వివాదాస్పదంగా మారిన ఫేస్‌బుక్ “Aadhaar prompt”

Posted By: BOMMU SIVANJANEYULU

కొత్త అకౌంట్లను ఓపెన్ చేస్తోన్న సమయంలో అడుగుతోన్న “Aadhaar prompt”కు సంబంధించి. ఫేస్‌బుక్ వివరణ ఇచ్చుకుంది.

వివాదాస్పదంగా మారిన ఫేస్‌బుక్ “Aadhaar prompt”

కొత్త యూజర్లు తమ ఒరిజినల్ నేమ్‌తో సైన‌ప్ అయ్యేందుకే ఈ ప్రాంప్ట్‌ను పరీక్షించినట్లు తెలిపింది. ఇదిఒక చిన్న పరీక్ష మాత్రమేనని, పరీక్షను విజయవంతంగా పూర్తి చేసామని ఫేస్‌బుక్ తెలిపింది.

మేము భారత్‌లో నిర్వహించిన ప్రయోగానికి సంబంధించి మిశ్రమ స్పందన లభించింది. కొంద మంది దీనిని పాజిటివ్‌గా తీసుకుంటే మరికొంత మంది నెగిటివ్‌గా తీసుకున్నారు. అయితే ఈ ఆధార్ ప్రాంప్ట్ ద్వారా కొత్త యూజర్లకు ఎటువంటి ఆధార్ సమాచారాన్ని మేము తీసుకోలేదని, ఇది కేవలం యూజర్ సౌకర్యం కోసం మాత్రమేనని, కొత్త యూజర్లు తమ ఒరిజినల్ నేమ్‌తో సైనప్ అయ్యేందుకే ఈ ప్రాంప్ట్ దోహదపడుతుందని ఫేస్‌బుక్ ప్రొడక్ట్ మేనేజర్ Taichi Hoshino తన బ్లాగ్ స్పాట్‌లో పేర్కొన్నారు.

ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకవచ్చిన ఈ వివాదాస్పద ఫీచర్‌ను తొలత ఓ రెడ్డిట్ యూజర్ గుర్తించి దాన్ని స్ర్కీన్ షాట్ రూపంలో సైట్‌లో పోస్ట్ చేసారు. ఆధార్ కార్డులో ఉన్న విధంగా మీ పేరును ఎంటర్ చేసినట్లయితే ఫేస్‌బుక్‌లో మిమ్మల్ని గుర్తించేందుకు మరింత సులభతరంగా ఉంటందంటూ ఈ ప్రాంప్ట్‌లో పేర్కొనబడి ఉంది.

వివో V7 స్మార్ట్‌ఫోన్‌‌ పై భారీ డిస్కౌంట్ !

English summary
Social media giant Facebook has now clarified that it is not collecting Aadhaar data and that some people have misinterpreted the information.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot