ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్, అమ్మాయిల ప్రొఫైల్ ఫోటోలు ఇక సేఫ్

మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ రెండు సరికొత్త టూల్స్ ను లాంచ్ చేసింది. వీటిలో ఒక టూల్ పేరు profile picture guard. ఫేస్‌బుక్ యూజర్లు ఈ టూల్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా తమ ప్రొఫైల్ పిక్‌ను ఇతరులు డౌన్‌లోడ్ చేయ్యలేరు, షేర్ చేయ్యలేరు. కనీసం స్ర్కీన్‌షాట్‌ను కూడా తీసుకోలేరు.

ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్, అమ్మాయిల ప్రొఫైల్ ఫోటోలు ఇక సేఫ్

profile picture guard టూల్ ఎనేబుల్ చేసిన వెంటనే ప్రొఫైల్ పిక్ చుట్టూ బ్లూ బోర్డర్ వచ్చేస్తుంది. ఇది ఒక షీల్డ్‌లా కనిపిస్తుంది. ముఖ్యంగా భారతీయ మహిళలను దృష్టిలో ఉంచుకుని ఫేస్‌బుక్ ఈ టూల్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక ఫేస్‌బుక్ లాంచ్ చేయబోతున్న రెండవ ఫీచర్ unique design ద్వారా మీ ప్రొఫైల్ పిక్స్ మీద 6 రకాల overlaysను సెట్ చేసుకునే వీలుంటుంది. ఈ ఫీచర్ మీ ప్రొఫైల్ పిక్‌కు అదనపు డిజైనింగ్‌ను ఇస్తుంది. దీంతో వేరొకరు మీ పిక్ పై ఆసక్తి చూపించే అవకాశం ఉండదు.

English summary
Facebook gives Indians more control over their profile pictures. Read More in Telugu...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot