Facebookలో క్విజ్ యాప్ ట్రై చేస్తున్నారా, అయితే మీ కొంప కొల్లేరే

ఈ మధ్య సోషల్ మీడియాలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఫోన్ చేతిలో ఉంది కదా అని ఏది బడితే అది ఓపెన్ చేయడం వల్ల కొంప కొల్లేరయ్యే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

|

ఈ మధ్య సోషల్ మీడియాలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఫోన్ చేతిలో ఉంది కదా అని ఏది బడితే అది ఓపెన్ చేయడం వల్ల కొంప కొల్లేరయ్యే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో దూసుకుపోతున్న facebook quiz appతో చాలా ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకెళితే.. ఫేస్‌బుక్‌లో బాగా పాపులర్‌ అవుతున్న నేమ్‌టెక్ట్స్‌ గురించి మీకు తెలిసే ఉంటుంది. మీరు ఏ సినిమాకి హీరోగా సూట్ అవుతారు, మీకు వయసెంత ఉంటుంది, మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు.. అనుకుంటూ పలు పాపులర్‌ సోషల్‌ క్విజ్‌లను నేమ్‌టెక్ట్స్‌ అనే యాప్‌ నిర్వహిస్తూ ఉంటుంది.

ఆండ్రాయిడ్ ఫోన్లకు అసలైన సవాల్, జియోఫోన్‌‌కు గూగుల్ ఫీచర్లుఆండ్రాయిడ్ ఫోన్లకు అసలైన సవాల్, జియోఫోన్‌‌కు గూగుల్ ఫీచర్లు

12 కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల డేటా

12 కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల డేటా

ఫేస్‌బుల్‌ చక్కర్లు కొడుతున్న ఈ యాప్‌ను, ప్రతి ఒక్కరూ ఏదో ఒక్కసారి ఓపెన్‌ చేసిన క్విజ్‌ ఆడి ఉంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరమట. ఈ నేమ్‌టెక్ట్స్‌ యాప్‌ 12 కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల డేటా బట్టబయలు చేసిందని ఓ రీసెర్చర్‌ వెల్లడించారు.

క్విజ్‌ల ద్వారా..

క్విజ్‌ల ద్వారా..

క్విజ్‌ల ద్వారా ఫేస్‌బుక్‌ యూజర్‌ పేరు, ప్రాంతం, పుట్టిన తేదీ, వయసు, ఫేస్‌బుక్‌ ఐడీ, ప్రొపైల్‌ ఫోటోలు, భాష, స్నేహితుల జాబితా వంటి వ్యక్తిగత వివరాలను ఇది సేకరిస్తుందని తెలిసింది. ఈ విషయాన్ని సెక్యురిటీ రీసెర్చర్‌ స్యూకెలైర్‌ తన బ్లాగ్‌లో వెల్లడించారు.

గత కొన్నేళ్లుగా

గత కొన్నేళ్లుగా

ఇలా గత కొన్నేళ్లుగా మిలియన్ల కొద్దీ యూజర్ల డేటాను నేమ్‌టెక్ట్స్‌ సేకరించిందని తెలిపారు. ఫేస్‌బుక్‌ బగ్‌ బౌంటీ ప్రొగ్రామ్‌లోపాల్గొనాలని నిర్ణయించుకున్న ఈ రీసెర్చర్‌, క్విజ్‌లపై పరిశోధన చేపట్టారు.

నేమ్‌టెక్ట్స్‌.కామ్‌

నేమ్‌టెక్ట్స్‌.కామ్‌

ఆ సమయంలో నేమ్‌టెక్ట్స్‌.కామ్‌ గ్లోబల్‌గా 12 కోట్ల మంది యూజర్ల డేటాను బహిర్గతం చేస్తుందని తెలుసుకున్నారు. ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను దాని పేజీలో డిస్‌ప్లే చేస్తుందని కనుగొన్నారు. అంతేకాక, ప్రమాదశాత్తు ఈ డేటా అన్ని థర్డ్‌ పార్టీలకు అందుబాటులో ఉందన్నారు.

యూజర్లు డిలీట్‌ చేసినా..

యూజర్లు డిలీట్‌ చేసినా..

ఒకవేళ ఈ యాప్‌ను యూజర్లు డిలీట్‌ చేసినా కూడా యూజర్ల గుర్తింపునూ ఇది బహిర్గతం చేస్తుందని వెల్లడించారు. దీని బారి నుంచి బయటపడటానికి, యూజర్‌ తమ డివైజ్‌పై ఉన్న కుక్కీలను మాన్యువల్‌గా డిలీట్‌ చేయాల్సి ఉంటుందని రీసెర్చర్‌ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.

లోపాన్ని కనుగొన్న రీసెర్చర్‌..

లోపాన్ని కనుగొన్న రీసెర్చర్‌..

ఫేస్‌బుక్‌లో ఈ లోపాన్ని కనుగొన్న రీసెర్చర్‌, ఫేస్‌బుక్‌ డేటా అబ్యూజ్‌ ప్రొగ్రామ్‌కు రిపోర్టు చేశారు. ఈ లోపాన్ని పరిష్కరించాలని నేమ్‌టెక్ట్స్‌కు కూడా లేఖ రాశారు. ఫేస్‌బుక్‌ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.

సమస్యను పరిష్కరించడానికి

సమస్యను పరిష్కరించడానికి

నేమ్‌టెక్ట్స్‌.కామ్‌తో కలిసి ఈ సమస్యను పరిష్కరించడానికి పనిచేశామని, జూన్‌లోనే ఇది పరిష్కారమైందని ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌ పార్టనర్‌షిప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఇమ్ ఆర్చిబాంగ్ తెలిపారు.

Best Mobiles in India

English summary
Quiz App Left 120 Million Facebook Users' Data Exposed As Recently As Last Month more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X