ఫేస్‌బుక్ ప్రైవసీ సెటింగ్స్ తో మీ వివరాలు భద్రం

Posted By: ChaitanyaKumar ARK

ఈమద్య జరిగిన #DeleteFacebook సామాజిక ఉద్యమం చాలా ప్రభావాణ్ణే చూపిందని చెప్పాలి. తద్వారా అనేకులు తమ ఫేస్బుక్ అకౌంట్లను తొలగించామని కూడా ప్రకటించారు. అసలు ఈ సామాజిక ఉద్యమానికి ప్రధాన కారణం వినియోగదారుల వివరాలు కేంబ్రిడ్జ్ అనాలిటికా అనే సంస్థ దుర్వినియోగం చేయడమే. క్రమంగా థార్డ్ పార్టీ అప్లికేషన్లు డేటా తస్కరించి తమ కార్యకలాపాలకు వాడుకోగలుగుతున్నాయని ప్రపంచానికి తెలిసింది . ఇలాంటి పరిస్థితుల్లో ఫేస్ బుక్ కు గడ్డురోజులు నడుస్తున్నాయని చెప్పవచ్చు. కానీ అందరూ తమ ఫేస్బుక్ ప్రొఫైల్స్ ను తొలగించేందుకు సిద్దంగా ఉండరు. ఫేస్బుక్ ద్వారా నష్టాలను ఎన్ని చూశారో అంతకు మించిన లాభాలను కూడా వినియోగదారులు గమనించారు. అనేకమంది దూర ప్రాంతాల వ్యక్తులను సామాజిక మాద్యమం ద్వారా దగ్గర చెయ్యడమే కాకుండా, తప్పిపోయిన వారిని వారి కుటుంబాల కడకు చేర్చిన ఘనత కూడా ఫేస్బుక్ కు ఉంది. ప్రపంచాన్నే ఒక్కటి చేసిన , అంత గొప్ప సంస్థ ఈమద్య కాస్త చిక్కుల్లో ఉందనే చెప్పవచ్చు.

ఇకపై ఫేస్‌బుక్‌లో ఇవి చేయడం కష్టం, జుకర్‌బర్గ్ కీలకమైన చర్యలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భద్రతకై కొన్ని ప్రత్యేకమైన చర్యలు..

ఫేస్బుక్ అకౌంట్స్ తొలగించుటకు అనేక శాతం సుముఖతను ప్రదర్శించరు. ఎంతమంది వ్యతిరేకులు ఉన్నారో అంతకు రెట్టింపు అభిమానులు కూడా ఉన్నారు. కానీ వివరాల భద్రతకై కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం కూడా ముఖ్యమే కదా. కొన్ని భద్రతా పరమైన చర్యలు వినియోగదారులు తీసుకోవడం ద్వారా, ఫేస్ బుక్ నుండి వివరాలు బయటకు వెళ్లకుండా కాపాడుకోవచ్చు. ప్రపంచంలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. తద్వారా కొన్ని సమస్యలను ఎదుర్కొనక తప్పదు. కానీ ఇక్కడ ఫేస్బుక్ , తన ప్రైవసీ విషయమై సత్వర చర్యలకు పూనుకోవడం ఆహ్వానించదగ్గ విషయమే. ఇక్కడ మీకు మేము కొన్ని ప్రైవసీ సెటింగ్స్ మార్పులను చెప్పబోతున్నాము. వీటిని పాటించడం ద్వారా మీ వివరాల గోప్యత దృష్ట్యా అడుగులు వేయవచ్చు.

కొన్ని అప్లికేషన్ల కు పర్మిషన్ ను తిరస్కరించండి:

ఫేస్బుక్ సెటింగ్స్ లో apps విభాగం లో కి వెళ్ళండి. ఈ పేజీలో మీరు ఇప్పటి వరకు ఏఏ అప్లికేషన్స్ కు పర్మిషన్ ఇచ్చారో లిస్ట్ చేయబడి ఉంటుంది. వీటిలో మీకు అవసరం లేనివి, అనుమానితమైనవి చెక్ చేసుకుని, పైన రిమూవ్ బట్టన్ క్లిక్ చేసి తొలగించడమే. అన్నీ అప్లికేషన్స్ ఒకే రకమైన వివరాలను తీసుకోవు. కానీ కొన్ని అప్లికేషన్స్ ఎక్కువగా మీ వివరాలను సేకరిస్తున్నాయని మీరు అనుమానిస్తే, ఎడిట్ (పెన్సిల్ ఐకన్) క్లిక్ చేసి, కొన్ని అవసరం లేని విషయాలను సేకరించకుండా మార్పులు చేసుకునే వెసులుబాటు కూడా ఉన్నది. ఉదాహరణకు ఫోటోలు, వర్క్ హిస్టరీ ఇలాంటివి కొన్ని అప్లికేషన్స్ అవసరం లేకపోయినా సేకరిస్తుంటాయి. కావున వీటి వరకు తొలగించి అవసరమైన వివరాలను మాత్రమే ఆ అప్లికేషన్ తీసుకునేలా మార్పులు చేయవచ్చు కూడా. లేదా అప్లికేషన్ ను పూర్తిగా తొలగించండి.

స్నేహితుల అప్లికేషన్స్ మీ వివరాలను సేకరించకుండా :

Apps settings పేజీ లో కాస్త కిందుగా వెళ్తే, "apps others use" అని కనిపిస్తుంది. ఇక్కడ మీ స్నేహితులు అప్లికేషన్స్ లో మీ వివరాలను వినియోగిస్తున్నట్లయితే వాటిని తొలగించవచ్చు. నిజానికి ఫేస్బుక్ ఇలాంటి అప్లికేషన్లను ఎక్కువగా తొలగించింది కూడా. అయినా కొన్ని అప్లికేషన్స్ కనిపిస్తూ ఉంటే, స్వేచ్ఛగా ఆ పర్మిషన్స్ ను తొలగించుకునే వెసులుబాటు ఉంది. కానీ ఈ మద్యనే ఈ ఫీచర్ తొలగించబడినది అని కూడా కనిపిస్తూ ఉంది. పాత వర్షన్ ఫేస్బుక్ వినియోగదారులకు మాత్రమే ఈ సెటింగ్స్ ఉంటాయి. అప్డేట్ చేసుకున్న వారికి ఉండవు. దీనికి కారణం అలాంటి అప్లికేషన్స్ మీ వివరాలను సంగ్రహించకుండా ఫేస్బుక్ పూర్తి స్థాయిలో అడ్డుకోవడమే. మరియు అలాంటి అప్లికేషన్లను తొలగించింది కూడా.

మీ ప్రొఫైల్ ను లాక్ చేయండి:

అప్లికేషన్స్ కు పర్మిషన్ ఇవ్వడం, ఇవ్వకపోవడం మీ ఇష్టం. కానీ ఇవన్నీ కాకుండా మీ ప్రొఫైల్ ను ఇతరుల కంటపడకుండా చూసుకునేలా కొన్ని అమర్పులు కూడా ఉన్నాయి. తద్వారా మీ ఫ్రెండ్స్ లిస్ట్, మీరు లైక్ చేసిన పేజీలు, మీ ప్రొఫైల్ పిక్చర్ వంటివి ఇతరుల కంట పడకుండా అమర్పులు చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook Privacy settings: Here’s what you should do More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot