పొలిటికల్ యాడ్స్‌కు ఫేస్‌బుక్ షాక్ !

By Madhavi Lagishetty
|

వ్యాపార ప్రకటనలు, బిజినెస్ న్యూస్, సినిమాలు వీటితోపాటు ఇతర ప్రకటనలు....అన్నిరకాల అంశాలకు సంబంధించిన ప్రమోషన్లకు సోషల్ మీడియా ఓ వేదికలా మారింది. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలకు దీటుగా వెబ్ మీడియా కూడా తన క్రేజును పెంచుకుంటుంది.

 
పొలిటికల్ యాడ్స్‌కు  ఫేస్‌బుక్ షాక్ !

ఫేసుబుక్, ట్విట్టర్ వంటి వాటిల్లో యాడ్స్ జోరుగా పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో వచ్చే పొలిటికల్ యాడ్స్ ఇస్తున్నవారు ఎవరో తెలుసుకునే అవకాశం ఇప్పటివరకు లేదు. అంతేకాదు ఆ ప్రకటనలు ఇస్తున్నవారి పేర్లు బయటకు వచ్చే ఛాన్స్ కూడా లేదు. అయితే వీటన్నింటికి చెక్ పెట్టబోతుంది ఫేస్‌బుక్. యాడ్స్ వెనక ఉన్నవారి పేర్లతోపాటు వారి వివరాలను తెలుసుకునే అవకాశాన్ని ఫేసుబుక్ కలిపించనుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయాలనే ఉద్దేశ్యంతో రష్యాకు చెందిన ఓ మీడియా , పొలిటికల్ పోస్టులను ప్రమోట్ చేసింది. 100,000డాలర్ల విలువచేసే సోషల్ మీడియా పోస్టులను ప్రమోట్ చేసింది. ఈ పోస్టులు అధ్యక్ష ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపాయి. అయితే ఈ పోస్టులను ప్రమోట్ చేసింది రష్యాకు చెందిన నకిలీ పేజీ అని గుర్తించారు. ఈ సంఘటనతో ఫేస్‌బుక్ తన యాడ్స్ సర్వీసులో లోపాలను గుర్తించింది.

జియో ఫోన్లు ఆపేస్తున్నారా, కంపెనీ సమాధానం ఏంటో తెలుసుకోండి !జియో ఫోన్లు ఆపేస్తున్నారా, కంపెనీ సమాధానం ఏంటో తెలుసుకోండి !

ఫేసుబుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ పొలిటికల్ యాడ్స్ గురించి వివరణ ఇచ్చారు. రాజకీయ ప్రకటనలను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయ ప్రకటనలు మరియు పేజీల కోసం పారదర్శకత కోసం బార్ ను పెంచాలని నిర్ణయించింది. దీనికోసం మూడు పాయింట్లను పెంచాలని నిర్ణయించారు.

ఫేస్‌బుక్ తీసుకుంటున్న నిర్ణయం పొలిటికల్ అడ్వటైజర్లకు అత్యంత ముఖ్యమైంది. ఇపై ఫేస్‌బుక్లో పొలిటికల్ యాడ్స్ ఇచ్చేవారు తమ వివరాలను కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఆ ప్రకటనకు సంబంధించి డబ్బులేవరిచ్చారు కూడా ప్రకటనలో స్పష్టంగా పొందుపరచాల్సి ఉంటుంది. రాజకీయ ప్రకటనదారులచే ప్రచురించబడిన అన్ని యాడ్స్ పొలిటికల్ అనే లేబుల్ కు చేరుతాయి.

ఫేస్‌బుక్ యూజర్లు ఇప్పుడు ఫేస్‌బుక్ పేజ్ కు సంబంధించిన అని ప్రకటనలను యాక్సిస్ కలిగి ఉంటారు. మూడవ పాయింట్ గురించి జూకర్ బర్గ్ ప్రస్తావించారు. ఇది AI మరియు మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథంలను పొటికల్ యాడ్స్ ను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ముందుగా జూకర్ బర్గ్ ఫేసుబుక్ కు AIమరియు మెషిల్ లెర్నింగ్ లను ఉంచి టెర్రర్ కార్యకలాపాలకు సంబంధించిన పోస్టులను గుర్తించాలని ప్రకటించింది.

అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారాల్లో ఎలాంటి ప్రభావం చూపలేదని జూకర్ బర్గ్ స్పష్టం చేశారు.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Facebook CEO Mark Zuckerberg announced yesterday that Facebook will now roll out new measures of transparency for political advertisements on its platform.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X