Just In
- 10 min ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 2 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
- 18 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 21 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
Don't Miss
- News
ఎక్కువగా మాట్లాడితే డొక్క తీసి డోలు కడతాం - వల్లభేని వంశీ మాస్ వార్నింగ్..!!
- Lifestyle
Green Comet 2023: ఆకాశంలో అద్భుతం, 50 వేల ఏళ్ల తర్వాత కనిపించనున్న తోకచుక్క
- Sports
INDvsAUS : ఎట్టకేలకు దక్కిన వీసా.. టెస్టు సిరీస్ కోసం భారత్‌కు ఖవాజా!
- Finance
Adani: పార్లమెంటుకు అదానీ పంచాయితీ.. విపక్షాల పట్టు.. మోదీ కాపాడతారా..?
- Movies
Guppedantha Manasu: తండ్రి ముందే రిషితో వసుధార రొమాన్స్.. షాక్ అయిన కాలేజీ స్టాఫ్!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
యూట్యూబ్‌కు దిమ్మతిరిగింది , వీడియో తొలగించనందుకు రూ.95 లక్షల జరిమానా !
యూట్యూబ్‌కు ఢిల్లీ హైకోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. అభ్యంతరకంగా వీడియోను తొలగించనందుకు వీడియో స్ట్రీమింగ్ సైట్ యూట్యూబ్‌కు ఢిల్లీ హైకోర్టు రూ. 9.5 లక్షలు జరిమానా విధించింది. కాగా 2015లో ఇందుకు సంబంధించిన కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన వైద్యుడిని టార్గెట్ చేసేలా ఉన్న ఈ వీడియోను తొలగించాలని కోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు జడ్జి జస్టిస్ నాజ్మి వజిరీ తీర్పు చెబుతూ కోర్టు హియరింగ్‌కు రూ.50 వేల చొప్పున గత 64 రోజుల్లో జరిగిన అన్ని హియరింగ్‌లకు చెల్లించాలని ఆదేశించారు. అలాగే, న్యాయవ్యస్థ సమయాన్ని దుర్వినియోగం చేసినందుకు కూడా యూట్యూబ్‌కు జరిమానా విధించారు.

అభ్యంతరకర వీడియోను ..
యూట్యూబ్ మొత్తానికి ఆ అభ్యంతరకర వీడియోను తొలగించినప్పటికీ, సాంకేతిక కారణాలు చూపిస్తూ కోర్టు నిర్ణయానికి అనుగుణంగా కొంత సమయం కోరింది.

కంటెంట్‌ను తొలగించలేమని
కంటెంట్‌ను తొలగించలేమని, అయితే ఆ వీడియోను మరెవరూ చూడకుండా డిసేబుల్ చేశామని కోర్టుకు తెలిపింది.

కోర్టు ఆదేశాలను తాము పాటించలేమని..
ఆ వీడియోను తొలగించాలన్న కోర్టు ఆదేశాలను తాము పాటించలేమని, ఎందుకంటే వీడియోలను సర్వర్ నుంచి పూర్తిగా తొలగించగలిగే సాంకేతిక నియంత్రణ తమ వద్ద లేదని వాదించింది.

రూ. 9.50 లక్షల జరిమానా
అయితే యూట్యూబ్ వాదన సహేతుకంగా లేకపోవడంతో దానిని తిరస్కరించిన కోర్టు తాజాగా రూ. 9.50 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

యూట్యూబ్ బ్రౌజింగ్ హిస్టరీ
మీ యూట్యూబ్ బ్రౌజింగ్ కు సంబంధించిన హిస్టరీ ఎవ్వరి కంట పడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఆ హిస్టరీని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రొసీజర్ ను ఇప్పుడు తెలుసుకుందాం..

యూట్యూబ్ హిస్టరీని Pause చేయాలంటే..?
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని యూట్యూబ్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి టాప్ రైట్ కార్నర్ లో కనిపించే అవతార్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కొత్త మెనూ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో సెట్టింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే అనేక ఆప్షన్స్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి. వాటిలో "History and Privacy" ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని "Pause watch history" ఆప్షన్ ను టర్నాఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆప్షన్ టర్నాఫ్ అయిన వెంటనే మీ యూట్యూబ్ హిస్టరీ పాస్ కాబడుతుంది. యూట్యూబ్ హిస్టరీని పాస్ చేయటం వల్ల మీ సెర్చ్ హిస్టరీ హిస్టరీలో సేవ్ అవ్వదు.

యూట్యూబ్ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలంటే..?
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని యూట్యూబ్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే అవతార్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కొత్త మెనూ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో సెట్టింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే అనేక ఆప్షన్స్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి. వాటిలో "History and Privacy" ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని "Clear watch history" టాప్ చేసినట్లయితే కన్ఫర్మేషన్ స్ర్కీన్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ స్ర్కీన్ పై కనిపించే "Clear watch history" ఆప్షన్ పై ప్రెస్ చేసినట్లయితే మీ యూట్యూబ్ బ్రౌజింగ్ తాలూకా మొత్తం హిస్టరీ క్లియర్ కాబడుతుంది.

యూట్యూబ్‌దే హవా..
మార్కెట్లోకి కొత్తకొత్త వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లు పుట్టుకొస్తున్నప్పటికి యూట్యూబ్ హవాను ఏ మాత్రం తగ్గించలేకపోతున్నాయి. ప్రకటనల రూపంలో గూగుల్‌కు కాసలు వర్షం కురిపిస్తున్న యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో యూజర్లు ఉన్నారు. వీరిని మెప్పించేందుకు వేల సంఖ్యలో వీడియోలు ఇక్కడ జనరేట్ అవుతూనే ఉంటాయి.

కొత్త వెర్షన్ యాప్..
పిల్లల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ కిడ్స్ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. యూట్యూబ్ కిడ్స్‌గా పిలవబడతున్న ఈ యాప్‌ను కేవలం పిల్లలకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేసింది. విద్య, విజ్ఞానం ఇంకా వినోదాలను అందించే వీడియోలను మాత్రమే యూట్యూబ్ ఈ వర్షన్‌లో అందుబాటులో ఉంచింది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌లో ద్వారా వీడియోలను పిల్లలు ఎంత సేపు వీక్షంచాలో కూడా తల్లిదండ్రులు నిర్ధేశించవచ్చు.

వీడియోలను వీక్షిస్తూనే మరోవైపు మిత్రులతో చాటింగ్
ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త ఆప్షన్ ద్వారా యూజర్లు ఓ వైపు వీడియోలను వీక్షిస్తూనే మరోవైపు మిత్రులతో చాటింగ్ చేసుకునే వీలుంటుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా యూట్యూబ్ యాప్ నుంచి నిష్క్రమించాల్సిన అవసరం లేకుండానే చాటింగ్ నిర్వహించుకునే వీలుంటుంది. యూట్యూబ్ చాటింగ్ ఫీచర్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా మీ యూట్యూబ్ అకౌంట్‌ను ఓపెన్ చేసి..
ముందుగా యూట్యూబ్ యాప్‌ను ఓపెన్ చేసి మీ అకౌంట్ ద్వారా అందులోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తరువాత స్ర్కీన్ క్రింది భాగంలో కనిపించే Activity tab బటన్ పై క్లిక్ చేయండి. యాక్టివిటీ ట్యాబ్‌లోకి వెళ్లిన తరువాత రెండు సబ్‌ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో ఒకటి Shared కాగా మరొకటి notifications.

Shared ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత..
ఇందులో Shared ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని అందులోని కాంటాక్ట్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెజెస్టెడ్ కాంటాక్ట్స్‌తో కూడిన జాబితా ఒకటి కనిపిస్తుంది. ఈ జాబితాలోకి మరికొన్ని కాంటాక్ట్స్‌ను చేర్చేందుకు రెండు ఆప్షన్స్ మీకు అందుబాటులో ఉంటాయి. అందులో మొదటి ఆప్షన్‌లో భాగంగా ఇన్విటేషన్ లింక్ పద్ధతిలో కొత్త కాంటాక్ట్‌లను యాడ్ చేసుకునే వీలుంటుంది, రెండవ పద్ధతిలో భాగంగా ఫోన్‌బుక్ ద్వారా కొత్త కాంటాక్ట్స్‌ను యూట్యూబ్ చాట్‌లోకి చేర్చుకునే వీలుంటుంది.

chat ఆప్షన్ పై క్లిక్ చేసి...
ఈ ప్రొసీజర్ పూర్తయిన తరువాత chat ఆప్షన్ పై క్లిక్ చేసి, మీరు చాట్ చేయాలనుకుంటోన్న వ్యక్తి తాలూకా పర్సనల్ చాట్ విండోను సెలక్ట్ చేసుకుని చాటింగ్‌ను ప్రారంభించండి. స్ర్కీన్ పై టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే త్రీ డాట్స్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే యాడింగ్ పార్టిసిపెంట్, లీవ్ ద చాట్, మ్యూట్ నోటిఫికేషన్స్ వంటి ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి.

కొత్త గ్రూప్‌ను క్రియేట్ చేసుకునే క్రమంలో..
ఒకవేళ మీరు గ్రూప్ చాటింగ్ చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా ఆ గ్రూప్‌ను క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది. కొత్త గ్రూప్‌ను క్రియేట్ చేసుకునే క్రమంలో Shared ఆప్షన్‌లోని న్యూ గ్రూప్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని, గ్రూప్ పేరు ఆ తరువాత పార్టిసిపెంట్స్‌ను యాడ్ చేయవల్సి ఉంటుంది. యూట్యూబ్ చాట్ ద్వారా మీరు పంపే మెసేజెస్ అవతలి వ్యక్తికి చేరుకోవాలంటే వాళ్ల యూట్యూబ్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ తప్పనిసరిగా ‘ON'లో ఉండాలి.

యూట్యూబ్ వెబ్‌వర్షన్‌లోనూ ఇదే ప్రొసీజర్..
ఈ చాటింగ్ ఫీచర్‌ను యూట్యూబ్ వెబ్‌వర్షన్‌లోనూ గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. యూట్యూబ్ వెబ్ యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ముందుగా తమ డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి, ఆ తరువాత తమ అకౌంట్ ద్వారా అందులోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

యాడ్ మోర్ కాంటాక్ట్స్’ ఆప్షన్ పై క్లిక్ చేసి...
అకౌంట్‌లోకి లాగిన్ అయిన తరువాత హోమ్ పేజీ పై కనిపించే "Share" బటన్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఈ ఐకాన్ పై క్లిక్ చేసిన వెంటనే యూట్యూబ్ కాంటాక్ట్స్‌కు సంబంధించిన జాబితా ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొత్త కాంటాక్ట్‌ను యాడ్ చేయాలనుకుంటున్నట్లయితే ‘యాడ్ మోర్ కాంటాక్ట్స్' ఆప్షన్ పై క్లిక్ చేసి కొత్త కాంటాక్ట్ ను యాడ్ చేసుకోవచ్చు.

యూట్యూబ్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ తప్పనిసరిగా ‘ON’లో ఉండాలి...
ఈ జాబితాలోకి మరికొన్ని కాంటాక్ట్స్‌ను చేర్చేందుకు రెండు ఆప్షన్స్ మీకు అందుబాటులో ఉంటాయి. అందులో మొదటి ఆప్షన్‌లో భాగంగా ఇన్విటేషన్ లింక్ పద్ధతిలో కొత్త కాంటాక్ట్‌లను యాడ్ చేసుకునే వీలుంటుంది, రెండవ పద్ధతిలో భాగంగా ఫోన్‌బుక్ ద్వారా కొత్త కాంటాక్ట్స్‌ను యూట్యూబ్ చాట్‌లోకి చేర్చుకునే వీలుంటుంది. మీరు పంపే మెసేజెస్ అవతలి వ్యక్తికి చేరుకోవాలంటే వాళ్ల యూట్యూబ్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ తప్పనిసరిగా ‘ON'లో ఉండాలి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470