ఫేస్‌బుక్ లేకుండా మెసెంజర్‌ను ఉపయోగించుకోవచ్చా..?

Posted By: BOMMU SIVANJANEYULU

ఫేస్‌బుక్ మెసెంజర్ అనేది ఫేస్‌బుక్ సోషల్ నెట్‌వర్క్‌లో ఓ భాగం. ఈ చాట్ అప్లికేషన్‌ను ఫేస్‌బుక్ అకౌంట్ అవసరం లేకుండా ఉపయోగించుకునే వీలుంటుంది. మెసెంజర్ యాప్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే క్రమంలో ఫేస్‌బుక్ రోజుకో కొత్త ఫీచర్‌ను యాడ్ చేస్తూ వస్తోంది. ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను మరింత ఎఫెక్టివ్‌గా ఉపయోగించుకునేందుకు పలు టిప్స్ అండ్ ట్రిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను డెస్క్‌టాప్ పై కూడా వాడుకోవచ్చు. డెస్క్‌టాప్ పై మెసెంజర్ ఇంటర్‌ఫేస్ అచ్చం మొబైల్ యాప్ మాదిరిగానే ఉంటుంది. ఏ విధమైన న్యూస్ ఫీడ్స్ మీకు విఘాతం కలిగించవు. మిత్రులతో హ్యాపీగా చాటింగ్ చేసుకోవచ్చు. మెసెంజర్ యాప్ వాడటానికి ఫేస్‌బుక్ అకౌంట్ అవసరం లేదు. మెసెంజర్ యాప్‌లో "Not on Facebook?" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని మొబైల్ నెంబరుతో యాప్‌‍లోకి లాగిన్ కావొచ్చు.

జియోని టార్గెట్ చేసిన Airtel, కొత్త ఆఫర్‌తో ఎంట్రీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కారు సర్వీసులను కూడా బుక్ చేసుకోవచ్చు...

మెసెంజర్ యాప్ ద్వారా Uber car సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. యాప్‌లోని More iconను సెలక్ట్ చేసుకుని అందులోని Transportation ఆప్షన్ పై టాప్ చేయండి. ఇక్కడ మీకు Uber సర్వీసుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. మీ అకౌంట్ లోకి లాగిన్ అవటం ద్వారా సర్వీస్ రిక్వెస్ట్ పంపొచ్చు.

మీరు తరచూ ఒకే గ్రూప్‌తో చాట్ చేస్తుంటారా?

అయితే, మీరు ఆ గ్రూప్‌ను పిన్ చేసుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా మెసెజ్ వచ్చిన ప్రతిసారి ఆ మెసెజ్‌ను వెతుక్కోవల్సిన అవసరం ఉండదు. మీ కళ్ల ముందే కనిపిస్తుంది. మెసెంజర్ యాప్‌లో మీకు నచ్చిన గ్రూప్ చాట్‌ను పిన్ చేయదలిచినట్లయితే యాప్ బాటమ్‌లో కనిపించే గ్రూప్ బటన్ పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు యాప్ ఎడమ వైపు టాప్ కార్నర్‌లో Pin button కనిపిస్తుంది. మెసెంజర్ యాప్‌లో ఏదైనా conversationను మ్యూట్ చేయదలిచినట్లయితే ఆ మెసెజ్ హెడర్ పై టాప్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ కనిపిస్తాయి, వాటిలో మీరు conversation ఎంత సేపటి వరకు మ్యూట్ చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోవచ్చు.

 

 

పేమెంట్స్ కూడా సాధ్యమే..?

మెసెంజర్ యాప్ ద్వారా పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం భారత్‌లోకి ఇంకా అందుబాటులోకి రాలేదు. యూఎస్‌లోని యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే చాట్ విండోలోకి వెళ్లి బ్లూ కలర్‌లో కనిపించే + ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే పచ్చ రంగులో పేమెంట్స్ ఐకాన్ ఒకటి కనిపిస్తుంది. ఈ ఐకాన్ పై క్లిక్ చేసి పేమెంట్ అకౌంట్‌ను సెటప్ చేసుకున్న తరువాత నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

 

 

మీరు పంపే మెసేజ్‌లు సీక్రెట్‌గా ఉండాలంటే...

ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా మీరు పంపే మెసేజ్‌లు మరింత గోప్యతగా ఉండాలంటే మెసేజ్‌ను సెండ్ చేసే సమయంలో సీక్రీట్ కన్వర్జేషన్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎన్ క్రిప్షన్ ను ఎనేబుల్ చేసుకోవాలంటే మెసేజ్ ను టైప్ చేసిన తరువాత టాప్ రైట్ కార్నర్ లో కనిపించే ‘i' ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే పలు ఆప్షన్స్ మీక కనిపిస్తాయి. వాటిలో "Secret Conversation" ఆప్షన్ ను మీరు సెలక్ట్ చేసుకున్నట్లయితే మీరు చేసే చాటింగ్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ లభిస్తుంది.

 

 

అందుబాటులో 50 గేమ్స్..

గేమింగ్ ప్రియులు నేరుగా తమ ఫేస్ బుక్ మెసెంజర్ అకౌంట్ ద్వారానే గేమ్స్ ఆడుకునే వీలుంటుంది. తమ యాప్‌లో ప్రస్తుతానికి 50కు పైగా ఆకర్షణీయ గేమ్ లను అందుబాటులో ఉంచినట్లు ఫేస్ బుక్ తెలిపింది. వీటిలో కొత్తకొత్త గేమ్స్‌తో పాటు స్నేక్, ప్యాక్ మ్యాన్ వంటి రెట్రో గేమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Can you have Messenger without Facebook? All the tips and tricks you might not know about the messaging app
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot