ఏదో ఓ సందర్భంలో మీరు ఇలాంటి పోస్టులు పోస్ట్ చేసినప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. దొంగల బెడద నుంచి మీ ఇంటిని కాపాడుకోవాలంటే ఇదొ ఉత్తమమైన మార్గం.

క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు

మీరు ఎట్టి పరిస్థితుల్లోనే మీ క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు కాని డెబిట్ వివరాలు కాని చెప్పవద్దు. మీ స్నేహితులతో కూడా వీటిని అసలు పంచుకోవద్దు. వీటిని పంచుకోవడం వల్ల మీ అకౌంట్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. బోర్డింగ్‌ పాస్‌కు సంబంధించిన వివరాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
12 things you might want to delete from your Facebook page More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot