ఇంటర్నెట్‌లో మీకు బాగా ఉపయోగపడే బెస్ట్ వెబ్‌సైట్‌ల వివరాలు..

యావత్ ప్రపంచం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతోన్న నేపథ్యంలో సిటిజెన్స్ కాస్తా నెటిజన్స్‌‌గా మారిపోతున్నారు.

|

యావత్ ప్రపంచం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతోన్న నేపథ్యంలో సిటిజెన్స్ కాస్తా నెటిజన్స్‌‌గా మారిపోతున్నారు. డిజిటల్ సంస్కృతికి ఫిదా అవుతోన్న నేటి ట్రెండ్ ఇంటర్నెట్‌‌లేని జీవితాన్ని అస్సలు ఊహించుకోలేకపోతోంది. స్మార్ట్‌ఫోన్‌ల సహాయంతో ఇంటర్నెట్ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటోన్న నేటి యువత వెబ్‌ బ్రౌజింగ్‌ను అమితంగా ఇష్టపడుతోంది.

15-websites-on-internet-you-must-visit

వాస్తవానికి, మనకు తెలియని ఎన్నో మంచి వెబ్‌సైట్‌లు ఇంటర్నెట్‌లో కొలువుతీరి ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటీని వినియోగించుకోవటం ద్వారా పనులను మరింత సంప్లిఫై చేసుకోవటంతో పాటు కొత్త విషయాలను తెలుసుకునే వీలుంటుంది. ఇంటర్నెట్‌లో మీరు తప్పనిసరిగా విజిట్ చేయవల్సిన 15 బెస్ట్ వెబ్‌సైట్స్ తాలూకా వివరాలను నేటి స్పెషల్ ఫోకస్ స్టోరీలో భాగగా మీ ముందుంచటం జరుగుతోంది.

జిఫ్‌ప్రింట్ (Gifprint)

జిఫ్‌ప్రింట్ (Gifprint)

మీరు GIF ఇమేజ్‌లను ఇష్టపడుతుంటారా? అయితే Gifprint అనే వెబ్‌సైట్ ద్వారా యానిమేటెడ్ GIF ఫైల్స్‌ను ఫ్లిప్‌బుక్‌లోకి కన్వర్ట్ చేసేసుకోవచ్చు. తొలత జిఫ్ ఫైల్ లేదా యూఆర్ఎల్‌ను జిఫ్‌ప్రింట్ సైట్‌లోకి అప్‌లోడ్ చేసుకుని ఆ తరువావ పీడీఎఫ్ ఫార్మాట్‌లోకి సేవ్ చేసుకోవాలి.

హౌ సెక్యూర్ ఈజ్ మై పాస్‌వర్డ్ (How Secure is My Password)

హౌ సెక్యూర్ ఈజ్ మై పాస్‌వర్డ్ (How Secure is My Password)

పేరుకు తగట్టుగానే ఈ వెబ్‌సైట్ మీ పాస్‌వర్డ్‌లకు సంబంధించిన పటిష్టతను అంచనా వేయగలుగుతుంది. తొలత ఈ వెబ్‌సైట్‌ను Enter Password బాక్సులో మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసినట్లయితే అది ఏ మేరకు సురక్షితమో తెలిసిపోతుంది.

 

 

మైడోమై (Midomi)
 

మైడోమై (Midomi)

ఈ వెబ్‌సైట్ ట్యూన్ ఆధారంగా సాంగ్‌ను పసిగట్టగలుగుతుంది. స్పీచ్ రికగ్నిషన్ సాంకేతికతతో వస్తోన్న ఈ వెబ్‌సైట్‌లో మనకు కావాలనుకుంటోన్న పాటకు సంబంధించి ట్యూన్‌ను కొద్దిగా ట్యూన్‌ను వినిపించినట్లయితే ఆటోమెటిక్‌గా సాంగ్‌ ట్రేస్ అయిపోతుంది.

 

 

సేఫ్ వెబ్ (Safe Web)

సేఫ్ వెబ్ (Safe Web)

ప్రముఖ ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ నార్టాన్ (Norton)చే ఎక్స్‌క్లూజివ్‌గా డిజైన్ చేయబడిన సేఫ్ వెబ్ (Safe Web) ద్వారా మీరు విజిట్ చేస్తున్న వెబ్‌సైట్ సురక్షితమైనదో కాదో తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకునే క్రమంలో ముందుగా సేఫ్ వెబ్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి మీరు సెర్చ్ చేయాలనుకుంటోన్న వెబ్‌సైట్ తాలూకా యూఆర్ఎల్‌ను సంబంధిత లింకులో పేస్ట్ చేసినట్లయితే ఆ వెబ్‌సైట్ సురక్షితమైనదో కాదో సేఫ్ వెబ్ చెప్పేస్తుంది.

 

 

ఓల్డ్ వెర్షన్ (Old Version)

ఓల్డ్ వెర్షన్ (Old Version)

ఈ వెబ్‌సైట్‌లో మీరు ఏదైనా సాఫ్ట్‌వేర్ లేదా యాప్‌కు సంబంధించిన వెర్షన్ నెంబర్‌ను ఎంటర్ చేసినట్లయితే వాటికి సంబంధించిన అప్‌డేట్స్ అందుబటులో ఉన్నాయో లేదో చెప్పేస్తుంది.

 

 

ర్యాండమ్ (Random)

ర్యాండమ్ (Random)

పేరుకు తగ్గట్టుగానే ఈ వెబ్‌సైట్‌లో యాదృచ్ఛికమైన విషయాలు అందుబాటులో ఉంటాయి. నెంబర్స్, ఫ్లిప్పింగ్ కార్డ్స్ ఇంకా కాయిన్స్ ఇక్కడ ర్యాండమ్‌గా అందుబాటులో ఉంటాయి.

 

 

ప్రైవ్ నోట్ (Priv Note)

ప్రైవ్ నోట్ (Priv Note)

ఈ వెబ్‌సైట్ ద్వారా ‘సెల్ఫ్ డిస్ట్రక్ట్' సదుపాయంతో కూడని మెసేజెస్‌ను మన ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీస్ కు షేర్ చేసుకునే వీలుంటుంది. ఈ మెసేజెస్ వారు చదివిన వెంటనే ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతాయి.

 

 

టూ ఫుడ్స్ (Two Foods)

టూ ఫుడ్స్ (Two Foods)

ఈ వెబ్‌సైట్ ద్వారా మనం తీసుకునే ఆహారాలకు సంబంధించి క్యాలరీలను కంపేర్ చేసుకోవచ్చు. ఇదే సమయంలో వాటిలోని కార్బోహైడ్రేట్స్ ఇంకా కొవ్వు శాతాన్ని కూడా అంచనా వేయవచ్చు.

ప్రింట్ ఫ్రెండ్లీ (Print Friendly)

ప్రింట్ ఫ్రెండ్లీ (Print Friendly)

ఈ వెబ్‌సైట్ వెబ్‌పేజీలను మరింత ప్రింట్ ఫ్రెండ్లీగా మార్చేస్తుంది. దీంతో వాటికి సంబంధించిన పీడీఎఫ్ పైళ్లను మనం క్రియేట్ చేసుకునే వీలుంటుంది.

 

 

కాపీ పేస్ట్ క్యారెక్టర్ (Copy Paste Character)

కాపీ పేస్ట్ క్యారెక్టర్ (Copy Paste Character)

స్పెషల్ క్యారెక్టర్స్‌ను ఇష్డపడే వారికి కాపీ పేస్ట్ క్యారెక్టర్ (Copy Paste Character) వెబ్‌సైట్ చాలా ఉపయుక్తంగా నిలుస్తుంది. ఈ సైట్ లో కొలువుతీరి ఉన్న అనే స్పెషల్ క్యారెక్టర్స్‌ను మనం ఉపయోగించుకోవచ్చు.

ఏ గుడ్ మూవీ టు వాచ్ (A Good Movie to Watch)

ఏ గుడ్ మూవీ టు వాచ్ (A Good Movie to Watch)

ఈ వెబ్‌సైట్ ద్వారా వివిధ వీడియో ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమవుతోన్న మంచి సినిమాలు ఇంకా వాటికి సంబంధించిన షార్ట్ రివ్యూలను తెలుసుకోవచ్చు.

సింప్లీ నాయిస్ (Simply Noise)

సింప్లీ నాయిస్ (Simply Noise)

ఈ వెబ్‌సైట్ ప్రొవైడ్ చేసే వివిధ రకాల శబ్థాలు మనలోని ఏకాగ్రత స్థాయిలను మరింత పెంచగలుగతాయి. ఏదైనా పని పై దృష్టిని కేంద్రీరించినపుడు ఈ శబ్థాలను వినటం ద్వారా పాజిటివ్ ఫలితాలను రాబట్టే అవకాశం ఉందట.

వర్డ్ ఫ్రీక్వెన్సీ కౌంటర్ (Word Frequency Counter)

వర్డ్ ఫ్రీక్వెన్సీ కౌంటర్ (Word Frequency Counter)

ఈ వెబ్‌సైట్ పదాలకు సంబంధించిన ఫ్రీక్వెన్సీని విశ్లేషించింది. వర్డ్ ఫ్రీక్వెన్సీ కౌంటర్ వెబ్‌సైట్‌లో మనం తయారు చేసుకున్న టెక్స్ట్ కంటెంట్‌ను పేస్ట్ చేసినట్లయితే అందులో ఎక్కువుగా యూజ్ చేయబడిన పదాలకు సంబంధించిన పదానికి సంబంధించిన వివరాలను మనం తెలుసుకునే వీలుంటుంది.

 

 

వన్ లుక్ (One Look)

వన్ లుక్ (One Look)

గుర్తుంచుకోవటానికి కష్టంగా ఉన్న పెద్దపెద్ద వాక్యాలను ఈ వెబ్‌సైట్ మరింతగా కుదించి సింప్లిఫై చేసే ప్రయత్నం చేస్తుంది. వన్ లుక్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన తరువాత సంబంధిత కాలమ్‌లో డిస్ర్కిప్షన్‌ను పేస్ట్ చేసి ఎంటర్ బటన్ పై క్లిక్ చేస్తు చాలు, ఆ వాక్యం కాస్తా మరింత సంప్లిఫై చేయబడుతుంది.

 

 

మాథవే(Mathway)

మాథవే(Mathway)

లెక్కలంటే భయమా? ఇక పై నిశ్చంతగా ఉండడి. గూగుల్ సెర్చ్‌లో Mathway అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ప్రాబ్లమ్‌ను ఎంటర్ చేసినట్లయితే టక్కున సొల్యూషన్ లభించేస్తుంది.

 

 

Best Mobiles in India

English summary
15 websites on Internet you must visit.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X