ఇండియా ఫస్ట్ పీఎం నెహ్రూ కాదట, గూగుల్ సంచలనం, కారణమేంటి ?

Written By:

గూగుల్ ఇండియా సెర్చ్ బార్ జవహర్ లాల్ నెహ్రూను నరేంద్ర మోడీగా మార్చివేసింది. ఇండియా తొలి ప్రధాని అని సెర్చ్ చేస్తే, జవహర్ లాల్ నెహ్రూ బదులుగా ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో కనిపిస్తుండటంతో నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇక సెర్చ్ చేస్తే తొలుతగా వికీపీడియా లింక్‌ను చూపిస్తున్న గూగుల్ సెర్చ్ బార్, పక్కనే నరేంద్ర మోమై ఫోటోను చూపిస్తోంది. ఆయన పేరును నెహ్రూగా చూపిస్తోంది. ఇక ఈ తప్పిదంపై కాంగ్రెస్ సోషల్ మీడియా తీవ్రంగా విరుచుకుపడుతోంది. గూగుల్ ఇలాంటివి చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. కాగా, ఈ తప్పు ఇప్పటికీ అలానే ఉంది.

ఇండియా ఫస్ట్ పీఎం నెహ్రూ కాదట, గూగుల్ సంచలనం, కారణమేంటి ?

'గూగుల్ డాట్ కో డాట్ ఇన్' సెర్చ్ బార్ లో 'India first PM' అని టైప్ చేస్తే నెహ్రూ పేరు, మోదీ ఫొటో వస్తున్నాయి. ట్విట్టర్లో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. అందరూ గూగుల్ మీద జోకులు వేస్తున్నారు.

అదిరే ఫీచర్లతో షియోమి ఎంఐ 6ఎక్స్, పేరు మార్చుకుని ఇండియాకు ..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్ టెన్ క్రిమినల్స్

గూగుల్ సెర్చ్ బార్‌లో టాప్ టెన్ క్రిమినల్స్ అని టైప్ చేస్తే అందులో మోడీ రెండు మూడు ప్లేసుల్లో ఉన్నారు.దీన్ని గూగుల్ మళ్లీ సవరించింది.

Namak haram country

దీన్ని గూగుల్ సెర్చ్ బార్‌లో టైప్ చేస్తే అందులో ఇండియా కనిపిస్తోంది. ఇది అప్పట్లో పెద్ద వివాదం అయింది కూడా. పాకిస్తాన్ టెకీలు ఈ పనికి పాల్పడ్డారనే కథనాలు కూడా వచ్చాయి.

సరిత

సౌత్ ఇండియా హీరోయిన్ సరిత పేరు టైప్ చేయగానే అక్కడ కాప్ట్ అంటూ ఓ పదం దర్శనమిచ్చింది. అది అలా ఎందుకు వచ్చిందనేది ఇప్పటికీ ఆశ్చర్యమే.

కొన్ని పదాలను టైప్ చేస్తే..

వీటితో పాటు గూగుల్ ట్రాన్స్ లేట్ సమయంలో కూడా అనేక రకాలైన వింతలు అనుభవాలు ఎదురవుతాయి. అలాగే కొన్ని పదాలను టైప్ చేస్తే గూగుల్ రూపరూఖలే మారిపోతాయి. ఏవో గేమ్స్ వస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Big Google goof up! See shocking results after typing ‘India first PM’ More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot