సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారా.. అయితే ఇది మీకే..

|

సోషల్ మీడియా ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మార్చిన వెబ్ ప్రపంచం. భూమ్మీద ఏ మూల ఉన్న జనాలైనా, వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ ఇట్టే కలిపే ప్లాట్‌ఫాం సోషల్ మీడియా. దీంతో ఎంత లాభం ఉందో, అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీ ప్రైవసీకి సోషల్ మీడియా ఒక పెద్ద అడ్డంకి అనే చెప్పవచ్చు. ఇందులో అప్ లోడ్ చేసే మీ పర్సనల్ ఫోటోలు, వీడియోస్ విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో రాజ్యం ఏలుతున్న ప్లాట్‌ఫామ్స్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్‌, ఫ్లికర్, జీ ప్లస్ ప్రధానమైనవిగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సైట్స్ లో మీ పర్సనల్ ఫోటోస్ అప్లోడ్ చేయడంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముందుగా చెక్ చేయాల్సిన ముఖ్యమైన విషయాలను పోస్ట్ చేస్తున్నాం జాగ్రత్తగా చూడండి.

 

అత్యంత తక్కువ ధరకే 32 ఇంచ్ 4కె హెచ్‌డీ స్మార్ట్‌టీవీఅత్యంత తక్కువ ధరకే 32 ఇంచ్ 4కె హెచ్‌డీ స్మార్ట్‌టీవీ

అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త...

అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త...

ఒక ఫోటో అనేది సకల సమాచార సమాహారం. సోషల్ మీడియాలో ఒక ఫోటోను అప్ లోడ్ చేయడం అంటే మీరెవరో ఒక పెద్ద ప్రపంచానికి పరిచయం చేయడం లాంటిది. ముఖ్యంగా మీ పర్సనల్ ఫోటో గానీ, లేద మీ సన్నిహుతులు, స్నేహితుల ఫోటోలను అప్ లోడ్ చేసేముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి. ఇతరు ఫోటోస్ అప్ లోడ్ చేసే ముందు వారికి సమాచారం అందించిన అనంతరం వారి అనుమతితో అప్ లోడ్ చేయాలి. లేకపోతే మీ వల్ల వారు ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ ఫోటోను కూడా అప్లోడ్ చేసే ముందు కూడా ఆలోచించుకోండి. ముఖ్యంగా యువతులకు చెందిన ఫోటోస్ చాలా వరకూ పోకిరీలు మిస్ యూస్ చేసే ప్రమాదం ఉంది.

ఫోటోలో ఏముంది ?
 

ఫోటోలో ఏముంది ?

ఉదాహరణకు మీరు ఒక సెల్ఫీ దిగితే, దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే దాని ద్వారా ఏంటి ప్రమాదం అని కొట్టి పారెయొద్దు. ఎదుటి వారి అనుమతి లేకుండా మీ ఫ్రేంలో ఇతరుల వ్యక్తులను కూడా ఫోకస్ అయితే వారికి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వారు ఏ ప్రాంతంలో ఉంటున్నారో అన్న విషయం ప్రపంచానికి తెలిసి వారి ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉంది. అలాగే పదే పదే ఫోటోలను అప్ లోడ్ చేస్తే అది మీ ప్రైవసీకి కూడా భంగం కలిగించే ప్రమాదం లేకపోలేదు.

లొకేషన్ కూడా సెన్సిటివ్ అయ్యే ప్రమాదం ఉంది...

లొకేషన్ కూడా సెన్సిటివ్ అయ్యే ప్రమాదం ఉంది...

మీరు క్లిక్ మనిపించే లొకేషన్స్ ఒకవేళ్ల చాలా జనసమ్మర్థమైనవి, లేదా చాలా కీలకమైనవి అయితే ఆ ప్రాంతానికి చెందిన ఫోటోలు జాతి వ్యతిరేక చేతులకు అందే అవకాశం లేకపోలేదు. తద్వారా మీకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా వీడియోలు అప్ లోడ్ చేసేముందు కూడా జాగ్రత్తగా ఉండాలి. వీడియోల్లో సైతం చాలా డేటా నిక్షిప్తం అయి ఉంటుంది.

ఎక్సిఫ్ మెటాడేటా ఎంతో కీలకం..

ఎక్సిఫ్ మెటాడేటా ఎంతో కీలకం..

మీరు ఏదైనా ఫోటలో అప్ లోడ్ చేసే ముందు దానికి సంబంధించిన మెటాడేటాను ఎక్సిఫ్ అని అంటారు. ఇందులో లొకేషన్ కూడా టాగ్ అయి ఉంటుంది. అందుకే ఎక్సిఫ్ మెటాడేటాను క్లియర్ చేసిన తర్వాతే ఫోటోలను అప్ లోడ్ చేస్తే మీ ప్రైవసీకి భంగం కలగదు.

మీరు షేర్ చేసే చిత్రాన్ని

మీరు షేర్ చేసే చిత్రాన్ని

చివరగా, మీరు షేర్ చేసే చిత్రాన్ని సిల్లీగా చూడొద్దు. అది ఎంత సెన్సిటీవో గమనించండి. లేకపోతే అది మీకు ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుంది.

Best Mobiles in India

English summary
4 things to check before uploading photos to social media More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X