ఇండియన్ జర్నలిస్టులను టార్గెట్ చేసిన ఫేస్‌బుక్, అకౌంట్లు మాయం
ఫేస్‌బుక్ కొంతమంది ప్రముఖ జర్నలిస్టుల అకౌంట్లను మాయం చేసింది. కనీసం ఎలాంటి హెచ్చరికలు లేకుండా వారి అకౌంట్లను డిసేబుల్ చేసింది.
ఫేస్‌బుక్ కొంతమంది ప్రముఖ జర్నలిస్టుల అకౌంట్లను మాయం చేసింది. కనీసం ఎలాంటి హెచ్చరికలు లేకుండా వారి అకౌంట్లను డిసేబుల్ చేసింది. గత 10 రోజులుగా ఫేస్‌బుక్ డజనుకు పైగా జర్నలిస్టుల అకౌంట్లను మాయం చేసింది. ఎలాంటి నోటీసులు లేకుండా.. వారి అకౌంట్లను డిసేబుల్ చేసింది. వీరిలో చాలా మంది సీనియర్ ఎడిటర్లు ఉన్నారు. అసలెందుకు ఫేస్‌బుక్ ఈ పని చేసింది? సీనియర్ ఎడిటర్ల అకౌంట్లనే ఎందుకు డిసేబుల్ చేస్తుందంటే అదో పెద్ద కథ ఉన్నట్లు తెలుస్తోంది.

భుత్వాన్ని నిలదీస్తూ..
ఫేస్‌బుక్ లో అకౌంటు డిసేబుల్ జర్నలిస్టులు దేశంలో జరుగుతున్న కొన్ని కీలక అంశాలపై ఆర్టికల్స్ రాస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తున్నారు. ఎక్కువగా మైనార్టీలపై జరుగుతున్న దాడులు, అట్టడగు వర్గాల వారి సమస్యలు, జాతీ ప్రాముఖ్యత అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వీరు ఆర్టికల్స్ రాస్తున్నారు.

అధికార పార్టీపై వ్యతిరేకత..
ఈ నేపథ్యంలో అధికార పార్టీపై వ్యతిరేకత పెరిగే అవకాశముందనే కారణంతో, ఏకంగా జర్నలిస్టుల అకౌంట్లనే ఫేస్‌బుక్ డిసేబుల్ చేస్తుందని సమాచారం.సెప్టెంబర్ చివరి వారంలో ఫేస్‌బుక్ పలువురు ప్రముఖ జర్నలిస్ట్‌ల అకౌంట్లను డిసేబుల్ చేసింది.

వారిలో దైనిక్ భాస్కర్ న్యూస్ ఎడిటర్ అజయ్ ప్రకాశ్, జంజ్వార్.కామ్ ఎడిటర్ ప్రేరణ నెగి, జనతాకారిపోర్టర్.కామ్ ఎడిటర్, బీబీసీ మాజీ ఎడిటర్ రిఫత్ జావిద్, గల్ఫ్‌లో అవార్డ్ విన్నింగ్ భారతీయ జర్నలిస్ట్, కాలమిస్ట్, ఖలీజ్ టైమ్స్ మాజీ ఒపీనియన్ ఎడిటర్ అజాజ్ జాకా సయ్యద్‌లు ఉన్నారు.

ఫేస్‌బుక్ ఇంకా ఆపలేదని..
జర్నలిస్ట్‌లపై వేటు వేయడాన్ని ఫేస్‌బుక్ ఇంకా ఆపలేదని కూడా తెలుస్తోంది. మరికొంతమంది ఎడిటర్లపై కూడా ఫేస్‌బుక్ వేటు వేసినట్టు తెలిసింది.వీరిలో చాలా మంది సీనియర్ ఎడిటర్లే ఉన్నారని సమాచారం.

ఎలాంటి కారణం లేకుండా..
ఎలాంటి కారణం లేకుండా న్యూస్ వెబ్‌సైట్ ఎడిటర్ల ఖాతాలను ఫేస్‌బుక్ డిసేబుల్ చేస్తోంది. జాతీయ ప్రాముఖ్యత, సమకాలీన రాజకీయ అంశాలు, అట్టడుగు గ్రూప్‌లు, మైనార్టీల సమస్యలపై ఆర్టికల్స్ రాస్తున్న ఎడిటర్లనే ఫేస్‌బుక్ టార్గెట్ చేసింది' అని కారవాన్‌డైలీ.కామ్ ట్వీట్ చేసింది.

ట్విటర్ వేదికగా..
ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్‌లు వాసిమ్ త్యాగి, సంజయ్ పాండే వంటి వారి అకౌంట్లను కూడా ఫేస్‌బుక్ డిసేబుల్ చేసింది. దీంతో ఎడిటర్లు ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఫేస్‌బుక్‌ను తెలియపరిచారు.

పదేపదే ఫిర్యాదు చేయడంతో..
ఫేస్‌బుక్ ఎలాంటి నోటీసులు లేకుండా తమ అకౌంట్లను డిసేబుల్ చేయడంపై మండిపడ్డారు. పదేపదే ఫిర్యాదు చేయడంతో, కొంతమంది అకౌంట్లను ఫేస్‌బుక్ రిస్టోర్ చేసింది. అయితే కొంతమంది అకౌంట్లను ఇప్పటికీ డిసేబుల్‌లోనే ఉంచినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications








