సేవా కార్యక్రమాల కోసం ఫేస్‌బుక్ కొత్త టూల్స్

Posted By: BOMMU SIVANJANEYULU

తన సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ ద్వారా నిత్యం కోట్లాది మంది జీవితాలను టచ్ చేస్తోన్న ఫేస్‌బుక్ ఇటు దాతృత్వ కార్యక్రమాల పైనా పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన సేవా కమ్యూనిటీని బిల్డ్ చేసుకున్న ఫేస్‌బుక్ దాతృత్వ అవసరాల కోసం సరికొత్త టూల్స్‌తో పాటు ఇనీషియేటివ్‌లను అనౌన్స్ చేసింది.

సేవా కార్యక్రమాల కోసం ఫేస్‌బుక్ కొత్త టూల్స్

మెంటర్‌షిప్ అండ్ సపోర్ట్ పేరుతో ఫేస్‌బుక్ తన నూతన ప్రాజెక్టును లాంచ్ చేసింది అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ డెవలప్ చేసే గైడెడ్ ప్రోగ్రామ్స్ ద్వారా మెంటీస్ అలానే మెంటర్స్ ఒకరితో మరొకరు డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అయ్యే వీలుంటుంది.

తొలత ఐమెంటర్ (ప్రత్యేకించి విద్య కోసం), ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ (క్రైసిస్ రికవరీ కోసం) కార్యక్రమాలతో ఈ పైలెట్ ప్రాజెక్ట్‌ను ఫేస్‌బుక్ ప్రారంభించింది. 18 సంవత్సరాల పైబడిన వారికి ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

ఫేస్‌బుక్ తన నాన్‌ప్రాఫిట్ ఫండ్ రైసింగ్ టూల్స్‌ను యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాంట్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, పాలాండ్, నెదర్లాండ్స్, బెల్జియం, స్విడెన్, పోర్చుగల్, డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, ఫిన్‌ల్యాండ్, లక్సెంబర్గ్ వంటి దేశాలకు విస్తరించబోతోంది.

ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ 'రీమిక్స్'

పర్సనల్ ఫండ్ రైజర్స్ ఈ దేశాల్లో అందుబాటులో ఉంటారు. వ్యక్తిగత ఫండ్ రైజర్స్ తమ ఆఫ్-ఫేస్‌బుక్ ఫండ్ రైజింగ్ కార్యకలాపాలను ఫేస్‌బుక్ ఫండ్ రైజర్స్‌తో సింక్ చేసుకునే వీలుంటుంది.

కమ్యూనిటీ హెల్ప్ ఏపీఐ పేరుతో మరో ఫీచర్‌ను ఫేస్‌బుక్ పరిచయం చేయబోతోంది. ఈ ఫీచర్ ద్వారా డిజాస్టర్ రెస్పాన్స్ ఆర్గనైజేషన్స్ విపత్తు సమయంలో పబ్లిక్ కమ్యూనిటీ నుంచి డేటాను యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. ఫేస్‌బుక్ తన ఇతర చారిటీ ప్రాజెక్టులో భాగంగా వచ్చే ఏడాది ఆరంభంలో బాంగ్లాదేశ్ యూజర్ల కోసం బ్లడ్ డొనేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

English summary
Facebook is expanding its Nonprofit fundraising tools (including donate buttons and nonprofit fundraisers) to 16 new countries.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot