కర్ణాటక ఎన్నికల్లో ఫేస్‌బుక్ పైలట్ ప్రాజెక్టు, అసలు నిఘా వాటిపైనే !

Written By:

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ గత కొన్ని రోజుల నుంచి ప్రైవసీ మీద అనేక ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. కేంబ్రిడ్జ్ అనాలటికా డేటా చోరీ అంశంపై ఫేస్‌బుక్ అనేక విమర్శలను మూటగట్టుకుంది. చివరకు ఫేస్‌బుక్ అధినేత సారీ చెబుతూ ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా కూడా సమస్య సద్దుమణగలేదు. ఈ విమర్శలు ఇండియాను కూడా తాకాయి. ఇండియాలో వచ్చే ఏడాది ఎన్నికలు అలాగే ఈ ఏడాది రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో యూజర్ల డేటా భద్రతపై ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ ప్రభుత్వం జుకర్ బర్గ్ కు ప్రశ్నల వర్షం సంధించింది. ఈనేపథ్యంలో జుకర్ బర్గ్ చెప్పిన కొత్త ప్రాజెక్టును చేపడుతున్నామని అది ముందుగా కర్ణాటక ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నామని చెప్పారు.

ఫేస్‌బుక్ మీ ఫోన్ డేటాను సేకరిస్తోందా..? అయితే ఇలా చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కర్ణాటక ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్టు..

తప్పుడు వార్తల కట్టడికి మీరెలాంటి చర్యలు తీసుకుంటారు?' అంటూ ఫేస్‌ బుక్‌ సంస్థను భారత ప్రభుత్వం అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఫేక్ న్యూస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని నిరూపించేందుకు ఫేస్ బుక్ కర్ణాటక ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది.

బూమ్‌ అనే సంస్థతో ఒప్పందం..

ఫేస్‌‌బుక్‌ మాధ్యమంగా సర్క్యులేట్‌ అయ్యే వార్తలను విశ్లేషించేందుకు ‘బూమ్‌' అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ అంతర్జాతీయ డిజిటల్‌ వార్తలను విశ్లేషించి, సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. స్వతంత్ర డిజిటల్ జర్నలిజం చొరవకు సౌత్ ఇండియాలో తొలిసారిగా ఫేస్‌బుక్ ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టింది.

యూజర్లు పోస్ట్‌ చేసే వార్తలను ..

ఈ సంస్థ కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో యూజర్లు పోస్ట్‌ చేసే వార్తలను ఈ సంస్థ విశ్లేషించి రేటింగ్ ఇస్తుంది. ఈ రేటింగ్ ను ఆ వార్తతో ఫేస్ బుక్ ప్రసారమయ్యేలా చేస్తుంది. దీంతో తక్కువ రేటింగ్ వార్తలను వినియోగదారులు వాస్తవమో, కాదో గ్రహించే వెసులుబాటు ఉంటుందని తెలిపింది.

నెమ్మదిగా ఇతర భాషలకు..

ప్రస్తుతానికి బూమ్ సంస్థ ఆంగ్ల వార్తలను మాత్రమే విశ్లేషిస్తుందని, తరువాత నెమ్మదిగా ఇతర భాషలకు ఈ సేవలు విస్తరిస్తామని ఫేస్ బుక్ తెలిపింది. కాగా మే 12న కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 15న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.

217 మిలియన్ మంది యూజర్లు యాక్టివ్

కాగా ఇండియాలో నెలకి ఫేస్‌బుక్ లో 217 మిలియన్ మంది యూజర్లు గా ఉన్నారని తెలిపింది. మేము చిన్న ప్రయోగం చేస్తున్నామని ఈ టెస్ట్ అత్యంత ముఖ్యమైనదని, నేర్చుకోవాల్సిది చాలా ఉందని, మేము ఈ ఫేక్ న్యూస్ సాధ్యమైనంత మేరకు కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తామని ఫేస్‌బుక్ తెలిపింది.

ఫేక్ అని తెలిసిన వెంటనే..

ఏదైనా న్యూస్ ఫేక్ అని తెలిసిన వెంటనే దాని రేటింగ్ ని అలాగే ఆ న్యూస్ పంపిణీని ను దాదాపు 80 శాతం వరకు తగ్గించి వేస్తామని, యూజర్లకు చేరకుండా నిరోధిస్తామని ఫేస్‌బుక్ తెలిపింది. దీని ద్వారా పేక్ న్యూస్ ఏదో అసలైన న్యూస్ ఏదో యూజర్లు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.

వారి అకౌంట్లపై కఠిన చర్యలు..

దీంతో పాటు ఫేక్ న్యూస్ పంపిణీ చేసే వారి అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ న్యూస్ కి రిలేటెడ్ గా ఉన్న అని వార్తలను యూజర్లకు చూపిస్తామని తెలిపింది. ఇలాంటి వార్తలకు మానిటైజ్ తీసివేసి యాడ్స్ ను ఆపేస్తామని కూడా ఫేస్‌బుక్ తెలిపింది.

Brazil, India, Mexico and the US midtermsలో ఎన్నికలు..

త్వరలో Brazil, India, Mexico and the US midtermsలో ఎన్నికలు జరగనుండటంతో Facebook ప్రధానంగా భద్రతపై అలాగే నకిలీ వార్తలపై అసలైన దృష్టి పెట్టింది. అయితే లాంగ్వేజిలో ఇటువంటి ప్రయత్నాలు ఇప్పుడు కుదరే అవకాశాలు లేకపోవడంతో కాస్త నిరాశను కలిగిస్తోందని యూజర్లు చెబుతున్నారు. ఈ సమస్యను కూడా Facebook త్వరలో అధిగమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook begins fact-checking news in poll-bound Karnataka More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot