ఫేస్‌బుక్ వేధింపులకు ఇక చెక్!

By: BOMMU SIVANJANEYULU

సోషల్ మీడియాలో రోజురోజుకు ఎక్కువైపోతోన్న వేధింపులను అరికట్టే క్రమంలో ప్రముఖ సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ సరికొత్త టూల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టూల్స్ ద్వారా అన్‌వాంటెడ్ ఫ్రెండ్ రిక్వెస్టులతో పాటు మెసెజ్‌లకు దూరంగా ఉండొచ్చు. అనవసరమైన కాంటాక్ట్‌లను గుర్తించి వాటిని నిరోధించటంలో ఈ టూల్స్ కీలక పాత్ర పోషిస్తాయని ఫేస్‌బుక్ సేఫ్టీ విభాగం గ్లోబల్ హెడ్ యాంటీగన్ డేవిస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అనుమానాస్పద మెసేజ్‌లకు పూర్తిగా అడ్డుకట్ట

అనుమానాస్పద వ్యక్తుల నుంచి వచ్చిన మెసెంజర్ కన్వర్జేషన్‌లను ఇగ్నోర్ చేయటంతో పాటు వాటిని ఇన్‌బాక్స్ నుంచి ఆటోమెటిక్‌గా డిలీట్ చేయగలిగే సౌకర్యాన్ని ఈ కొత్త టూల్స్ యూజర్స్‌కు కల్పిస్తాయని ఆయన వెల్లడించారు. ఈ టూల్స్ పనిచేసే విధానాన్ని పరిశీలించినట్లయితే.. ఇగ్నోర్ చేయవల్సిన మెసేజ్ పై టాప్ చేసిన వెంటనే ఆ అకౌంట్‌కు సంబంధించిన నోటిఫికేషన్స్ ఆటోమెటిక్‌గా డిసేబుల్ కాబడతాయి.

ఇదే సమయంలో ఆ కన్వర్జేషన్‌ను మీ ఇన్‌బాక్స్ నుంచి ఫిల్టరుడ్ మెసెజెస్ ఫోల్డర్‌లోకి మూవ్ చేయటం జరుగుతుంది. ఫిల్టరుడ్ మెసెజెస్ ఫోల్డర్‌లోకి వచ్చే అనుమానస్పద మెసేజెస్ తాలుకా సంభాషణలను మనం చదివే వీలుంటుంది. అయితే అవి మనం చదివినట్లు సెండర్‌కు తెలిసే ఆస్కారం ఉండదు.

త్వరలోనే అన్ని గ్రూప్ మెసేజ్‌లకు వర్తింపు..

ప్రస్తుతానికి ఈ ఫీచర్ వన్‌ఆన్‌వన్ కన్వర్జేషన్స్‌కు మాత్రమే అందుబాటులో ఉందని త్వరలోనే అన్ని గ్రూప్ మెసేజ్‌లకు ఈ సదుపాయాన్ని అందుబటులోకి తీసుకురానున్నట్లు డేవిస్ తెలిపారు. సోషల్ మీడియాలో వేధింపులకు గురువుతోన్న మహిళలతో పాటు జర్నలిస్టులకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ అభిప్రాయపడుతోంది.

జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ : ఎక్కువ డేటా, తక్కువ డబ్బులు !

నకిలీ అకౌంట్‌ల పై పూర్తి నిఘా...

ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్‌లను సృష్టించి వాటి ద్వారా వేధింపులకు పాల్పడుతోన్న వారి పై కూడా కొరడా జులిపించేందుకు సిద్ధమవుతోంది. తాము అభివృద్ధి చేసిన కొత్త టూల్స్ నకిలీ అకౌంట్లను పూర్తిగా నిరోధించగలుగుతాయని ఫేస్‌బుక్ తెలిపింది. ఈ ఆటోమేటెడ్ ఫీచర్స్ ద్వారా నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్‌ను గుర్తించి వాటిని వేగంగా బ్లాక్ చేయటంతో పాటు కొత్తగా జనరేట్ అయ్యే అకౌంట్లను కూడా అడ్డుకునే వీలుంటుందని ఫేస్‌బుక్ చెబుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
As parts of its ongoing efforts to build a safe community in the digital world, Facebook is now announcing new tools to prevent harassment on its platform and in Messenger.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot