ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ ‘GIF-supported poll’
సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్జజం ఫేస్‌బుక్, తన యూజర్ల కోసం సరికొత్త GIF-supported poll ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పోల్ క్విచ్చిన్‌లను స్టేటస్ క్రింద యూజర్లు పోస్ట్ చేసుకునే వీలుంటుంది.

ఈ సదుపాయాన్ని వెబ్ యూజర్లతో పాటు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు కూడా వినియోగించుకోవచ్చని ఫేస్‌బుక్ తెలిపింది. ఈ పోల్ క్విచ్చిన్‌కు సంబంధించిన రెస్పాన్స్ ఆప్షన్లను జిఫ్స్ లేదా ఫోటోస్ రూపంలో యాడ్ చేసుకునే వీలుంటుంది.
ఈ పోల్ ఇతరులకు ఎంత సేపు కనిపించాలి అనేదాని పై టైమ్ డ్యూరేషన్‌ను సెట్ చేసకునే వీలుంటుంది. ఇదే తరహా ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే తన స్టోరీస్ సెక్షన్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. ట్విట్టర్ కూడా ఇదే తరహా పోల్ ఫీచర్‌ను నాలుగు రెస్పాన్స్ ఆప్షన్‌లతో అందించటం జరుగుతోంది. ఫేస్‌బుక్ ఈ తరహా ఫీచర్‌ను 2007 నుంచి పరీక్షిస్తుండటం విశేషం.
Facebook Poll Statusను క్రియేట్ చేయటం ఎలా..?
ఫేస్‌బుక్ పేజీలోకి వెళ్లిన తరువాత కంపోజ్ పోస్ట్ సెక్షన్ లేదా "what's on your mind" సెక్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్‌తో పాటు పలు బటన్స్ కూడా మీకు కనిపిస్తాయి. వాటిని స్ర్కోల్‌డౌన్ చేసినట్లయితే "Poll" పేరుతో ఓ బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ పై క్లిక్ చేసినట్లయితే "Ask Something" సెక్షన్ కనిపిస్తుంది.
ఆ సెక్షన్‌లో మీ క్వచ్చిన్‌ను ఎంటర్ చేయవల్సి ఎంటుంది. ఈ క్విచ్చిన్‌కు రెండు రెస్పాన్స్ ఆప్షన్‌లను మాత్రమే ఇవ్వగలిగే వీలుంటుంది. పోల్‌కు సంబంధించి రెస్పాన్స్ ఆప్షన్‌లను వాక్యం రూపంలో ఇవ్వాలనుకుంటే అది 25 అక్షరాల లిమిట్ దాట కూడదు. ఇలా కాకుండా రెస్పాన్స్ ఆప్షన్లను జిఫ్స్ లేదా ఫోటోస్‌ను యాడ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








