ఫేస్‌బుక్‌లోకి సరికొత్త ‘గ్రీటింగ్స్’

Posted By: BOMMU SIVANJANEYULU

పోక్ (Poke) ఫీచర్‌ను మరింత అప్‌డేటెడ్ చేసే దిశగా ఫేస్‌బుక్ అడుగులు వేస్తోంది. తాజాగా ఈ ఫీచర్‌లోకి సరికొత్త గ్రీటింగ్స్‌ను ఫేస్‌బుక్ చేర్చింది. ప్రస్తుతానికి ఈ కొత్త గ్రీటింగ్స్‌ను బ్రిటన్, థాయిల్యాండ్, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫ్రాన్స్ దేశాల్లోని ఫేస్‌బుక్ యూజర్లు మాత్రమే ఉపయోగించుకోగలుతున్నారు.

ఫేస్‌బుక్‌లోకి సరికొత్త ‘గ్రీటింగ్స్’

త్వరలోనే మరిన్ని దేశాలకు ఈ సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫేస్‌బుక్ యూజర్లు వింక్ (కన్ను గీటడం), హై-ఫైవ్, హగ్, వేవ్ వంటివి సెండ్ చేసుకునే వీలుంటుంది.

పోక్ ఫీచర్ ఫేస్‌బుక్‌లోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు కావొస్తున్న సందర్భాన్ని పురస్కరించుకని ఈ కొత్త అప్‌డేట్‌ను ఫేస్‌బుక్ రిలీజ్ చేసింది. ఫ్రెండ్స్ ప్రొఫైల్‌లోని హల్లో బటన్ క్రింద ఈ సరికొత్త గ్రీటింగ్స్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఈ హల్లో బటన్ సదుపాయాన్ని ఫేస్‌బుక్ కొద్ది నెలల క్రితమే అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. రియాక్షన్స్, స్టేటస్ వర్క్ వంటి ఫీచర్స్ మాదిరిగానే హల్లో బటన్ కూడా వర్క్ అవుతుంది.

ఫేస్‌బుక్‌ నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన గ్రీటింగ్స్ ఫీచర్ ప్రత్యేకమైన అండూ (undo) బటన్‌ను కలిగి ఉంటుంది. ఈ బటన్ ద్వారా పొరపాటున వేరొకరికి పంపిన గ్రీటింగ్స్‌ను వెనక్కి తీసుకునే వీలుంటుంది.

ఇండియాలో ఇంటర్నెట్ వేగం ఎంతో తెలుసుకోండి !

ఫేస్‌బుక్‌ ఈ గ్రీటింగ్స్ ఫీచర్స్‌తో పాటు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నవారిని గుర్తించేందుకు అవసరమైన కొత్త టూల్‌ను కూడ అనౌన్స్ చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఈ టూల్ ఆత్మహత్య భావాలతో ఉన్న ఫేస్‌బుక్‌ పోస్టులను ఐడెంటిఫై చేసి వాటి విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది.

గొత కొద్ది నెలలుగా చూసినట్లయితే ఫేస్‌బుక్ నుంచి అనేక సెక్యూరిటీ రిలేటెడ్ అప్‌డేట్‌లతో పాటు సేవా తత్పురతతో కూడిన ఫీచర్లు లాంచ్ అవుతున్నాయి. భారత్‌లోని రక్త దాతలు బ్లడ్ బ్యాంకులకు కనెక్ట్ అయ్యేందుకు వీలుగా సరికొత్త ఫీచర్‌ను ఫేస్‌బుక్ అనౌన్స్ చేసింది.

English summary
Facebook users will soon be able to send a variety of 'greetings to interact with their friends in a unique way.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot