ఫేస్‌బుక్‌ వాడాలన్నా ఆధార్ తప్పనిసరి!

By Madhavi Lagishetty
|

ఫేస్ బుక్ ఈ సోషల్ యుగంలో ప్రతీ ఒక్కరికి అదే ఆహారం. అక్సీజన్ లేకుండా ఉండగలరేమో కానీ ఫేస్ బుక్ లేనిది ఉండలేమంటున్నారు నెటిజన్లు. జనాల్లో ఫేస్‌బుక్‌ అంతలా పాతుకుపోయింది. ఫేస్‌బుక్‌లోఎవరైనా సరే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. పేజీ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇ-మెయిల్, ఫోన్ నెంబర్, పేరు ఉంటేచాలు.

 
ఫేస్‌బుక్‌ వాడాలన్నా ఆధార్ తప్పనిసరి!

నెంబర్ లో పది అంకెలు ఉంటే చాలు ఈ మెయిల్ పనిచేస్తుందా లేదా దానితో ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటివరకు ఇలా ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇలా ఉంటే సరిపోయింది. కానీ ఇక నుంచి అలా చేయడం అస్సలు కుదరదు. ఎందుకంటే...ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకునేందుకు ఆధార్ పేరు తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది. ఇలాంటి రూల్స్ త్వరలోనే ఫేస్ బుక్ అమల్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఈ విధానం టెస్టింగ్ లో ఉంది.

Mysmartprice రిపోర్టు ప్రకారం..ఆధార్ కార్డులో యూజర్ పేరును బట్టి కొత్త అకౌంట్ ను క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫేక్ అకౌంట్స్ కంట్రోల్ చేయడం కోసం ఫేస్ బుక్ ఆధార్ ఇంటిగ్రేషన్ను టెస్ట్ చేస్తుందని తెలిపింది. ఫేక్ ప్రొఫైల్స్ అనేవి పెద్ద సమస్యగా మారాయి. త్వరలోనే ఆన్ లైన్ వేధింపులకు ఫేస్ బుక్ చెక్ పెట్టనుంది.

ఫేస్‌బుక్‌ వాడాలన్నా ఆధార్ తప్పనిసరి!

Ios డివైస్సుల్లో సఫారి వెబ్ బ్రౌజర్ నుంచి కొత్త అకౌంట్ను క్రియేట్ చేసే ప్రయత్రంలోనే ఆధార్ ప్రాంప్ట్ ఎదురైందని రిపోర్టు పేర్కొంది. అయితే ఈ ప్రాంప్ట్ అనేది యూజర్లకు కనిపించదు.

6జిబి ర్యామ్, 6080mAh బ్యాటరీ, ఫోన్ కేక బాసూ !6జిబి ర్యామ్, 6080mAh బ్యాటరీ, ఫోన్ కేక బాసూ !

ఫేస్ బుక్ లో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆధార్ ప్రాంప్ట్ కనిపించదని రిపోర్టులో వెల్లడించింది. విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ తోపాటు వెబ్ వంటి పలు ప్లాట్ ఫాంలో అకౌంట్ను క్రియేట్ చేయడానికి ప్రయత్నించినా...తమకు కనిపించలేదని తెలిపింది.

సోషల్ మీడియా దిగ్గజం యూజర్లు వారి అకౌంట్ను వారి ఆధార్ కార్డుకు కలుపుకోవడమే కాదు...ఒక కొత్త ఫేస్ బుక్ అకౌంట్ను క్రియేట్ చేసేటప్పుడు ప్రాంప్ట్ కనిపిస్తుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా అకౌంట్ ను నుంచి ఎగ్జిట్ కు దారితీస్తుంది.

2011లో జరిగిన ఆధార్ డెవలపర్ ట్రాక్ కాన్షరెన్స్ లో ఆధార్ డెవలపర్ నందన్ నీలేకని మరియు UIDAI ఛైర్మన్ సోషల్ మీడియా నెట్ వర్క్ లో ఆధార్ నెంబర్ గుర్తింపును తప్పనిసరిగా ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. UID అనేది ట్విట్టర్ మరియు ఫేస్ బుక్లో ఒక అకౌంట్ ను ద్రువీకరించడానికి చాలా ఈజీ మార్గం. ఏ యూజర్ అయినా వారి UID ఆధారాలతో ద్రువీకరించబడిన అకౌంట్ను పొందవచ్చు.

ప్రస్తుతం ఈ ప్రొసెస్ టెస్టింగ్ లో ఉంది. త్వరలోనే అమల్లోకి రానుంది. అయితే ఎన్ని రోజుల్లో అమలులోకి రానుందన్న విషయాన్ని ఫేస్ బుక్ ప్రకటించలేదు.

Best Mobiles in India

Read more about:
English summary
It looks like the Aadhaar verification has made its way to the social media as a recent report tips that Facebook could be testing Aadhaar integration by prompting new users to type the name as in the Aadhaar card. This might curb the menace of fake profiles and put an end to the growing online harassment.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X