ఆల్ ఇండియా రికార్డు సెట్ చేసిన దువ్వాడ జగన్నాధమ్

By Hazarath
|

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ 2017లో నటించిన చిత్రం Duvvada Jagannadham తెలుగు సినిమా ఇండస్ట్రీలో దుమ్మురేపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా రికార్డులతో దూసుకుపోతోంది.ఈ సినిమా హిందీ dubbed version యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌ని కొల్లగొట్టి ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. అయితే అల్లు అర్జున్ కి ఇది కొత్తేం కాదు. 2016లో వచ్చిన సరైనోడు హిందీ వర్షన్ కూడా యూట్యూబ్ లో ఈ రకమైన హిస్టరీని క్రియేట్ చేసింది. ఈ సినిమా ఏకంగా 100 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోయింది. కేవలం 16 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ ని సరైనోడు చిత్రం కొల్లగొట్టిందంటే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఏ రేంజులో దూసుకుపోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

 

జియో నుంచి 4 add-on packs, తక్కువ ధర, నో వ్యాలిడిటీజియో నుంచి 4 add-on packs, తక్కువ ధర, నో వ్యాలిడిటీ

ఆల్ ఇండియా రికార్డు సెట్ చేసిన దువ్వాడ జగన్నాధమ్

కేవలం రెండు నెలల వ్యవధిలోనే హీరో అల్లు అర్జున్ రెండు సినిమాలు సరైనోడు, దువ్వాడ జగన్నాధమ్ యూట్యూబ్‌లో 100 మిలియన్స్ వ్యూస్‌ని రాబట్టాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వచ్చిన దువ్వాడ జగన్నాధమ్ లో హీరో అల్లు అర్జున్ డ్యూయెల్ రోలో పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. సాధారణ బాహ్మణుడుగా ఒక క్యారక్టర్ అలాగే స్టైలిష్ అవతారంలో మరో క్యారక్టర్ ని పోషించారు. కాగా ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించింది.

ఆల్ ఇండియా రికార్డు సెట్ చేసిన దువ్వాడ జగన్నాధమ్

బ్రాహ్మణుడిగా బన్నీ చెప్పిన ఫన్నీ డైలాగ్ లతో పాటు 'పబ్బుల్లో వాయించే డీజే కాదు.. పగిలిపోయేలా వాయించే డీజే..' 'మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్ఛామీ కాదు సార్.. యుద్ధం శరణం గచ్ఛామీ' లాంటి డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. పాటల్లో కూడా అల్లు అర్జున్ దుమ్మురేపారు.

Best Mobiles in India

English summary
Duvvada Jagannadham: Hindi dubbed version of Allu Arjun's super hit film creates all India record

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X