డీమార్ట్ రూ.2500 షాపింగ్ ఓచర్ ఉచితం,ఈ మెసేజ్ షేర్ చేశారా ?

|

సోష‌ల్ మీడియాలో ఏదైనా ఆస‌క్తిక‌ర‌మైన మెసేజ్ క‌నిపిస్తే చాలు అందరికీ షేర్ చేయ‌డం అల‌వాటే. ఏదైనా ఆఫ‌ర్ ఇస్తామంటూ మెసేజ్‌ల‌ను షేర్ చేయ‌మ‌నే పోస్టులు వస్తే స‌హ‌జంగానే వీటి ప‌ట్ల చాలా మంది ఆక‌ర్షితుల‌వుతుంటారు. కానీ నిజానికి ఇలాంటి ఆఫ‌ర్ లింకులు, పోస్టులు అన్నీ న‌కిలీవే అన్న నిజాన్ని మాత్రం యూజర్లు గ్ర‌హించ‌లేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం ఇలాంటి న‌కిలీ పోస్టులు సోష‌ల్ మీడియాలో ఎక్కువైపోయాయి. తాజాగా డిమార్ట్ పేరిట ఓ న‌కిలీ మెసేజ్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. ప్ర‌ధానంగా వాట్సప్ లో యూజ‌ర్లు దీన్ని ఎక్కువ‌గా షేర్ చేస్తున్నారు. ఆ మెసేజ్ సారాంశం ఏంటో ఓ సారి చూద్దాం.

 

రోజుకు 3జిబి డేటాతో ప్రత్యర్థులకు Airtel షాక్, టాప్ 10 ప్లాన్లు మీకోసంరోజుకు 3జిబి డేటాతో ప్రత్యర్థులకు Airtel షాక్, టాప్ 10 ప్లాన్లు మీకోసం

రూ. 2500 షాపింగ్ ఓచర్

రూ. 2500 షాపింగ్ ఓచర్

ప్రముఖ రీటైల్ సంస్థ డీమార్ట్ తన 17వ వార్షికోత్సవం సందర్భంగా రూ. 2500 షాపింగ్ ఓచర్ ను ఫ్రీగా ఇస్తోందనే ప్రచారం సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా జరుగుతోంది.

neuenwfarben.com అనే బోగస్ సైట్ కి..

neuenwfarben.com అనే బోగస్ సైట్ కి..

దీనికి సంబంధించి లింక్ ఓపెన్ చేస్తే అచ్చం డీమార్ట్ వైబ్ సైట్ లానే కనిపించే neuenwfarben.com అనే బోగస్ సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది. అయితే ఇది జర్మనీకి చెందిన ఓ వోచర్ స్కామ్ కు చెందిన వైబ్ సైట్ అని, తద్వారా ఈ సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లింక్ ను క్లిక్ చేయగానే
 

లింక్ ను క్లిక్ చేయగానే

ఈ లింక్ ను క్లిక్ చేయగానే... ఈ విషయాన్ని మరో 20 మందికి షేర్ చేయండనే మెసేజ్ వస్తుంది. మనం 20 మందికి లింక్ ను షేర్ చేయాలని చెబుతోంది. ఇప్పటికే వాట్సప్ లో ఈ లింక్ ను భారీ సంఖ్యలో షేర్ చేశారు.

యూజ‌ర్ అడ్ర‌స్‌కు వోచ‌ర్

యూజ‌ర్ అడ్ర‌స్‌కు వోచ‌ర్

ఇలా షేర్ చేసిన త‌రువాతే వోచ‌ర్ యూజ‌ర్ అడ్ర‌స్‌కు వ‌స్తుంద‌ని ఆ మెసేజ్‌లో ఉంది. అయితే ఇలా చాలామంది షేర్ చేసిన తరువాత అది స్పందించడం ఆగిపోతుంది.

స‌ద‌రు మెసేజ్ పూర్తిగా న‌కిలీ

స‌ద‌రు మెసేజ్ పూర్తిగా న‌కిలీ

దీనిపై డీమార్ట్ యాజమాన్యం స్పందించింది. తాము ఎలాంటి గిఫ్ట్ ఓచర్లు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. స‌ద‌రు మెసేజ్ పూర్తిగా న‌కిలీద‌ని, తాము ఎలాంటి ఉచిత వోచ‌ర్లు ఇవ్వ‌డం లేద‌ని డిమార్ట్ చెబుతున్న‌ది. ఇలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు

వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు

ఈ లింక్ ను క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఒకవేళ ఇప్పటికే ఈ మెసేజ్ ఓపెన్ చేసినవారు వెంటనే తమ ఈమెయిల్ ఐడీ, బ్యాంకు, ఇతర ముఖమైన వాటి పాస్ వర్డ్ లు మార్చుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

న‌కిలీ మెసేజ్‌ల ప‌ట్ల

న‌కిలీ మెసేజ్‌ల ప‌ట్ల

ఇలాంటి న‌కిలీ మెసేజ్‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, లేదంటే వైర‌స్‌ ఎటాక్‌తో ఫోన్లు హ్యాకింగ్‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. కాబట్టి, ఈ మెసేజ్ ను ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దు. ఎవరికీ ఫార్వర్డ్ చేయవద్దు.

వాట్సప్‌, ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా

వాట్సప్‌, ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా

మరీ ముఖ్యంగా వాట్సప్‌, ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా షేర్‌ చేసేటపుడు మరింతజాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకటి రెండు సార్లు పరిశీలించుకొని, నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే షేర్‌ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
dmartındia.com/voucher is FAKE Website! D-Mart is NOT Giving FREE INR 2500 Shopping Voucher to Celebrate it's 17th Anniversary

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X