కహో నా ప్యార్ హై అంటున్న డ్యాన్సింగ్ అంకుల్,మళ్లీ షేక్

|

సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల దేశవ్యాప్తంగా పాపులర్ అయిన 'డ్యాన్సింగ్ అంకుల్' సంజీవ్ శ్రీవాస్తవ... మరో సరికొత్త వీడియోతో నెటిజన్ల ముందుకు వచ్చాడు. ఈసారి హృతిక్ రోషన్ స్టెప్పులతో సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నాడు. గతంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా పాటకు అచ్చుగుద్దినట్టు అతడు చేసిన డ్యాన్స్‌తో భారతీయులు ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. ఈసారి సూపర్ హిట్ సాంగ్ 'కహో నా ప్యార్ హై' పాటతో హృతిక్ రోషన్‌‌ను అనుకరించే ప్రయత్నం చేశాడు.

 

ఏలియన్స్‌ను నాసా ఎందుకు దాచిపెడుతోంది, ఆ రహస్యమేంటి ?ఏలియన్స్‌ను నాసా ఎందుకు దాచిపెడుతోంది, ఆ రహస్యమేంటి ?

1600కి పైగా లైక్‌లు..

ఈ నెల 3న ఆయన తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 1600కి పైగా లైక్‌లు సంపాదించింది.15 వేలకు పైగా నెటిజన్లు దీన్ని వీక్షించారు. ఆయన ఎనర్జీ లెవెల్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండడం విశేషం.

రాత్రికి రాత్రే ‘‘డ్యాన్సింగ్ అంకుల్

భోపాల్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న శ్రీవాస్తవ... ఓ వివాహ కార్యక్రమంలో డ్యాన్స్ చేసిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఆయన రాత్రికి రాత్రే ‘‘డ్యాన్సింగ్ అంకుల్''గా ఫ్యామస్ అయిపోయారు.

ట్విటర్లో తాజా వీడియో
 

ట్విటర్లో తాజా వీడియో

సదరు వీడియో కోట్లాది మంది మనసు గెలుచుకోవడమే కాకుండా దేశ వ్యాప్తంగా ఆయనకు విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. కాగా ట్విటర్లో తాజా వీడియో పోస్టు చేస్తూ.. ‘‘డ్యాన్సింగ్ దిగ్గజం హృతిక్ రోషన్‌కు ఈ వీడియో అంకితం చేస్తున్నాను..'' అని శ్రీవాస్తవ పేర్కొన్నారు.

సెలబ్రిటీలతో కలిసి డ్యాన్స్ చేస్తూ..

సెలబ్రిటీలతో కలిసి డ్యాన్స్ చేస్తూ..

ఒక్క రాత్రితో ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయిన ఆయన. సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి డ్యాన్స్ చేస్తూ దేశ వ్యాప్త పాపులారిటీ కొట్టేశాడు. నటుడు గోవిందా డ్యాన్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన చేసిన డ్యాన్స్‌కు ఫిదా కానివాళ్ళు లేరనే విషయం తెలిసిందే.

గోవిందా సైతం స్టెప్పులేసి..

గోవిందా సైతం స్టెప్పులేసి..

ఎక్కడో లండన్‌లో ఉన్న గోవిందా కూడా ఈ అంకుల్ డ్యాన్స్‌కు ప్లస్ మార్కులిచ్చేశాడు. తాజాగా ఆయనను అభినందిస్తూ గోవిందా సైతం స్టెప్పులేసి.. అతడ్ని మరింత ఆనందింపజేశాడు. నేను మీ ఫ్యాన్ అయిపోయా అంటూ ఫోటోను పోస్ట్ చేశాడు.

ఇప్పుడు పెద్ద ఆఫర్లు..

సంజయ్ చేసిన రొమాంటిక్ డ్యాన్స్ అంతగా వైరల్ కావడంతోనే ఆయనకు ఇప్పుడు పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. ఏకంగా అంకుల్ డ్యాన్స్ నచ్చిన బిటౌన్ హీరో సునీల్ శెట్టి .. తన సినిమాలో డ్యాన్సింగ్ అంకుల్ కు ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చేశారు.

బజాజ్ అలయన్స్..

బజాజ్ అలయన్స్..

దీంతో పాటు సంజయ్ శ్రీవాత్సవకుకు బజాజ్ అలయన్స్ ఒక ప్రకటనలో నటించే అవకాశాన్ని ఇచ్చింది.వీటికి ఓకే చెబితే గనుక సంజయ్ కు రానున్న రోజుల్లో మరిన్ని ఛాన్స్ లు, బ్రాండింగ్లు వచ్చి ఇతన్ని ఫైనాన్షియల్ గాను నిలబెట్టినా నిలబెట్టవచ్చు.

ఎవరికి ఏ అవకాశం వచ్చి ..

ఎవరికి ఏ అవకాశం వచ్చి ..

ఏది ఏమైనా నేటి ట్రెండింగ్ కాలంలో ఎవరికి ఏ అవకాశం వచ్చి ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోతుందో తెలియకుండా ఉంది.అయితే సంజయ్ కొచ్చిన ఈ అవకాశాన్ని చూసిన చుట్టుపక్కల జనాలు తెగ ఇదైపోతున్నారని సమాచారం.

దిగ్విజయ్ సింగ్ సైతం

దిగ్విజయ్ సింగ్ సైతం డ్యాన్సింగ్ అంకుల్ ని ఆకాశానికి ఎత్తేసిన సంగతి అందరికీ తెలిసిందే..

Best Mobiles in India

English summary
DANCING UNCLE HAS RETURNED WITH SOME NEW MOVES TO THE DELIGHT OF INDIAN INTERNET More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X