యూట్యూబ్ చూస్తూ ఇదేం పాడు పని
దేశంలో చదువుకున్న వాళ్లు ఎంత మూర్ఖంగా ఆలోచించి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారో తెలియచెప్పే సంఘటన ఇది.
దేశంలో చదువుకున్న వాళ్లు ఎంత మూర్ఖంగా ఆలోచించి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారో తెలియచెప్పే సంఘటన ఇది.ఇంట్లోనే ప్రసవాన్ని ఎలా చేసుకోవచ్చన్న వీడియోలను యూట్యూబ్‌లో పదే పదే చూసిన ఓ జంట, ఆ సూచనలను పాటిస్తూ, ప్రసవానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టి భార్య ప్రాణాలను బలిగొంది.పురిటి నొప్పులతో బాధపడుతూ.. ప్రసవ వేదన అనుభవించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందింది. తమిళనాడులోని తిరుపూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

ప్రైవేటు స్కూల్‌లో టీచర్
ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న కృతిక (28), ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఆమె భర్త యూట్యూబ్‌ను బాగా ఫాలో అవుతుండేవారు.

ఇంటిలోనే యూట్యూబ్ వీడియోలను
ఈ దంపతులకు ఇంతకు ముందే మూడు సంవత్సరాల వయసున్న పాప ఉంది. ఈ దంపతులిద్దరూ ఇంటిలోనే యూట్యూబ్ వీడియోలను ఫాలో అవుతూ బిడ్డకు జన్మనివ్వాలని ముందే నిర్ణయించుకున్నట్లు వివరాలను బట్టి తెలుస్తోంది.

డెలివరీ వేళ
డెలివరీ వేళ, ఇంట్లోనే బిడ్డకు జన్మనివ్వాలని భావించిన ఈ జంట, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలో యూట్యూబ్ వీడియోలను చూశారు.ప్రెగెంట్ లేడీకి ఎలా సాయం అందించాలి'? అనే అంశానికి సంబంధించి పలు వీడియోలను చూశారు.

నొప్పులు ప్రారంభమైతే..
తర్వాత నెలలు నిండి నొప్పులు ప్రారంభమైతే, తాము వీడియోలో చూసినట్టుగా చేశారు. అయితే, బిడ్డ పుట్టిన తరువాత కృతికకు తీవ్ర రక్తస్రావం అయింది.

కంగారుపడిన భర్త..
దీంతో కంగారుపడిన భర్త ఏం చేయాలో తెలియక ఆమెను ఆఘ మేఘాల మీద ఆస్పత్రికి తీసుకువెళ్లారు..అయితే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లేసరికి చనిపోయింది.

ఆలస్యం వల్ల విషాదం
పురిటి నొప్పులు 2గంటలకు మొదలైతే ఆమెను 3.30కు ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారని.. అప్పటికే ఆమె బిడ్డకు జన్మనిచ్చి.. మరణించిందని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు
విషయం తెలుసుకున్న పోలీసులు, భర్తను అరెస్ట్ చేసి, కేసును విచారిస్తున్నారు.జూలై 22న జరిగిన ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

భార్యను పోగొట్టుకుని ..
కృతిక స్నేహితురాలు ఒకరు సహజ ప్రసవాలు చేస్తుండేదని, ఆమె సూచనతోనే ఈ పని చేశామని అతను చెప్పినట్టు సమాచారం. చివరకు అతను తన భార్యను పోగొట్టుకుని పోలీసుల చెంతకు చేరాడు.


Click it and Unblock the Notifications








