2016లో ట్రంప్ విజయం వెనుక భారీ స్కెచ్, వెలుగులోకి పచ్చి నిజాలు,ఫేస్‌బుక్‌కు భారీ నష్టం

Written By:

బ్రిటీష్ డేటా ఎనాలటిక్స్ సంస్థ Cambridge Analytica ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, ఆ డేటాను స్వార్థ ప్రయోజనాలకు వాడుకుందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కాగా ఈ సంస్థ 2014లోడొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారానికి పనిచేసింది. ఇంకా ఆసక్తిక అంశం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుయాయుడు స్టీవ్‌బానన్‌ కేంబ్రిడ్జ్‌ అనలిటికా' అనే సంస్థను నెలకొల్పాడు. ఈ సంస్థ నకిలీ సమాచారాన్ని ఎంతో తెలివిగా స్వార్థప్రయోజనాల కోసం వినియోగించుకుంది. లక్షలాది ప్రజల ఆలోచనలను తనకు ప్రయోజనం కల్గించేలా, తను ఊహించిందే నిజమని భ్రమించేలా చేయడంలో కృతకృత్యురాలైంది. ఈ విషయంపై ఇప్పుడు అక్కడ పెద్ద దుమారమే రేగుతోంది.

జియోతో పోటీకి సై అంటున్న ఎయిర్‌టెల్, మార్కెట్లోకి కొత్త ప్లాన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్‌ యూజర్‌ వివరాలతో..

2014లో ట్రంప్‌ ఎన్నికల మొబైల్‌ ప్రచారానికి వినియోగించిన ‘కేంబ్రిడ్జ్‌ అనలిటికా' యాప్‌ 5 కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను తస్కరించింది.ఫేస్‌బుక్‌ యూజర్‌ వివరాలతో ఈ యాప్‌లో లాగిన్‌కు అవకాశం కల్పించడంతో.. యాప్‌ నిర్వాహకులు యూజర్ల ప్రొఫైల్‌, ఇతర వివరాలను దుర్వినియోగం చేసినట్లు ఫేస్‌బుక్‌ అధికారులు గుర్తించారు.

2,70,000 మంది సమాచారాన్ని..

వ్యక్తిత్వ పరీక్షల కోసం ఉద్దేశించిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న 2,70,000 మంది సమాచారాన్ని దుర్వినియోగం చేసింది. వీరంతా ఏం ఇష్టపడతారో, ఎలాంటి సమాచారాన్ని చదువుతారో అర్థం చేసుకుని అలాంటి సమాచారంతో కూడిన బ్లాగ్‌లు, వెబ్‌సైట్లను చూసేలా ఫేస్‌బుక్‌లోని ఇతరులతో సంభాషణలు నెరిపేలా జాగ్రత్త పడింది.

దిద్దుబాటు చర్యలు

కాగా సమాచార ఆధిపత్యం' అనే ఆలోచనతో 2016లో ఇదంతా చేశామని ఒకప్పుడు కేంబ్రిడ్జ్‌ అనలిటికాలో పనిచేసిన, కెనడాకు చెందిన మాజీ ఉద్యోగి ఒకరు తాజాగా వెల్లడించారు. 2,70,000 మంది ఖాతాదారుల సమాచారం దుర్వినియోగం కావడం నిజమేనని ఫేస్‌బుక్‌ కూడా అంగీకరించింది. వెంటనే దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ఈ యాప్‌ను ఫేస్‌బుక్‌ నుంచి తొలగించారు.

స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్‌ లేబొరేటరీస్ల ఖాతాలను..

కేంబ్రిడ్జ్‌ అనలిటికా'తో పాటు దాని సృష్టికర్తలైన కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజిస్టు అలెక్సాండ్ర్‌ కోగన్‌, క్రిస్టోఫర్‌ వైలీ, వారు నిర్వహిస్తున్న సంస్థ యూనోఇయా టెక్నాలజీస్‌, ఈ యాప్‌ మాతృసంస్థ స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్‌ లేబొరేటరీస్ల ఖాతాలను ఫేస్‌బుక్‌ నుంచి సస్పెండ్‌ చేశారు.

రూ. 97.61 కోట్ల మూలధనం..

కాగా కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు రూ. 97.61 కోట్ల మూలధనం ఉందని, ఈ మొత్తాన్ని రిపబ్లికన్‌ పార్టీకి విరాళాలిచ్చే కీలక దాత రోబెర్ట్‌ మెర్సెర్‌ సమకూర్చాడని ‘న్యూయార్క్‌ టైమ్స్‌' ఓ కథనంలో పేర్కొంది.ఎన్నికల ప్రచార సమయంలో స్టీవ్‌ బెన్నోన్‌ ఈ యాప్‌ను నిర్వహించే వారని ఆ పత్రిక తెలిపింది.

ఈ విషయం తెలిసి రెండేళ్లు అవుతున్నా..

వాస్తవానికి ఈ విషయం తెలిసి రెండేళ్లు అవుతున్నా, తాజాగా అంగీకరించిందని అమెరికా, బ్రిటన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారం ఎలా లీకైందో కేంబ్రిడ్జ్ అనలిటికా, ఫేస్‌బుక్‌ సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ చెప్పాలని, వినియోగదారుల రక్షణ కోసం సంస్థ ఎలాంటి ప్రణాళికలను యోచిస్తోందో చెప్పాలని అమెరికా, యూకే రాజకీయవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

మొత్తం దాదాపు 50 లక్షల మంది సమాచారం..

మొత్తం దాదాపు 50 లక్షల మంది సమాచారం తస్కరణకు గురైందని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు జుకెర్‌బర్గ్‌పై చర్యలకు యోచిస్తున్నాయి. ఇదిలా ఉంటే సమాచారం దుర్వినియోగంపై తమ సంస్థ త్వరలోనే విచారణ చేపట్టనున్నట్టు మసాచుసెట్స్ అటార్నీ జనరల్ మౌరా హీలే ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

ఫేస్‌బుక్ వాటాలు భారీగా నష్టపోయాయి..

ఇదిలా ఉంటే ఫేస్‌బుక్ సమాచారం లీకైనట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఫేస్‌బుక్ వాటాలు భారీగా నష్టపోయాయి. దాదాపు 40 బిలియన్ డాలర్లు తగ్గాయి. జుకెర్ బర్గ్ ఒక్కడికే 5.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.33 వేల కోట్లు) నష్టం వాటిళ్లినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఫేస్ బుక్ లో ఆయన వాటా 16 శాతంగా ఉంది. నష్టం తర్వాత జుకెర్ బర్గ్ సంపద 69.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ నెల తొలి వారంలో విడుదల చేసిన ఫోర్బ్స్ రిచెస్ట్ లిస్ట్ లో ఐదోస్థానంలో ఉన్న ఆయన, ఇప్పుడు రియల్ టైమ్ ర్యాంకింగ్స్ లో పదోస్థానానికి పడిపోయారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Cambridge Analytica: 5 things about the firm at the centre of Facebook's data breach More news at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot