చైనా కంపెనీలతో కుమ్మక్కయిన ఫేస్‌బుక్,మళ్లీ డేటా షేరింగ్ రచ్చ !

News, Technology, mobiles, Facebook, data-sharing agreements, Social media, న్యూస్, టెక్నాలజీ, సోషల్ మీడియా, ఫేస్‌బుక్

|

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌‌ను కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. కొద్ది నెలల కిందట డేటా షేరింగ్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కున్న మరకలు ముగిసిపోకముందే మళ్లీ మరో స్కాండల్ విషయంలో ఇరుక్కుంది. ఫేస్‌బుక్‌ తన యూజర్ల డేటాను చెప్పా పెట్టకుండా స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్‌ తయారీదారులకు ఇచ్చినట్టు ఇటీవల న్యూయార్క్‌ టైమ్స్‌ బహిర్గతం చేసింది. వాటిలో ఆపిల్‌, శాంసంగ్‌, అమెజాన్‌ వంటి 60 కంపెనీలున్నట్టు తెలిపింది. గత దశాబ్ద కాలంగా యూజర్ల డేటాను ఆ కంపెనీలకు ఫేస్‌బుక్‌ యాక్సస్‌ చేస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఇప్పుడు మరో సంచలన న్యూస్ బయటకొచ్చింది.

రూ.99కే 45జిబి డేటా, 4 రకాల ప్లాన్లతో BSNL దూకుడురూ.99కే 45జిబి డేటా, 4 రకాల ప్లాన్లతో BSNL దూకుడు

చైనీస్‌ డివైజ్‌ మేకర్లతో..

చైనీస్‌ డివైజ్‌ మేకర్లతో..

చైనీస్‌ డివైజ్‌ మేకర్లతో కూడా ఫేస్‌బుక్ డేటా షేరింగ్‌ ఒప్పందాన్ని కలిగి ఉన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీనే అంగీకరించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కంపెనీలు ఇవే..

కంపెనీలు ఇవే..

హువాయి టెక్నాలజీస్‌ కో, లెనోవో, ఒప్పో, టీసీఎల్‌ వంటి చైనీస్‌ డివైజ్‌ తయారీదారులకు ఫేస్‌బుక్‌ తన డేటాను షేర్‌ చేసినట్టు వెల్లడించింది. ఇదీ కూడా యూజర్లకు తెలియకుండానే చేసినట్టు తెలిసింది.

ఫేస్‌బుక్‌ డేటా షేర్‌ కావడం..

ఫేస్‌బుక్‌ డేటా షేర్‌ కావడం..

చైనీస్‌ డివైజ్‌ తయారీదారులతో ఫేస్‌బుక్‌ డేటా షేర్‌ కావడం అనేది అత్యంత ప్రమాదకరమని సెనేట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ టాప్‌ డెమొక్రాట్‌ మార్క్‌ వార్నర్‌ అన్నారు.

భాగస్వామ్య విషయంలో..
 

భాగస్వామ్య విషయంలో..

అయితే తాము ఈ భాగస్వామ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నామని, ఫేస్‌బుక్‌ యాప్‌ కస్టమ్‌ వెర్షన్స్‌ను అభివృద్ధి చేయడానికి స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు తాము సహకరిస్తున్నామని ఫేస్‌బుక్ చెబుతోంది. మెంబర్ల సమాచారాన్ని వారు ఎలాంటి వాటికి ఉపయోగిస్తున్నారనే విషయంపై చాలా విశ్లేషణ చేశామని పేర్కొంటోంది.

2009 నుంచి చైనాలో ఫేస్‌బుక్‌ యాప్‌ బ్లాక్‌

2009 నుంచి చైనాలో ఫేస్‌బుక్‌ యాప్‌ బ్లాక్‌

అయితే 2009 నుంచి చైనాలో ఫేస్‌బుక్‌ యాప్‌ బ్లాక్‌ అయి ఉంది. అయినప్పటికీ ఆ దేశ కంపెనీలకు మాత్రం ఈ కంపెనీ యూజర్ల డేటా ఇవ్వడంపైనే ఇప్పుడు వివాదం రేగుతోంది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ షేర్‌చేసిన చైనీస్‌ కంపెనీలు, ఆ దేశ కమ్యూనిస్ట్‌ పార్టీ, వారి మిలటరీకి సంబంధించినివేనా లేక వేరే కంపెనీలా.. అనేదానిపై స్పష్టత లేదు.

కేంబ్రిడ్జ్‌ అనలిటికా

కేంబ్రిడ్జ్‌ అనలిటికా

ఇప్పటికే ఫేస్‌బుక్‌ కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే కన్సల్టెన్సీ కంపెనీతో యూజర్ల డేటాను పంచుకుందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ ఆరోపణలపై ఆ కంపెనీ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కాంగ్రెస్‌ సభ్యుల మందుకు వచ్చి కూడా క్షమాపణ చెప్పారు.

న్యూయార్క్‌ టైమ్స్‌ బహిర్గతం చేసిన రిపోర్టులు..

న్యూయార్క్‌ టైమ్స్‌ బహిర్గతం చేసిన రిపోర్టులు..

తాజాగా న్యూయార్క్‌ టైమ్స్‌ బహిర్గతం చేసిన రిపోర్టులు, వెలుగులోకి వచ్చిన చైనీస్‌ కంపెనీలతో భాగస్వామ్యం అన్ని విషయాల్లోనూ ఫేస్‌బుక్‌ ఎంత ఘోర తప్పిందం చేసిందో వెల్లడవుతుందని టెక్‌ వర్గాలంటున్నాయి.

Best Mobiles in India

English summary
Facebook confirms data-sharing agreements with Chinese firms More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X