యూట్యూబ్ మరచిపోండి, అమెజాన్ ట్యూబ్ వస్తోంది !

By Hazarath
|

సెర్చింజిన్ దిగ్గజం గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రోజుకు కొన్నికోట్ల సంఖ్యలో వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతున్నాయి. కోట్ల వ్యూస్‌తో లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్‌కు పోటీగా అమెజాన్ నుంచి అమెజాన్ ట్యూబ్ దూసుకురాబోతోంది. ఇదే జరిగితే యూట్యూబ్‌కు ఇక కష్టకాలం తప్పదని తెలుస్తోంది.

 

జియో కొత్తగా అప్‌డేట్ చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఇవే !జియో కొత్తగా అప్‌డేట్ చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఇవే !

యూట్యూబ్‌కు పోటీగా..

యూట్యూబ్‌కు పోటీగా..

యూట్యూబ్‌కు పోటీగా అమెజాన్ త్వరలో తన సొంత వీడియో షేరింగ్‌ సైటును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. యూట్యూబ్ తరహాలో అమెజాన్ ట్యూబ్ సైట్‌ను అమెజాన్ డెవలప్ చేస్తున్నట్లు సమాచారం.

 వీడియో షేరింగ్‌తోపాటు..

వీడియో షేరింగ్‌తోపాటు..

ఈ సైట్‌లో వీడియో షేరింగ్‌తోపాటు యూజర్లు ఫొటోలు, టెక్ట్స్ మెసేజ్‌లు, డేటా, ఇతర సమాచారం కూడా షేర్ చేసుకునేందుకు వీలు కల్పించనున్నారని టెక్‌ వర్గాల ద్వారా తెలిసింది.

Image source : phonandroid

ట్రేడింగ్‌ మార్కుల కోసం..

ట్రేడింగ్‌ మార్కుల కోసం..

ఈ నెల మొదట్లో ట్రేడింగ్‌ మార్కుల కోసం యూఎస్‌ పేటెంట్‌, ట్రేడ్‌మార్కు ఆఫీసు వద్ద దరఖాస్తు కూడా చేసుకుంది.

 అమెజాన్ ట్యూబ్ అని మాత్రమే కాకుండా..
 

అమెజాన్ ట్యూబ్ అని మాత్రమే కాకుండా..

ఈ వీడియో షేరింగ్ సైట్‌కు కేవలం అమెజాన్ ట్యూబ్ అని మాత్రమే కాకుండా ఓపెన్ ట్యూబ్, అలెక్సా ఓపెన్ ట్యూబ్, అమెజాన్ అలెక్సా ట్యూబ్, అమెజాన్ ఓపెన్ ట్యూబ్ అని పలు డొమెయిన్ నేమ్స్‌ను అమెజాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

గూగుల్ దెబ్బ

గూగుల్ దెబ్బ

గూగుల్ సంస్థ ఇటీవలే అమెజాన్‌కు చెందిన టచ్‌స్క్రీన్ ఎకో డివైస్, ఫైర్ టీవీల నుంచి తన యూట్యూబ్ యాప్‌ను తొలగించింది. దీన్ని అమెజాన్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

అకస్మాత్తు నిర్ణయంతో..

అకస్మాత్తు నిర్ణయంతో..

గూగుల్ తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయంతో ఆగ్రహానికి గురైన అమెజాన్ సొంతంగా యూట్యూబ్ తరహాలో ఓ సైట్‌ను తేవాలని నిశ్చయించుకుందని తెలిసింది.

 అమెజాన్ ఎలాంటి ప్రకటన..

అమెజాన్ ఎలాంటి ప్రకటన..

అయితే దీనిపై ఇంకా అమెజాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలో వివరాలు తెలిసే అవకాశం ఉంది..!

Best Mobiles in India

English summary
Amazon may be planning a YouTube rival MoreNews at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X