ఫేక్ ఫోటోలు,వీడియోలపై సీఆర్‌పీఎఫ్‌ యుద్దం, పద్దతి కాదంటూ హెచ్చరిక

పుల్వామా తీవ్రవాద దాడిలో పదుల సంఖ్యలో సైనికులు వీరమరణం పొందడం సైన్యాన్ని మాత్రమే కాదు... అందర్నీ కలచివేసింది. ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇప్పటికీ దేశమంతా సంతాపం తెలుపుతుంటే... పుల్వామా ఘటన చుట్టూ తప్

|

పుల్వామా తీవ్రవాద దాడిలో పదుల సంఖ్యలో సైనికులు వీరమరణం పొందడం సైన్యాన్ని మాత్రమే కాదు... అందర్నీ కలచివేసింది. ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇప్పటికీ దేశమంతా సంతాపం తెలుపుతుంటే... పుల్వామా ఘటన చుట్టూ తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతుండటం సీఆర్‌పీఎఫ్‌కు పెద్ద సమస్యగా మారింది. జైషే ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులు కాగా, వారి ఫొటోల స్థానంలో ఎల్టీటీటీఈ సభ్యుల ఫొటోలతో పోస్టర్లు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్ సైనికుల్ని బలిగొన్న కొన్ని నిమిషాల్లోనే ఫేక్ న్యూస్ ప్రవాహం మొదలైంది. తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. కుప్పలుతెప్పలుగా సర్క్యులేట్ అవుతున్న ఫేక్ న్యూస్‌పై పోరాడేందుకు పారామిలిటరీ ఫోర్స్ ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందంటే... ఫేక్ న్యూస్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ద్వేషాన్ని ప్రేరేపించే అలాంటి పోస్టులను షేర్ చేయకూడదంటూ సీఆర్‌పీఎఫ్ ట్వీట్ చేసింది.

 
ఫేక్ ఫోటోలు,వీడియోలపై సీఆర్‌పీఎఫ్‌ యుద్దం, పద్దతి కాదంటూ హెచ్చరిక

ఫేక్ న్యూస్ 1

ఫేక్ న్యూస్ 1

లిబరేషన్ ఆఫ్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈళం (ఎల్టీటీటీఈ) ఫైటర్స్ ఫొటోలతో ఉన్న పోస్టర్లతో కూడిన ఓ ఫోటో పుల్వామా అమరవీరులు అని దుష్ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఇది గుర్తించి దాన్ని ట్వీట్ చేశారు. బీజేపీ అమరవీరుల ఫొటోలను పోస్టర్లు వేసినట్లు మీడియాలో చూశానని, అయితే తాజాగా కనిపిస్తున్నట్లు ఫొటోలు ఎల్టీటీటీఈ దళ సభ్యులవని తనకు మీడియా చెప్పిందని.. బీజేపీ అధిష్టానం త్వరగా స్పందించాలంటూ ఆయన పోస్ట్ చేశారు.

రివర్స్ ఇమేజ్ సెర్చ్

రివర్స్ ఇమేజ్ సెర్చ్

సుబ్రమణ్య స్వామి ఆరోపణలతో టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించి ఆ ఫొటోలతో గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా నిజం వెల్లడైంది. 2014 మార్చి 6న ఎల్టీటీటీఈ దళ సభ్యులు చనిపోయారని వెబ్‌సైట్ ఈ పోస్టర్‌ను వాడినట్లు గుర్తించారు.

తాజాగా దర్శనమిచ్చిన పోస్టర్లలో
 

తాజాగా దర్శనమిచ్చిన పోస్టర్లలో

ఇదిలా ఉంటే పుల్వామా దాడిలో కేవలం పురుష జవాన్లు చనిపోగా, తాజాగా దర్శనమిచ్చిన పోస్టర్లలో మహిళల ఫొటోలు ఉండటం గమనార్హం. దీంతో ఆ పోస్టర్ పుల్వామా అమరవీరుల పోస్టర్ కాదని తేలిపోయింది. సీఆర్పీఎఫ్ విడుదల చేసిన పోస్టర్‌లో అమర జవాన్ల ఫొటోలున్నాయి.

ఫేక్ న్యూస్ 2

ఫేక్ న్యూస్ 2

ఉగ్రవాదులను మట్టుపెట్టిన తర్వాత భారత ఆర్మీ వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడం లేదని వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. కానీ పుల్వామా దాడికి ముందు కూడా ఇలాంటి వదంతులు వచ్చాయని తెలిసిందే. భారత ఆర్మీ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. గతంలో కాశ్మీర్‌లో భారత ఆర్మీ చేతిలో చనిపోయిన ఉగ్రవాదుల మృతదేహాలను తీసుకెళ్లాలని పాకిస్థాన్‌కు సూచించింది.

ఫేక్ న్యూస్ 3

ఫేక్ న్యూస్ 3

గతంలో భారత ఆర్మీ పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన వీడియోను పోస్ట్ చేసి, పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న బలగాలు అని క్యాప్షన్ రాస్తున్నారు. జవాన్లు ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలను తరలించడం వీడియోలో కనిపిస్తుంది. పుల్వామా దాడి తర్వాత వీడియోను వైరల్ చేస్తున్నారు. స్క్రీన్ షాట్ తీసి ఇన్‌విడ్ గూగుల్ క్రోమ్ ఎక్స్‌ఎన్షన్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అది పాత వీడియో అని తేలింది. గతేడాది ఆ వీడియో పోస్ట్ చేసినట్లు గమనించవచ్చు.

గతంలో ఎప్పుడో జరిగిన...

గతంలో ఎప్పుడో జరిగిన...

సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలు అసలైనవే. కానీ అవి గతంలో ఎప్పుడో జరిగిన ఘటనలకు సంబంధించినవని టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ నిర్ధారించింది. పుల్వామా దాడికి ప్రతీకార దాడులను భారత ఆర్మీ చేయలేదు. ఇటువంటి వార్తలను ప్టోస్ చేయడం పద్దతి కాదంటూ మానుకోవాలని ట్వీట్ చేసింది.

పుల్వామా దాడి లో మరణించిన సైనికులు వీళ్ళే

 

Best Mobiles in India

English summary
After Pulwama terror attack, Indian Army now subjected to fake news

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X