Home
Social media

ఊహించని రంగంలోకి ఫేస్‌బుక్, ఆ కరెన్సీపై గురి

టెక్నాలజీ సంస్థలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సొంత క్రిప్టోకరెన్సీల రూపకల్పనపై దృష్టిసారించడం మొదలుపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి.

By Hazarath Aiah

టెక్నాలజీ సంస్థలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సొంత క్రిప్టోకరెన్సీల రూపకల్పనపై దృష్టిసారించడం మొదలుపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. తాజాగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సైతం క్రిప్టోకరెన్సీపై దృష్టి సారించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన సొంత క్రిప్టోకరెన్సీని సృష్టించాలని అన్వేషిస్తున్న ఫేస్‌బుక్‌, కొత్త బ్లాక్‌ చెయిన్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్టు రిపోర్టులు వస్తున్నాయి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, ఈ టెక్నాలజీ ఆధారిత అవకాశాలను అన్వేషించే బాధ్యతల్ని వారికి అప్పగించినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో ఫేస్‌బుక్ చాలా సీరియస్‌గా ఉన్నట్టు టెక్‌ వెబ్‌సైట్‌ చెడార్‌ రిపోర్టు చేసింది.

200 కోట్ల మందికి పైగా ..

200 కోట్ల మందికి పైగా ..

ఇప్పుడు ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా యూజర్లున్నారు. వీరందరినీ క్రిప్టోకరెన్సీ వైపు మళ్లించేందుకు ఫేస్‌బుక్ కసరత్తు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

 క్రిప్టోకరెన్సీని

క్రిప్టోకరెన్సీని

క్రిప్టోకరెన్సీని లాంచ్‌ చేసి, బిట్‌కాయిన్‌ తరహాలో వర్చ్యువల్‌ కరెన్సీ ద్వారా పేమెంట్లు జరిపేలా అనుమతి ఇవ్వనుంది.ఫేస్‌బుక్‌లో బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఏ విధంగా మెరుగ్గా వినియోగించుకోవచ్చనే దాన్ని అన్వేషించేందుకు ఓ చిన్న జట్టును ఏర్పాటు చేశామని ఫేస్‌బుక్ మెసెంజర్‌ ఎగ్జిక్యూటివ్ ఇంఛార్జ్ డేవిడ్ మార్కస్ తెలిపారు.

ఇతర కంపెనీల మాదిరిగానే .

ఇతర కంపెనీల మాదిరిగానే .

ఇతర కంపెనీల మాదిరిగానే బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ శక్తిని అందిపుచ్చుకునేందుకు అన్వేషిస్తుందని కంపెనీ సైతం ప్రకటించింది. తాము ఏర్పాటు చేసిన చిన్న టీమ్‌ భిన్నమైన అప్లికేషన్లను అన్వేషించడంపై దృష్టి పెట్టనుందని ఇంతకంటే చెప్పేందుకు ప్రస్తుతానికి ఏమీ లేదని పేర్కొంది.

2018లో

2018లో

2018లో బ్లాక్‌చెయిన్‌ సొల్యూషన్లు 2.1 బిలియన్‌ డాలర్లకు చేరుకోనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. 2017 కంటే ఇది రెండింతలు ఎక్కువ అని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ ఈ ఏడాది ప్రారంభంలో పేర్కొంది.

బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీపై ..

బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీపై ..

బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీపై పనిచేసేందుకు ఫేస్‌బుక్‌ కొత్త టీమ్‌ను అభివృద్ధి చేసిందని రీకోడ్‌ కూడా రిపోర్టు చేసింది. న్యూ ప్లాట్‌ఫామ్స్‌, ఇన్‌ఫ్రా కింద ఈ బ్లాక్‌చెయిన్‌ టీమ్‌ వస్తోంది. దీన్ని చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మైక్‌ ష్రోఫెర్ నడిపించనున్నారు. ష్రోఫెర్‌నే ఫేస్‌బుక్‌ ఏఆర్‌, వీఆర్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ కార్యకలాపాలను చూసుకోనున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
After reports surfaced that Facebook is creating a new Blockchain group, fresh media reports have claimed that the social networking giant is also exploring the creation of its own cryptocurrency.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X