సూసైడ్ చేసుకుంటున్న మైనర్ బాలికను కాపాడిన పోలీసులు

ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దేవుడు మనిషి జీవితాన్ని ప్రసాదించాడు అంటారు మన పెద్దవాళ్ళు. పుట్టాక కచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు చనిపోవడం ఖాయం

By Anil
|

ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దేవుడు మనిషి జీవితాన్ని ప్రసాదించాడు అంటారు మన పెద్దవాళ్ళు. పుట్టాక కచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు చనిపోవడం ఖాయం.కానీ ఈ రోజుల్లో కొంత మంది మనుషులు వారి జీవితాన్ని సగం లో అంతం చేసుకుంటున్నారు .అది వారి పరిస్థుతుల ప్రభావం వల్ల ఈ భూమి మీద ఉండలేననే నిర్ణయాలను తీసుకునే విధంగా వాళ్ళను ప్రేరేపిస్తుంటాయి. ఇప్పుడు ఈ ఘటన కూడా సరిగ్గా అలాంటి కోవలోకే వస్తుంది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన అస్సాంలో చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక సూసైడ్ చేసుకోబోతుంటే పోలీసులు సోషల్ మీడియా లోని పోస్ట్ వల్ల అప్రమత్తమై ఆ మైనర్ బాలికను కాపాడారు .... పూర్తి వివరాల్లోకి వెళ్తే

అస్సాంకు చెందిన మైనర్ బాలిక...

అస్సాంకు చెందిన మైనర్ బాలిక...

అస్సాం లోని గౌహతి కు చెందిన ఒక మైనర్ బాలిక సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయం చూసి సూసైడ్ చేసుకోబోయింది.కాగా ఆ మైనర్ బాలిక తను సూసైడ్ చేసుకుంటున్నట్టు పేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

పేస్ బుక్ అమెరికా కార్యాలయం...

పేస్ బుక్ అమెరికా కార్యాలయం...

అయితే ఆ మైనర్ బాలిక సూసైడ్ పోస్ట్ గురించి తెలుసుకున్న అమెరికా లోని పేస్ బుక్ కార్యాలయం వెంటనే అస్సాం పోలీసులను అప్రమత్తం చేసింది.

అప్రమత్తమైన అస్సాం  పోలీసులు...

అప్రమత్తమైన అస్సాం పోలీసులు...

అప్రతమైన అస్సాం పోలీసులు 30 నిమిషాలలో ఆ మైనర్ బాలికను అడ్రస్ ను ఛేదించి ఆ బాలికను సూసైడ్ నుంచి కాపాడారు.

అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ హర్మీత్ సింగ్...
 

అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ హర్మీత్ సింగ్...

పేస్ బుక్ ఇండియా లోని   నోడల్ ఆఫిసర్ కు ఒక హెచ్చరికను పంపిన వెంటనే ఆ ఆఫీసర్ సోషల్ మీడియా సెంటర్ను ఒకసారి యాక్టివేట్ చేసాడని .ఫీల్డ్ టీమ్స్ ద్వారా ఆ మైనర్ బాలికను అడ్రస్ ను ట్రాక్ చేశామని అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ హర్మీత్ సింగ్ మీడియా కు తెలిపారు. ప్రస్తుతం ఆ బాలికకు మరియు గార్డియన్ కు కౌన్సిలింగ్ ఇచ్చామని ఇప్పుడు ఆ బాలిక సేఫ్ గా ఉందని ఇది మా సోషల్ మీడియా చొరవకు గొప్ప విజయాన్ని సాధించింది అని హర్మీత్ సింగ్ మీడియా కు తెలిపారు.

 

 

 

 

 

Best Mobiles in India

English summary
The Assam Police rescued a girl minor girl from committing suicide in Guwahati on Monday, after Facebook from its US office alerted them about a post the girl had put up earlier that day.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X