తెలంగాణా ప్రభుత్వంపై తప్పుడు పోస్టులు, Facebook గ్రూపు అడ్మిన్ అరెస్ట్

Written By:

ఫేస్‌‌బుక్‌‌లో తెలంగాణా ప్రభుత్వంపై వ్యతిరేక పోస్టులు పెడుతున్న గ్రూప్‌ అడ్మిన్‌‌ను పోలీసులు అరెస్టు చేసిన ఘటన తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఫేస్‌బుక్ లో ఒక గ్రూప్ అడ్మిన్ గా ఉన్న జె.ప్రశాంత్‌ ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు, వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు, ఐటీ యాక్ట్ ప్రకారం ప్రశాంత్ ను అదుపులోకి తీసుకుని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. విచారణ అనంతరం అతనిని విడిచి పెట్టారు. అతనిపై కేసు నమోదు చేశామని, మళ్లీ విచారిస్తామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. TOI పత్రిక కధనం ప్రకారం ప్రశాంత్ అనే వ్యక్తి స్పిరిట్ ఆఫ్ తెలంగాణా పేరుతో ఫేస్‌‌బుక్‌‌లో గ్రూప్ అడ్మిన్ రన్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఈ గ్రూపుని దాదాపు 20 వేల మంది ఫాలో అవుతున్నారు. ఇలాంటి కధనాలు ఇంతకుముందు చాలానే జరిగాయి.

నిన్న ఫేస్‌బుక్, నేడు వాట్సప్.. డేంజర్ జోన్‌లో యూజర్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా..

సోషల్ మీడియాలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోస్టుల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గవర్నమెంట్ టీచర్ పై సస్పెన్షన్ వేటు పడింది. గవర్నమెంటుకు వ్యతిరేకంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో తోటి ఉపాధ్యాయులు ఇతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు ఈ మాస్టారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపగా ఆధారాలతో సహా దొరికిపోయాడు..అంతే సస్పెన్షన్ వేటు పడింది.

తెరాస ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సు కండక్టర్‌ సస్పెండ్‌కు గురయ్యాడు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్‌ ఉత్తర్వులను అందజేసింది.

పొలిటికల్ పంచ్ రవికిరణ్ అరెస్ట్

వైసీపీ కి మద్దతుగా టీడీపీకి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పొలిటికల్ పంచ్ పేరుతో ఓ పేజ్ నిర్వహిస్తున్న నిర్వాహకుడు రవికిరణ్ ను రెండుసార్లు ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇదివరకే ఓ సారి చట్టసభలను అవమానించేలా పోస్టు పెట్టాడని అరెస్ట్ చేసి విడుదల చేసినప్పటికీ మళ్లీ అదే పంధా సాగించడంతో రెండోసారి పొలిటికల్ పంచ్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఐవైఆర్ కృష్ణారావు..

బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా విధులు నిర్వర్తించిన ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు షేర్ చేశారని వార్తలతో అతను తన పదవిని కోల్పోయారు.

42 రోజుల జైలు శిక్ష..

జకీర్‌ అలీ త్యాగి(18) ఫేస్‌బుక్‌లో గంగానది, రామ్‌ మందిర నిర్మాణం, ముస్లింలకు హాజ్‌సబ్సిడీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతడిని అరె్‌స్ట చేసి ఐపీసీ 420తో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. 42 రోజుల జైలు శిక్ష అనంతరం బెయిల్‌పై ముజఫర్‌నగర్‌ జైలు నుంచి విడుదలయ్యాడు.

మరో కేసు..

సోషల్‌ మీడియా కార్యకర్త ఇప్పాల రవీందర్‌ టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై అనుచిత పోస్టు పెట్టారని ఆరోపిస్తూ ఆయనపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook group administrator picked up by cops in mufti More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot