ఫేస్‌బుక్‌ను చిక్కుల్లోకి నెట్టేసిన 5 సందర్భాలు..

|

సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో అగ్రగామి సంస్థగా గుర్తింపుతెచ్చుకున్న ఫేస్‌బుక్ గత కొద్ది రోజులుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. తాజాగా ఈ సంస్థ పై 'డేటా లీక్' ఆరోపణలు వెల్లువెత్తడంతో వాల్‌స్ట్రీట్ వద్ద షేర్లు భారీగా పతనమయ్యాయి. డేటాలీక్ ఆరోపణలను ఫేస్‌బుక్ ఖండించినప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ వ్యవహారంలో భాగంగా వేలకొద్ది ఖాతాల నుంచి వ్యక్తిగత డేటా లీకైనట్టు ఆరోపణలు వస్తుండటంతో కొందరు యూజర్లు తమ ఫేస్‌బుక్ ఖాతాలను తొలగించేందుకు మొగ్గుచూపుతున్నారు. వాస్తవానికి ఫేస్‌బుక్ పై ఈ విధమైన ఆరోపణలు కొత్తేమి కాదు గతంలోనూ అనేక సందర్భాల్లో ఫేస్‌బుక్ తన పాలసీల కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవల్సి వచ్చింది. గతంలోనూ ఫేస్‌బుక్‌ను చిక్కుల్లోకి నెట్టేసిన 5 సందర్భాలను ఇప్పుడు ప్రస్తావించుకుందాం...

 

ఫేస్‌బుక్‌లో ఈ పదం టైప్ చేస్తే మీ అకౌంట్ హ్యాక్ అవుతుందని తెలుసా..?ఫేస్‌బుక్‌లో ఈ పదం టైప్ చేస్తే మీ అకౌంట్ హ్యాక్ అవుతుందని తెలుసా..?

 అశ్లీల కంటెంట్‌ను ప్రోత్సహిస్తుందంటూ..

అశ్లీల కంటెంట్‌ను ప్రోత్సహిస్తుందంటూ..

అసభ్యకరమైన ఇంకా అశ్లీల అంశాలకు సంబంధించిన శోధనలను ఫేస్‌బుక్ సజెస్ట్ చేస్తుందంటూ ఇటీవల పలువురు నెటిజన్లు ట్విట్టర్ ద్వారా తమ అగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ అందుబాటులో ఉన్న అన్ని భాషల్లోనూ ఈ తరహా సంస్కృతి కొనసాగుతోందని వీళ్లు ఆరోపించటంతో వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్ ఆ విధమైన ప్రెడిక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా రిమూవ్ చేయటం జరుగుతుందని ఫేస్‌బుక్ తెలిపింది.

మరో క్షమాపణలు చెప్పుకోవల్సిన పరిస్థితి...

మరో క్షమాపణలు చెప్పుకోవల్సిన పరిస్థితి...

ఫిబ్రవరి 2018లో చోటుచేసుకున్న మరో సంఘటన ఫేస్‌బక్‌లోని లోపాన్ని మరోసారి ఎత్తి చూపింది. గాబ్రియల్ లివిస్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోసం ప్రయత్నించగా, దానికి ప్రతిస్పందించిన ఫేస్‌బక్ అవసరంలేని టెక్స్ట్ నోటిఫికేషన్‌లతో గాబ్రియల్‌ను ఉక్కిరి బిక్కిరి చేసిందట. ఈ వ్యవహారాన్ని ట్విట్టర్ ద్వారా గాబ్రియల్ బయటపెట్టటంలో ఫేస్‌బుక్ చీఫ్ సెక్యూరిటీ అధికారి అలెక్స్ స్టామోస్ క్షమాపణలు చెప్పుకోవల్సి వచ్చింది.

రక్తపాతాన్ని ప్రోత్సహించేలా రియాల్టీ గేమ్..
 

రక్తపాతాన్ని ప్రోత్సహించేలా రియాల్టీ గేమ్..

సరిగ్గా నెల క్రితం ఫేస్‌బుక్ తన వర్చువల్ రియాల్టీ గేమ్ అయిన బుల్లెట్ ట్రెయిన్‌కు సంబంధించి ఓ డెమోను పోస్ట్ చేయటం జరిగింది. షూటింగ్ నేపథ్యంలో సాగే ఈ గేమ్ పలు భయంకరమైన సన్నివేశాలను కలిగి ఉంది. ఈ డెమో విడుదలైన కొద్ది రోజులకే ఫ్లోరిడా స్కూల్‌లో కాల్పుల ఉదంతం కలకలం రేపింది.

యూజర్ల వ్యక్తిగత డేటాను ప్రకటనదారులకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు..

యూజర్ల వ్యక్తిగత డేటాను ప్రకటనదారులకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు..

యూజర్ల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని ప్రకటనదారులకు చేరవేస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కంపెనీ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ సంజాయిషీ ఇచ్చుకోవల్సి వచ్చింది. డార్మ్ రూమ్ అనే ప్రాజెక్టులో భాగంగా గ్లోబల్ సోషల్ నెట్‌వర్క్‌కు కోట్లాది మందిని అనుసంధానం చేసేందకు ఒకే వేదిక పైకి తీసుకువచ్చేందుకు యూజర్ డేటాను వినియోగించుకోవల్సి వచ్చిందని తెలిపారు.

బెడసికొట్టిన Beacon ఫీచర్...

బెడసికొట్టిన Beacon ఫీచర్...

సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ఫేస్‌బుక్ Beacon పేరుతో ఓ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. ఈ ఫీచర్ ముఖ్య ఉద్ధేశ్యాన్ని జూకర్‌బర్గ్ వెల్లడిస్తూ నెటిజనులు సైట్స్ మధ్య సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు ఓ సింపుల్ ప్రొడక్ట్‌ను బిల్డ్ చేయాలన్నది తమ సంకల్పమని, ఈ కారణంగానే బీకాన్ ఫీచర్‌ను బిల్డ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఫీచర్ పై అనేక విమర్శలు వెల్లువెత్తటంతో ఫేస్‌బుక్ క్షమాపణల చెప్పుకోవల్సి వచ్చింది.

 

 

Best Mobiles in India

English summary
These aren’t really the best of the times for Facebook and there really seems to be no respite for the social networking giant. Its shares are tumbling on Wall Street, it's facing backlash from several quarters for its policies and practices.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X