క్రియేటర్లకు గుడ్‌న్యూస్.. ఇన్‌స్టాగ్రామ్ 'ఎడిట్స్' వచ్చేస్తోంది.. అదిరిపోయే వీడియో ఎడిటింగ్ ఫీచర్లు..!
షార్ట్ వీడియోల ట్రెండ్ ఇప్పుడు ఓ ఊపు ఊపుతోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లలో ఈ హవా బాగా నడుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ లాంటి ఫ్లాట్‌ఫామ్స్ రీల్స్ వీడియోలతో సూపర్ పాపులర్ అవుతున్నాయి. ఇన్‌స్టా మాతృ సంస్థ మెటా ఈ పాపులారిటీతో సరిపెట్టుకోవడం లేదు. అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకోవాలని చూస్తోంది.
ఈసారి మెటా ఒక అడుగు ముందుకేసి, బైట్‌డాన్స్ కంపెనీకి చెందిన క్యాప్‌కట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు 'ఎడిట్స్' అనే కొత్త వీడియో ఎడిటింగ్ యాప్‌ను పరిచయం చేసింది.

* అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయ్..
ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి ప్రకారం, 'ఎడిట్స్' కేవలం మరో వీడియో ఎడిటింగ్ యాప్ మాత్రమే కాదు. ఇది క్రియేటర్ల కోసం ఒక పూర్తి క్రియేటివ్ సూట్ లాంటిది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయ్ అని ఆయన తెగ పొగిడేశారు.
అవేంటంటే, క్రియేటర్లు తమ ఐడియాలు సేవ్ చేసుకునేందుకు ఒక ప్రత్యేక ట్యాబ్. మంచి క్వాలిటీతో వీడియోలు రికార్డ్ చేసేందుకు హై-క్వాలిటీ కెమెరా. వీడియోలను మరింత అందంగా మార్చేందుకు అడ్వాన్స్‌డ్ ఎడిటింగ్ టూల్స్.
ఇంకా క్రియేటర్లు, ఫ్రెండ్స్‌తో డ్రాఫ్ట్‌లను షేర్ చేసుకునే అవకాశం. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు షేర్ చేశాక వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకునే ఇన్సైట్స్ సైతం ఈ అప్లికేషన్‌లో ఉంటాయి.
* నో వాటర్‌మార్క్స్..
ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్‌గా వీడియోలు ఎడిట్ చేస్తే వాటర్‌మార్క్‌లు పడతాయి. కానీ, 'ఎడిట్స్' యాప్‌లో మాత్రం వాటర్‌మార్క్స్ లేకుండా వీడియోలను ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ షార్ట్స్ లాంటి వేర్వేరు ఫ్లాట్‌ఫామ్స్‌లో వీడియోలు పెట్టే క్రియేటర్లకు ఇది నిజంగా ఒక బంపరాఫర్ అనే చెప్పాలి.
ప్రస్తుతానికి, 'ఎడిట్స్' యాప్ ఐఫోన్ల కోసం యాపిల్ యాప్ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా వచ్చేస్తుంది. ఈ యాప్ వాడటానికి పూర్తిగా ఉచితం. స్మార్ట్‌ఫోన్లలో వర్టికల్ వీడియోలను ఎడిట్ చేసుకునేందుకు ఇది బాగా అనువుగా ఉంటుంది.
* ఎడిట్స్ యాప్‌లోని ముఖ్య ఫీచర్లు
- సూపర్ క్వాలిటీ ఔట్‌పుట్స్
ఈ యాప్‌లో 2K రిజల్యూషన్, 60fpsతో HDR, SDR ఫార్మాట్లలో వీడియోలు చేసుకోవచ్చు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు.
- లేయర్డ్ ఎడిటింగ్
ప్రొఫెషనల్ వీడియోలు చేసేందుకు ఆడియో, ఫిల్టర్స్‌ను ఒకదానిపై ఒకటి లేయర్లుగా యాడ్ చేసుకోవచ్చు.
- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్
చేసిన ప్రాజెక్టులన్నీ ఒకే పేజీలో కనిపిస్తాయి. దీంతో వాటిని మేనేజ్ చేసుకోవడం చాలా ఈజీ.
పర్ఫార్మెన్స్ ఇన్సైట్స్
ఇన్‌స్టాగ్రామ్‌లో మీ వీడియో ఎలా ప్లే అవుతుందో, ఎంతమంది చూస్తున్నారనే విషయాలను తెలుసుకునేందుకు టూల్స్ కూడా ఉన్నాయి.
ఇదిలా ఉండగా అమెరికా ప్రభుత్వం టిక్‌టాక్‌తో పాటు బైట్‌డాన్స్ యాజమాన్యంలోని క్యాప్‌కట్ లాంటి యాప్స్‌పై నిషేధం విధించింది. టిక్‌టాక్ తాత్కాలికంగా ఈ బ్యాన్ నుంచి తప్పించుకున్నా, క్యాప్‌కట్ మాత్రం యాప్ స్టోర్ల నుంచి కనుమరుగవుతోంది.
దీంతో క్యాప్‌కట్ వాడేవాళ్లంతా ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో మెటా 'ఎడిట్స్' యాప్‌ను అనౌన్స్ చేయడం చూస్తుంటే పక్కా ప్లానింగ్‌తోనే రంగంలోకి దిగినట్టుందని అర్థమవుతోంది.
మోసెరి చెప్పిన దాని ప్రకారం, 'ఎడిట్స్' ఫిబ్రవరి/మార్చి నెలలో మొదట iOS యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా వస్తుంది. ఇప్పుడైతే యాప్ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.
'ఎడిట్స్' యాప్‌ను విడుదల చేయడం ద్వారా క్రియేటర్లకు వాటర్‌మార్క్స్ లేకుండా, అదిరిపోయే క్వాలిటీతో వీడియోలు చేసుకునే ఒక పవర్‌ఫుల్ సొల్యూషన్‌ను ఇవ్వాలని మెటా భావిస్తోంది. దీంతో క్రియేటర్లు ఈజీగా వీడియోలు చేసి అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








