ఫేస్‌బుక్‌లో సరికొత్త అప్‌డేట్‌..!

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ నూతన అప్‌డేట్‌ను ప్రవేశబెట్టింది .

By Anil
|

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ నూతన అప్‌డేట్‌ను ప్రవేశబెట్టింది . ప్రపంచంలోని అన్ని భాషల యూజర్లకు ఫేస్‌బుక్‌ను మరింత దగ్గర చేసేందుకుగాను సంస్థ తన భాషా అనువాద (లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌) విభాగాన్ని పటిష్ట పరిచింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ ని ఉపయోగించి ఇతర భాషల్లో పెట్టే ఫేస్‌బుక్‌లోని పోస్టులు, కామెంట్లను కచ్చితంగా, తక్కువ సమయంలో ఏ బాషలో అయిన ట్రాన్స్‌లేట్‌ చేయగలిగే నూతన అప్‌డేట్‌ను ప్రవేశబెట్టింది. దీని వలన ఇతర భాషల్లోని పోస్టులు, కామెంట్లను యూజర్లు తమకు కావాల్సిన భాషల్లో చూసుకునేలా ఈ నూతన వ్యవస్థ ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.

కొన్ని భాషల్లోని పోస్టులను మాత్రమే....

కొన్ని భాషల్లోని పోస్టులను మాత్రమే....

ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో అందుబాటులో ఉన్న అనువాద వ్యవస్థ వళ్ళ కొన్ని భాషల్లోని పోస్టులను మాత్రమే యూజర్లకు సులువుగా వారికీ అర్థమయ్యే విధంగా ట్రాన్స్‌లేట్‌ చేయగలవు. అయితే ఇప్పటి నుంచి ఆ పరిస్థితి రాకుండా సులువుగా వారికీ కావాల్సిన బాష లో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు .

ఉర్దూ, బర్మీస్‌ లాంటి పలు భాషలను ట్రాన్స్‌లేట్‌ చేయడంలో .....

ఉర్దూ, బర్మీస్‌ లాంటి పలు భాషలను ట్రాన్స్‌లేట్‌ చేయడంలో .....

అయితే ఉర్దూ, బర్మీస్‌ లాంటి పలు భాషలను ట్రాన్స్‌లేట్‌ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.కాగా ఇలాంటి వాటిని అధిగమించేందుకు గాను మెషిన్‌ ట్రాన్స్‌లేషన్‌ సిస్టమ్‌లోకి వికిపీడియా లాంటి వెబ్‌సైట్‌ల్లోని వేర్వేరు భాషల్లో ఉన్న పెద్ద పెద్ద వ్యాఖ్యాలను అప్‌లోడ్‌ చేసింది.

యూజర్లు తమకు కావాల్సిన భాషల్లో.....

యూజర్లు తమకు కావాల్సిన భాషల్లో.....

ఈ ట్రాన్స్‌లేట్‌ ద్వారా ఇతర భాషల్లోని పోస్టులు, కామెంట్లను యూజర్లు తమకు కావాల్సిన భాషల్లో చూసుకునేలా ఈ నూతన వ్యవస్థ ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.

ట్రాన్స్‌లేట్‌ ఎలా చేయాలంటే....

ట్రాన్స్‌లేట్‌ ఎలా చేయాలంటే....

మరొక భాషలో వ్రాయబడిన పోస్ట్ లేదా కామెంట్ ను అనువదించడానికి, పోస్ట్ లేదా కామెంట్ క్రింద ట్రాన్స్‌లేట్‌ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి.మీరు మరొక భాషలో వ్రాయబడిన పోస్ట్ లేదా కామెంట్ క్రింద అనువాద ఎంపికలను చూడకపోతే, ఆ భాషకు అనువాద ఎంపికలు ఆన్ చేయబడిందని నిర్ధారించుకోండి.

Best Mobiles in India

English summary
Facebook develops quicker, faster way to translate languages.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X