ఫేస్‌బుక్ మీ ఫోన్ నంబర్‌ని ఎలా వాడుకుంటుందో తెలుసా ?

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ ఆ మధ్య అనేక ఆరోపణలతో సతమతమైన సంగతి తెలిసిందే.

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ ఆ మధ్య అనేక ఆరోపణలతో సతమతమైన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మళ్లీ దానిపై ఆరోపణలు వస్తున్నాయి. యూజర్ల వ్యక్తిగత డేటాను ఫేస్‌బుక్ వ్యక్తిగత ఆదాయం కోస వాడుకుంటోందని రిపోర్టులు వెలువడుతున్నాయి. దీనికి ఊతమిస్తూ ఫేస్‌బుక్‌లో యూజర్లు ఇచ్చే సమాచారాన్ని యాడ్స్ సహా అన్ని విధాలుగా వాడుకుంటామని సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీని ద్వారా కంపెనీ మరింతగా ఆదాయాన్ి అందిపుచ్చుకుంటుందని తెలుస్తోంది.

గూగుల్ పే ద్వారా రూ.1000 గిఫ్ట్ కార్డు, ఉబెర్ కొత్త ప్రయోగంగూగుల్ పే ద్వారా రూ.1000 గిఫ్ట్ కార్డు, ఉబెర్ కొత్త ప్రయోగం

మొబైల్ నంబర్..

మొబైల్ నంబర్..

ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నపుడు సంస్థ అడిగిన మొత్తం సమాచారం మనం ఇస్తూ వెళ్తాం. అలాగే మన మొబైల్ నంబర్ కూడా. ఇవన్నీ ఫేస్‌బుక్‌కు బాగానే పనికొస్తున్నాయి.

యూజర్లు ఇచ్చే ఫోన్ నంబర్లను..

యూజర్లు ఇచ్చే ఫోన్ నంబర్లను..

యూజర్లు ఇచ్చే ఫోన్ నంబర్లను ఫేస్‌బుక్ ప్రత్యేకంగా టూ ఫ్యాక్టర్ ఆథెంటిఫికేషన్ (2ఎఫ్‌ఎ) కోసం ఉపయోగిస్తుంది. అంటే ఫేస్‌బుక్ అకౌంట్లను మరింత భద్రంగా ఉంచేందుకు ఇది పనికొస్తుంది.

యాడ్స్ కోసం ..

యాడ్స్ కోసం ..

అయితే ఇలా యూజర్లంతా ఇచ్చిన ఫోన్ నంబర్లను యాడ్స్ కోసం ఫేస్‌బుక్ వాడుకుంటున్నది.

యూజర్లు అప్‌లోడ్ చేసే ఫోన్ నంబర్లు..

యూజర్లు అప్‌లోడ్ చేసే ఫోన్ నంబర్లు..

మేం యూజర్ల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని ఎలా వాడుతున్నామన్న దానిపై మాకు స్పష్టత ఉంది. యూజర్లు అప్‌లోడ్ చేసే ఫోన్ నంబర్లు, ఇతర సమాచారం మొత్తాన్నీ వాడుకుంటాం.

 

డిలీట్ ..

డిలీట్ ..

కావాలంటే ఆ సమాచారాన్ని యూజర్లు డిలీట్ చేసుకోవచ్చు అని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి స్పష్టంచేశారు.

రెండు అమెరికా యూనివర్సిటీలు చేసిన పరిశోధన

రెండు అమెరికా యూనివర్సిటీలు చేసిన పరిశోధన

యాడ్స్ పంపించడానికి యూజర్ల ఫోన్ నంబర్లను వాడుతున్నామని ఫేస్‌బుక్ కూడా అంగీకరించడానికి కారణం గిజ్‌మోడో అనే సంస్థ చేసిన పరిశోధన. రెండు అమెరికా యూనివర్సిటీలు చేసిన పరిశోధన తాలూకు సమాచారాన్ని గిజ్‌మోడో వెల్లడించింది.

సెక్యూరిటీ కారణాల కోసం..

సెక్యూరిటీ కారణాల కోసం..

అంతేకాదు సెక్యూరిటీ కారణాల కోసం యూజర్లు ఇచ్చిన మొబైల్ నంబర్లను, వాళ్లు ఒకవేళ ఇవ్వకపోయినా ఇతరుల కాంటాక్ట్ బుక్‌ల నుంచి సేకరించి వాటిని యాడ్స్ కోసం వాడుకుంటున్నదని గిజ్‌మోడో తెలిపింది.

స్పందించిన ఫేస్‌బుక్..

స్పందించిన ఫేస్‌బుక్..

ఈ రిపోర్ట్‌పై స్పందించిన ఫేస్‌బుక్.. అది నిజమేనని చెప్పింది. ఈ అడ్వర్‌టైజింగ్ ద్వారా కూడా ఫేస్‌బుక్‌కు భారీగానే ఆదాయం వస్తున్నది.

Best Mobiles in India

English summary
Facebook Admits Using Users' Phone Number To Provide Targeted Ads more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X