మళ్లీ వార్తల్లోకి బాహుబలి 2, ఈ సారి ట్రెండ్ సెట్ చేసింది !

Written By:

తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా నీరాజనాలు అందుకున్న బాహుబలి 2 మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ సారి సినిమా పరంగా కాకుండా సోషల్ మీడియలో ట్రెండ్ సెట్ చేసింది. ఫేస్‌బుక్ ఇండియా 2017 సంవత్సరానికి గాను విడుదల చేసిన ఇయర్ రివ్యూలో బాహుబలి 2కి మొదటి స్థానం దక్కింది.

బాహుబలి బ్రేక్‌డౌన్ గ్రాఫిక్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్‌లో ఇండియా వ్యాప్తంగా..

2017 సంవత్సరంలో ఇండియాలో టాప్ 10 స్థానాల్లో నిలిచిన ట్రెండింగ్ టాపిక్స్ లిస్ట్‌ను ఫేస్‌బుక్ వెల్లడించింది. ఈ జాబితాలో 2017వ సంవత్సరంలో ఫేస్‌బుక్‌లో ఇండియా వ్యాప్తంగా బాగా ట్రెండ్ అయిన టాపిక్‌గా బాహుబలి 2 అగ్రస్థానంలో నిలిచింది.

రెండో స్థానంలో తమిళనాడు జల్లికట్టు క్రీడ

ఇక రెండో స్థానంలో తమిళనాడు జల్లికట్టు క్రీడ, 3వ స్థానంలో ఇండియా-పాకిస్థాన్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్ మ్యాచ్, 4వ స్థానంలో భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన సూపర్ ఫాస్ట్, మెయిల్ ట్రెయిన్స్ వివరాలు నిలిచాయి.

5వ స్థానంలో

5వ స్థానంలో బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా మరణం, 6వ స్థానంలో చెస్టర్ బెనింగ్‌టన్ మరణం, 7వ స్థానంలో లవకుశ తెలుగు సినిమా నిలిచాయి.

8వ స్థానంలో..

కాగా 8వ స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, 9వ స్థానంలో మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్, 10వ స్థానంలో యూపీ గోరఖ్‌పూర్ పిల్లల మరణాలు బాగా ట్రెండ్ అయిన టాపిక్స్‌లో వరుసగా నిలిచాయని ఫేస్‌బుక్ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook India Year in Review 2017: Baahubali 2 the Most Discussed Topic of the Year More News at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot