గోవా వెళితే మ్యాప్ మీద ఆధారపడకండి, కొంప కొల్లేరు చేసుకోకండి

గోవాలో ప్రముఖ బీచ్ అయిన బాగా బీచ్ చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ ఆశ్రయించిన వారికి చేదు అనుభవం ఎదురవుతోంది. బీచ్ చేరుకోవడానికి ఇంకా కిలోమీటర్ దూరం ఉండగానే లోకేషన్ ఎండ్ అని చూపిస్తోంది.

|

గూగుల్ మ్యాప్ అనేది చాలామందికి ఎంతో ఉపయోగకరమైన యాప్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్ ద్వారానే ఆ ప్రదేశం యొక్క వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటాము. అయితే ఈ గూగుల్ మ్యాప్ తో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అడ్రస్ కరెక్ట్ గా చెప్పకపోవడంతో కొన్ని విషాద ఘటనలు కూడా ఆ మధ్య కాలంలో జరిగాయి.

గోవా వెళితే మ్యాప్ మీద ఆధారపడకండి, కొంప కొల్లేరు చేసుకోకండి

అయితే ఇప్పుడు గోవాలో మరో విచిత్రమైన పరిస్థితి ఎదురయింది. గూగుల్ మ్యాప్ నమ్ముకున్నందుకు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీరే చూడండి.

బాగా బీచ్ చేరుకునేందుకు

బాగా బీచ్ చేరుకునేందుకు

గోవాలో ప్రముఖ బీచ్ అయిన బాగా బీచ్ చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ ఆశ్రయించిన వారికి చేదు అనుభవం ఎదురవుతోంది. బీచ్ చేరుకోవడానికి ఇంకా కిలోమీటర్ దూరం ఉండగానే లోకేషన్ ఎండ్ అని చూపిస్తోంది.

ఇంకా కిలోమీటరు దూరం

ఇంకా కిలోమీటరు దూరం

అక్కడ బీచ్ ఎక్కడ ఉందో తెలియక టూరిస్టులు తెగ ఇబ్బంది పడుతున్నారు. స్థానికులను అడిగితే ఇంకా కిలోమీటరు దూరం ఉందని చెప్పడంతో మళ్ళీ ఏదో ఒక వాహనాన్ని ఆశ్రయంచాల్సి వస్తోంది. డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు అవుతున్నాయని టూరిస్టులు కూడా నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

స్థానికులకు చిరాకు

స్థానికులకు చిరాకు

ఇదిలా ఉంటే స్థానికులకు ఈ విషయంలో చిరాకు వస్ోతందట. ప్రతి ఒక్కరూ అడ్రస్ అడుగుతుండటంతో వారి తల ప్రాణం తోకకు వస్తోందట. అందుకుని ఓ సరికొత్త పరిష్కార మార్గాన్ని ఆలోచించారు. అదేంటటంటే ఓ బ్యానర్ తో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

గూగుల్ మ్యాప్ ఎండ్ అయ్యే చోట

గూగుల్ మ్యాప్ ఎండ్ అయ్యే చోట

గూగుల్ మ్యాప్ ఎక్కడయితే ఎండ్ అవుతుందో ఆ చోట ఈ బ్యానర్ ని కట్టారు. You are fooled by Google Map. This road don't take you to Baga Beach!!! Turn back and take a left turn. Baga is 1 KM from here అని పెద్ద అక్షరాలతో బ్యానర్ ని కట్టారు.

ట్విట్టర్లో వైరల్

ట్విట్టర్లో వైరల్

ఇదిలా ఉంటే ఇది ట్విట్టర్లో వైరల్ అయింది. ట్విట్టర్లో ఓ యూజర్ దీన్ని పోస్ట్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది. గూగుల్ కూడా మనల్ని ఇలా ఫూల్ చేస్తుందంటూ ఫోటోతో కూడిన ట్వీట్ చేశారు. కాబట్టి గోవా వెళితే గూగుల్ మ్యాప్ ని ఎక్కువగా ఆశ్రయించకండి.

Best Mobiles in India

English summary
Here's why this banner in Goa is 'warning' tourists against Google Maps more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X