ఇకపై వాట్సప్‌లోనూ యాడ్స్ గోల

By: Madhavi Lagishetty

ఫేస్ బుక్ ఈ సోషల్ యుగంలో ప్రతీ ఒక్కరికి అదే ఆహారం. ఆక్సీజన్ లేకుండా అయిన బతకగలం కానీ ఫేస్ బుక్ లేకుండా ఉండలేమంటున్నారు నెటిజన్లు. మరి ఇంతలా పాతుకుపోయిన ఫేస్ బుక్ ఊరుకుంటుందా.. తన కంపెనీకి చెందిన అన్నీ సోషల్ పోర్టల్స్ మీద యాడ్స్ తో దండెత్తడానికి రెడీ అయ్యింది.

ఇకపై వాట్సప్‌లోనూ యాడ్స్ గోల

ఫేస్‌బుక్ లో యాడ్స్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇంతకాలం ఫేస్ బుక్ అనుబంధ సంస్థలుగా ఉన్న వాట్సప్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో యాడ్స్ గొడవ లేదు. ఇప్పుడు ఫేస్‌బుక్ కు చెందిన అన్ని ప్లాట్ ఫార్మ్స్ మీద యాడ్స్ దండెత్తేందుకు రెడీ అవుతున్నాయి.

ఇంతకాలం ఫేస్ బుక్ యాడ్స్ ద్వారా భారీగా నగదు రెవెన్యూలను మూటగట్టింది. అయితే ఆ తర్వాత కొనుగోలు చేసిన వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులకు మాత్రం ఎలాంటి యాడ్స్ రెవెన్యూ లేకుండా కస్టమర్ ఫ్రెండ్లీగా నడిపింది. అయితే ఇఫ్పుడు వాట్సప్, ఇన్ స్ట్రాగ్రామ్ లకు కూడా భారీగా యూజర్స్ పెరిగిపోయారు. ఈ సారి మాత్రం ఆదాయం పెంచుకునే అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదని చెబుతోంది.

ఇక లెక్కల్లోకి వెళితే గత నెల ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తమ అనుబంధ సంస్థలు అన్నింటిలో కలిపి 200 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు తెలిపారు. అంతే కాదు కేవలం వాట్సప్ లో 120 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు తెలిపారు.

ఇక 70 కోట్ల దాకా ఇన్ స్టా గ్రామ్ యూజర్స్ ఉన్నారు. వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 2021 నాటికి సుమారు 22 బిలియన్ డాలర్ల యాడ్స్ రెవెన్యూ లక్ష్యంగా నిర్దేశించింది. కాగా 2016 లో ఫేస్ బుక్ ఆదాయం 27 బిలియన్ డాలర్లు గడించింది. మరి ఇంత భారీ అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పంది. సో ఇకపై మీ వాట్సప్ లో కూడా యాడ్స్ గోల తప్పదని డిసైడై పోండి

Read more about:
English summary
Facebook is now pushing ads to WhatsApp, Messenger and Instagram to generate more revenue.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting