మిలియన్ ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి, పాస్‌వర్డ్ వెంటనే మార్చుకోండి

By Gizbot Bureau
|

కేంబ్రిడ్జి ఎనాలటికా ప్రకంపనలు మరువక ముందే మళ్లీ ఫేస్‌బుక్ చిక్కుల్లో పడింది. డేటా స్కాం దెబ్బకు బిత్తరపోయిన ఫేస్‌బుక్ ఈ సారి యూజర్లు తమ అకౌంట్లను తొలగించుకునే స్థాయిలో లోపం బయటపపడింది. యూజర్ల వందల మిలియన్ల పాస్‌వర్డ్‌లను తమ ఇంటర్నల్‌ సెర్వర్‌లలో దాచిపెట్టామని ఈ సోషల్ మీడియా దిగ్గజం వెల్లడించింది. ఫేస్‌బుక్ ఖాతా కలిగిలిన ప్రతి ఒక్క యూజర్ పాస్‌వర్డ్ తమకు తెలుసని వెల్లడించింది. భద్రతా నిబంధనలకు విరుద్ధంగా సులువుగా చదవగలిగిన (ప్లెయిన్‌ టెక్స్ట్‌) ఫార్మాట్‌లోనే సర్వర్లలో నిక్షిప్తం చేసామని వెల్లడించింది. జనవరిలో నిర్వహించిన సెక్యూరిటీ రివ్యూలో ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌వెల్లడించింది.

బయటివారికి

బయటివారికి

ఈ పాస్ వర్డ్‌లు ఫేస్ బుక్ బయటివారికి ఎప్పటికీ కనిపించ(తెలియవు)వనీ.. కేవలం ఫేస్‌బుక్ సంస్థలోని ఉద్యోగులకు మాత్రమే కనిపిస్తుంటాయని తెలిపింది. కేవలం 20 వేల మంది తమ సంస్థ ఉద్యోగులకు ఆ పాస్‌వర్డ్‌లు కనిపించేవనీ, బయటి వారికి కాదని తెలిపింది.

ఖాతాల సంఖ్య 60 కోట్లు

ఖాతాల సంఖ్య 60 కోట్లు

మొత్తం అలాంటి ఖాతాల సంఖ్య 60 కోట్లని విశ్వసనీయ సమాచారం. ఉద్యోగులు ఆ ఖాతాల్లోకి అనధికారికంగా లాగిన్‌ అయినట్లు కానీ, వాటిని దుర్వినియోగం చేసినట్లు కానీ తమకేమీ ఆధారాలు లభించలేదని సంస్థ ఇంజినీరింగ్, సెక్యూరిటీ, ప్రైవసీ విభాగాల ఉపాధ్యక్షుడు పెడ్రో కనహువాటి చెప్పారు.

ఇన్ స్టా గ్రామ్ యూజర్లు కూడా
 

ఇన్ స్టా గ్రామ్ యూజర్లు కూడా

ఈ ఏడాది మొదట్లో సాధారణ భద్రతా తనిఖీలు చేస్తుండగా ఈ విషయం బయటపడిందన్నారు. ఇలా ఏయే ఫేస్‌బుక్‌ ఖాతాల పాస్‌వర్డ్‌లు బయటకు కనిపించాయో ఆయా ఖాతాదారులకు దీనిపై త్వరలో ఓ నోటిఫికేషన్‌ కూడా పంపే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.ఇన్ స్టా గ్రామ్ యూజర్లు కూడా దీని భారీన పడ్డారు.

2012 నుంచి

2012 నుంచి

కాగా 2012 నుంచి ఈ డేటా వ్యవహారం నడుస్తోందని వారు తెలిపారు. ఫేస్‌బుక్‌ ఇంజినీరింగ్‌, భద్రత, గోప్యత విభాగం ఉపాధ్యక్షుడు పెడ్రో కనహువాటి తన ‘బ్లాగ్‌స్పాట్‌'లో దీనిపై వివరణ ఇచ్చారు. ఏటా జరిపే భద్రత సమీక్షలో భాగంగా ఇంతవరకు దుర్వినియోగం అయిన దాఖలాలేవీ లేవని, ఈ ఏడాది కూడా ఈ ఘోర తప్పిదాన్ని కనిపెట్టలేకపోయామని ఆయన అంగీకరించారు.

ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా

ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా

ఈ తప్పిదం తమ దృష్టికి రాగానే ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తమ ఉద్యోగులకు కనిపించేలా పాస్‌వర్డ్‌లు కలిగి ఉన్నఫేస్‌బుక్‌ లైట్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు త్వరలోనే ఈ విషయమై తగిన హెచ‍్చరికలు, సూచనలు జారీ చేస్తామన్నారు. కొత్త పాస్‌వర్డ్‌లు పెట్టుకునేలా సూచిస్తామన్నారు.

పాస్ వర్డ్ లు మార్చుకోండి

పాస్ వర్డ్ లు మార్చుకోండి

ఇన్ స్టా గ్రామ్ యూజర్లు వెంటనే తమ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని అలర్ట్ మెసేజ్ లు జారీ అయ్యాయి. కాగా క్రెబ్స్‌ఆన్‌సెక్యూరిటీ.కామ్‌ అనే సెక్యూరిటీ న్యూస్‌ వెబ్‌సైట్‌ ఇంతకుముందెప్పుడో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. గత కొన్నేళ్లుగా 60 కోట్లమంది ఫేస్‌బుక్‌ ఖాతాదారుల పాస్‌వర్డ్‌లు సాధారణ అక్షరాల్లోనే నిల్వ ఉంచారని, గుప్త అక్షరాల్లో నిక్షిప్తం చేయలేదని, 20వేలమంది ఫేస్‌బుక్‌ ఉద్యోగులు వాటిని చూడగలరని తెలిపింది.

గోప్యతపై సర్వత్రా అనుమానాలు

గోప్యతపై సర్వత్రా అనుమానాలు

దీంతో ఫేస్‌బుక్‌ గోప్యతపై సర్వత్రా అనుమానాలు తలెత్తాయి. అయితే 2012కు ముందు పెట్టుకున్న పాస్‌వర్డ్‌లు మాత్రమే ఈ ప్రభవానికి లోనయ్యాయని, ఆ తరువాత పాస్‌వర్డ్‌లు మార్చుకున్నవారు, కొత్త యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా క్రెబ్స్‌ నివేదించింది.

ఫేస్‌బుక్ డేటా సెక్యూరిటీపై

ఫేస్‌బుక్ డేటా సెక్యూరిటీపై

కాగా ఇప్పటికే ఫేస్‌బుక్ డేటా సెక్యూరిటీపై అందోళన వెల్లువెత్తుతున్న సమయంలో ఈ పాస్‌వర్డ్ ఇష్యూ తెరపైకి రావటంతో యూజర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఈ లీకేజి వ్యవహారం భద్రతా నిబంధనలకు విరుద్ధమేనని సైబర్ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Best Mobiles in India

Read more about:
English summary
Facebook exposes millions of passwords: Who is affected, what you can do and more More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X