ఎక్కువ మందిని చేరుకోవడానికి ఎంగేజ్మెంట్ బెయిట్ లను ఉపయోగించే పోస్ట్ లను ఫేస్ బుక్ ఇకపై ప్రోత్సహించదు!!

By Lakshmi Bai Praharaju
|

ఫేస్ బుక్ టైం లైన్ లో చాలా స్పామీ పోస్ట్ లు పెడితే, అవి సూచించినట్లు లైక్ లు, షేర్ లు, కామెంట్లు, ఇతరత్రా పనుల్లో మునిగిపోవడ౦ ఎవరికీ నచ్చదు. ఉదాహరణకు, “మీరు మేష రాశి వారైతే ఈ పోస్ట్ ను లైక్ చేయండి!” అనేది ఒక “ఎంగేజ్మెంట్ బెయిట్” అంటారు, ఈ చిట్కా ఫేస్ బుక్ లో అందుబాటులో వుండే న్యూస్ ఫీడ్ ఆల్గారిథం ను ఉపయోగించుకుని ఎంగేజ్మెంట్ ను ప్రోత్సహించడం ద్వారా ఎక్కువ మందిని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది.

 
ఎక్కువ మందిని చేరుకోవడానికి ఎంగేజ్మెంట్ బెయిట్ లను ఉపయోగించే పోస్ట్

ఎంగేజ్మెంట్ బెయిట్ లను వాడుకుంటూ ప్రజలు, పేజీలు చేసే వ్యక్తిగత పోస్ట్ లను – ఇకపై అనుమతించేది లేదని ఈ మధ్యే ఫేస్ బుక్ ప్రకటించింది కూడా. మరింత సాధికారమైన ఎంగేజ్మెంట్ ను ప్రోది చేయడానికి వివిధ రకాల ఎంగేజ్మెంట్ బెయిట్ లను గుర్తించగలిగే సామర్ధ్యం వున్న మెషీన్ లెర్నింగ్ మోడల్ ను రూపొందించేందుకు ఫేస్ బుక్ వందల, వేల కొద్దీ పోస్ట్ లను సమీక్షించి, వర్గీకరించింది.

పైగా, వచ్చే కొద్ది వారాల్లో న్యూస్ ఫీడ్ ద్వారా కృత్రిమంగా ఎక్కువ మందిని చేరుకునేందుకు ప్రయత్నించడం కోసం ఒక క్రమపధ్ధతిలో, అదే పనిగా ఎంగేజ్మెంట్ బెయిట్ లను ఉపయోగించే పేజీలను నివారించేందుకు ఫేస్ బుక్ కఠీనమైన నిబంధనలు పాటిస్తోంది.

ఆయా పేజీల పబ్లిషర్లు దీనికి అలవాటు పడడానికి, పొరపాటున తమ పోస్ట్ లలో ఎంగేజ్మెంట్ బెయిట్ లను ఉపయోగించకుండా ఉండేందుకు ఈ పేజీ స్థాయి నిరాకరణలను ఫేస్ బుక్ పలు వారాల్లో క్రమంగా అమలు చేస్తుంది. అంతే కాదు, ఈ ఎంగేజ్మెంట్ బెయిట్ ను తగ్గించడానికి తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసేందుకు ఈ సామాజిక మాధ్యమ దిగ్గజం మరిన్ని దారులు వెతికే ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది.

జియో ఫైబర్ వచ్చేస్తోంది, స్పీడ్‌లో ఏ మార్పు లేదు !జియో ఫైబర్ వచ్చేస్తోంది, స్పీడ్‌లో ఏ మార్పు లేదు !

అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే –సహాయం కోసం అర్ధించేవి, సలహాలు, సిఫార్సులు అడిగేవి, తప్పిపోయిన పిల్లల గురించిన పోస్ట్ లు, ఒక లక్ష్యం కోసం నిధులు కొరివి, లేదా ప్రయాణ సూచనలు అడిగే పోస్ట్ లు లాంటివి ఈ కొత్త నిబంధన వల్ల పెద్దగా ఇబ్బందులు ఎదుర్కొనవు.

ఫేస్ బుక్ పోస్ట్ లలోని న్యూస్ ఫీడ్ ల కీలక విలువగా పరిగణించే సాధికారతకు విరుద్ధంగా ఉన్న పోస్ట్ లను మాత్రమె ఫేస్ బుక్ డిమోట్ చేస్తుంది. నాసి రకం వెబ్ పేజీల అనుభవాలకు దారి తీసే క్లిక్ బెయిట్ హెడ్ లైన్స్ ను నివారించడానికి ఫేస్ బుక్ ఇటీవల చేసిన ప్రయత్నాల తరహాలోణే – చెత్త రకం, సంచలనాత్మక లేదా అపోహలు వ్యాప్తి చేసే కంటెంట్ వ్యాప్తిని బాగా తగ్గించి – అర్ధవంతమైన, సాధికారమైన కంటెంట్ ను మాత్రమె ఫేస్ బుక్ సంవాదాలలో ప్రోత్సహించేందుకు ఫేస్ బుక్ తీర్మానించింది.

ఇది పేజీలను ఎలా ప్రభావితం చేస్తుంది ?

తమ పోస్ట్ లలో ఎంగేజ్మెంట్ బెయిట్ చిట్కాలను ఉపయోగించే పబ్లిషర్లు, ఇతర వ్యాపారులు ఇటువంటి వాటి ద్వారా తమ రీచ్ – వ్యాప్తి తగ్గుతుందని గ్రహించాలి. అలాగే, అదే పనిగా ఎంగేజ్మెంట్ బెయిట్ పోస్ట్ లను పంపే పేజీలు ఇకనుంచి తమ పోస్ట్ ల వ్యాప్తి బాగా తగ్గుతున్నట్లు గమనిస్తారు. పేజీల అడ్మిన్ లు కూడా ఎంగేజ్మెంట్ బెయిట్ ల జోలికి పోకుండా సందర్భానికి తగిన అర్ధవంతమైన స్టోరీ లను మాత్రమె పోస్ట్ చేయడం మీదనే దృష్టి కేంద్రీకరించాలని ఫేస్ బుక్ ఇటీవలే ఒక బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది.

Best Mobiles in India

Read more about:
English summary
Facebook has announced that they will start demoting individual posts from people and Pages that use engagement bait.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X