ఇక మెసెంజర్‌ ద్వారా 4కే క్వాలిటీ ఫోటోలను పంపుకోవచ్చు

|

ఫేస్‌బుక్ మెసెంజర్‌ వాడుతున్న వారికి శుభవార్త. ఇక పై మీ మెసెంజర్ నుంచి 4కే రిసల్యూషన్ లేదా 4,096 × 4,096 పిక్సల్స్ సామర్థ్యం గల ఫోటోలను సెండ్ చేసుకోవచ్చు. నిన్నమొన్నటి వరకు ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా హై-రిసల్యూషన్ ఫోటోలు షేర్ చేసుకోవటం సాధ్యమయ్యేది కాదు. తాజా అప్‌డేట్ నేపథ్యంలో హైక్వాలిటీ ఫోటోలను మెసెంజర్ ద్వారా సెండ్ చేసుకునే అవకాశాన్ని ఫేస్‌బుక్ కల్పిస్తోంది.

 
Facebook now lets you share 4K resolution photos in Messenger

ప్రస్తుతానికి ఈ సదుపాయం యూఎస్, కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్, హాంకాంగ్, జపాన్ ఇంకా సౌత్ కొరియాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని దేశాలకు ఈ సర్వీసును ఫేస్‌బుక్ విస్తరించనుంది. ఈ అప్‌డేట్ భారత్‌కు చేరిన వెంటనే మెసెంజర్ యాప్‌ను లేటెస్ట్ వర్షన్‌కు అప్‌డేట్ చేసుకుంటే సరిపోతుంది.

 

ఓ విశ్లేషణ ప్రకారం మెసెంజర్ ద్వారా ప్రతి నెలా 1700 కోట్ల ఫోటోలు బట్వాడా కాబడుతున్నట్లు ఓ అంచనా. ఫేస్‌బక్ అందిస్తోన్న అత్యుత్తమ సర్వీసుల్లో మెసెంజర్ ఒకటి. 2008లో ఫేస్‌బుక్ చాట్ పేరుతో డెవలప్ కాబడిన ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రొడక్ట్‌ను ఆ తరువాత ఫేస్‌బుక్ మెసెంజర్‌లా మార్పు చేసారు.

సరికొత్తగా ఎయిర్‌టెల్, ఇకపై ప్లాన్లు అందరికీ..సరికొత్తగా ఎయిర్‌టెల్, ఇకపై ప్లాన్లు అందరికీ..

మెసెంజర్ యాప్ చాటింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అపోహ పడుతుంటారు. కాని అది పొరపాటు.. ఈ యాప్ ద్వారా ఫోటోస్, వీడియోస్, ఆడియో ఫైల్స్, స్టిక్కర్స్ షేర్ చేసుకోవటంతో పాటు వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ నిర్వహించుకునే వీలుంటుంది.

ప్రత్యేకమైన యానిమేటెడ్ స్టఫ్‌ను అందించే జిఫీ, జిఫ్ కీబోర్డ్ వంటి యాప్స్ మెసెంజర్‌‍లో అందుబాటులో ఉన్నాయి. వీటిని యాక్సెస్ చేసుకోవటం ద్వారా ప్రత్యేకమైన జిఫ్ ఫైల్స్‌ను షేర్ మీరు చేయవచ్చు.

మెసెంజర్ యాప్ వాడటానికి ఫేస్‌బుక్ అకౌంట్ అవసరం లేదు. మెసెంజర్ యాప్‌లో "నాట్ ఆన్ ఫేస్‌బుక్?" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని మొబైల్ నెంబరుతో యాప్‌‍లోకి లాగిన్ కావొచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
Facebook Messenger for both Android and iOS now carries support for the sharing of 4K resolution photos.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X